E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణి ప్లాన్‌ సక్సెస్‌ – గంగలో కలిసిపోయిన దుగ్గిరాల పరువు

Brahmamudi Serial Today October 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణి ప్లాన్‌ సక్సెస్‌ – గంగలో కలిసిపోయిన దుగ్గిరాల పరువు
Advertisement

Brahmamudi serial today Episode:  కావ్య బాధపడుతూ బయట కూర్చుని ఉంటే మూర్తి వచ్చి ఓదారుస్తాడు. నీ తల్లి తనం కోసం నువ్వు చేస్తున్న పోరాటంలో తప్పేం లేదమ్మా అని చెప్తాడు. నా యుద్దమే నా భర్తతో చేయాల్సి వస్తుంది నాన్న అంటూ బాధపడుతుంది. దీంతో మనలో తప్పు లేనప్పుడు ఆ దేవుడితోనైనా యుద్దం చేయోచ్చని ఆ దేవుడే మనకు వరం ఇచ్చాడమ్మా నువ్వు చేస్తున్న టైంలో తప్పేం లేదమ్మా అని చెప్పగానే.. కావ్య మరింత బాధపడతుంది. రామ్మూర్తి కూడా ఎమోషనల్‌ అవుతాడు. గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుని బాధపడతాడు. అయితే నేను లేకుండా మాత్రం ఆయన ఉండలేరు నాన్న ఆయన మనసులో నాకు అంత స్థానం ఇచ్చారు. ఆయన నా కోసమైనా వస్తారు.. కనీసం కారణం అయినా చెప్తారు.. అంటూ కావ్య ఎమోషనల్‌ అవుతుంది. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరుగుతుంది. సంకల్పం ఎప్పటికీ ఓడిపోదు.. ఇప్పటికే చాలా పొద్దు పోయింది. వెళ్లి పడుకో తల్లి అంటూ చెప్పి మూర్తి వెళ్లిపోతాడు.

రాజ్‌ ఒంటరిగా కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తూ నన్ను నమ్మి నా దారికి రావొచ్చు కదా కళావతి అనుకుంటాడు. ఇక్కడ మూర్తి ఇంట్లో కూర్చున్న కావ్య కూడా నా ప్రాణం అడిగినా ఇస్తాను కానీ నా బిడ్డ ప్రాణాన్ని వదులుకోలేను అంటుంది. కానీ నాకు నీ ప్రాణమే ముఖ్యం నిన్ను నేను వదులుకోలేను అంటాడు. కోపంతో గొడవలు పడి విడిపోయేవాళ్లను చూశాను. కానీ ఇలా ప్రేమిస్తూ విడిపోయేవాళ్లు కూడా ఉంటారా..? అంటుంది కావ్య. ప్రేమించాను కాబట్టే కాపాడుకోవాలి అనుకుంటున్నాను.. అంటాడు రాజ్‌.. మీకు దూరంగా నేను ఉండలేనండి అంటుంది కావ్య.. నేనూ ఉండలేను ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను.. తిరిగి కలుస్తాను.. అంటాడు రాజ్‌. మన బిడ్డతో తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతాను. మన బిడ్డను కళ్లారా చూసైనా మీ మనసు మారుతుందని ఆశపడుతున్నాను అనుకుంటుంది కావ్య. ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు.

Advertisement

అందరూ హాల్లో కూర్చుని ఉంటే రాజ్‌ వచ్చి ఏంటి అందరూ సోఫాలో మీటింగ్‌ పెట్టారు టైం అవుతుంది ఎవ్వరూ టిఫిన్‌ చేయరా..? అంటూ అడగ్గానే.. సుభాష్‌ మేము ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాము అని చెప్తాడు. అప్పుడే ఇంద్రాదేవి తేన్పుతుంది. దీంతో రాజ్‌ మరి ఆ తేన్పులేంటి..? అందరూ పుల్లుగా తినేసినట్టు అలా వస్తున్నాయి అని అడగ్గానే.. అవి తినడం వల్ల వచ్చిన తేన్పులు కాదు.. తినకపోవడం వల్ల వచ్చిన తేన్పులు అని అపర్ణ చెప్తుంది. ఏంటి ఈ మధ్య అలా కూడా వస్తున్నాయా..? అని రాజ్‌ అడగ్గానే.. ప్రకాష్‌ కూడా ఈ మధ్య కొత్తగా స్టార్ట్‌ అయ్యాయిలేరా అంటూ తాను కూడా తేన్పుతాడు. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇంద్రాదేవి చూశారా..? చూశారా వాడికి కూడా వచ్చాయి ఆకలి తేన్పులు.. అని చెప్తుంది. ప్రకాష్‌ కూడా అవును ఆకలి తేన్పులు.. అని చెప్తాడు.

ఇంతకీ ఈ దీక్షలు ఎందుకో.. అని రాజ్‌ అడగ్గానే.. ఎందుకేంటి రాజ్‌ మా దీక్ష కావ్య కోసమే అని ధాన్యలక్ష్మీ చెప్తుంది. అయితే మీరు ఇలాగే దీక్షలు చేసుకోండి నాకు మాత్రం ఆకలిగా ఉంది.. నేను వెళ్లి టిఫిన్‌ చేస్తాను అంటూ వెళ్తాడు. దీంతో అందరూ కలిసి రాజ్‌ను ఇరిటేట్‌ చేసి కావ్యను తీసుకొచ్చేలా చేయాలని ప్లాన్‌ చేసి అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్తారు. అందరూ కలిసి రాజ్‌కు ఇరిటేషన్‌ వచ్చేలా మాట్లాడతారు. దీంతో రాజ్‌ టిఫిన్‌ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అపర్ణ కంగారుగా అత్తయ్య కొంపదీసి నిజంగానే ఫుడ్డు తినకుండా ఉంటాడా..? అని బాధపడుతుంది. దీంతో ఇంద్రాదేవి నీ ముఖం ఆకలికి తట్టుకోలేక కావ్యను తీసుకొస్తాడు చూడు అంటూ నవ్వుతుంది. పై నుంచి అంతా చూస్తున్న రుద్రాణి.. అందరూ హాయిగా నవ్వుకుంటున్నారా..? చెప్తాను అని మనసులో అనుకుంటుంది.

Advertisement

మరోవైపు కనకం ఇంటికి మీడియా వాళ్లు వెళ్లి కావ్యను మీరు మీ ఆయన మీద గొడవ పడి పుట్టింటికి వచ్చారని మాకు తెలిసింది అది నిజమేనా అని అడుగుతారు. మీకు అన్యాయం జరిగితే చెప్పండి మా మీడియా మొత్తం మీకు సపోర్టుగా నిలబడతాం అని చెప్తారు. దీంతో కావ్య వాళ్లను తిడుతుంది. ప్రశ్న మీరే సమాధానం మీరే వేసుకుంటే నేనేం మాట్లాడాలి అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మీడియా వాళ్లు కనకాన్ని ప్రశ్నించగానే కనకం కోపంగా మాట్లాడుతూ లోపలికి వెళ్లిపోతుంది. కావ్య కూడా లోపలికి వెళ్లి డోర్‌ వేస్తుంది.

దీంతో మీడియా వాళ్లు కావ్యకు అండగా ఉంటామని రాజ్‌ అన్యాయం చేస్తే ఊరుకోమని న్యూస్‌ వేస్తుంటారు. అది చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్‌ అవుతుంది. చాన్స్‌ దొరికింది కదా అని రుద్రాణి అందరి ముందు కావ్యను తిడుతుంది. కావ్య చేసిన పనికి రేపటి నుంచి రోడ్డు మీదకు ఎలా వెళ్లాలో.. తల ఎత్తుకుని ఎలా తిరగలము.. ఇన్ని రోజులు గుట్టుగా ఉన్న మన ఇంటి పరువును రచ్చబండ ఎక్కేటట్టు చేసింది అంటూ నిందిస్తుంది. రాజ్‌ను రెచ్చగొడుతుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×