E-Paper
Advertisement

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య కోసం కనకం ఇంటికి వెళ్లిన రాజ్‌
Advertisement

Brahmamudi serial today Episode: ఇంట్లో అలిగి పుట్టింటికి వెళ్లిన కావ్యను కనకం ఏమైందని ప్రశ్నిస్తుంది. ఒక్కదానివే వచ్చావేంటి..? అని అడుగుతుంది. దీంతో కావ్య కోపంగా కనకాన్ని తిట్టి తినడానికి ఏదైనా టిఫిన్‌ చేయమని చెప్పి లోపలికి వెళ్తుంది. దీంతో కనకం దీనికి ఏమైందండి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని మూర్తిని అడుగుతుది. అక్కడ ఏదో జరిగింది కాబట్టే అమ్మాయి ఇలా మాట్లాడుతుంది. నువ్వు వెంటనే అపర్ణ గారికి ఫోన్‌ చేయ్‌ విషయం తెలుస్తుంది అని మూర్తి చెప్పగానే.. సరే అంటూ కనకం ఫోన్‌ చేయబోతుంటే.. కావ్య ఫోన్‌ లాక్కుని ముందు నాకు తినడానికి ఏదైనా చేయ్‌ ఫోన్‌ తర్వాత మాట్లాడుదువు అని చెప్పా ఫోన్‌ తీసుకుని లోపలికి వెళ్తుంది కావ్య.

మరోవైపు అపర్ణ కూడా కనకానికి ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఈ టైంలో కనకం ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదేంటి అని  కంగారు పడుతుంది. దీంతో రుద్రాణి నీకు ఇంకా అర్థం కాలేదా వదిన ఒకవేశ నిజంగానే కావ్య అక్కడికి వెళ్లి ఉంటే కనకం ఆగుతుందా..? తన కూతురు పుట్టింటికి ఎందుకు వచ్చిందా అని ఆరా తీయడానికైనా ఫోన్‌ చేస్తుంది. కదా..? అలా చేయలేదంటే.. కనకానికి కావ్య వెళ్లిపోయిందన్న విషయం తెలియలేదు. కాబట్టి ముందు కావ్య కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌ లో కేసు పెట్టడం మంచిది అంటూ సలహా ఇస్తుంది రుద్రాణి. దీంత అపర్ణ కోపంగా రాజ్‌ను తిడుతుంది. ఏరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా..? నువ్వు అనుకున్నది సాధించావు కదా..? నీ మొండితనంతో నీ భార్య మీద నువ్వు పై చేయి సాధించావు.. వెళ్లు వెళ్లి నా భార్య మీద పై చేయి సాధించానని డప్పు కొట్టుకో అంటుంది.

Advertisement

ఇంద్రాదేవి బాధగా రాజ్‌ కావ్యకు ఏదైనా జరిగితే మాత్రం ఈ దుగ్గిరాల కుటుంబానికి పతనం మొదలైనట్టే అంటుంది. దీంతో రాజ్‌ అలాంటి రోజు ఎప్పటికీ రాదు నాన్నమ్మ. కళావతి ఎక్కడికి వెళ్లిందో నాకు బాగా తెలుసు. ఎలా వెళ్లిందో అలా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది నేను తీసుకొస్తాను అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. తర్వాత లోపలికి వెళ్లిన అప్పు కనకం ఫోన్‌కు కాల్‌ చేస్తుంది. ఫోన్‌ కలవదు. దీంతో అప్పు కోపంగా తన ఫోన్‌ విసిరి వేస్తుంది. దీంతో కళ్యాణ్‌ నువ్వేం కంగారు పడకు పొట్టి అన్నయ్య వెళ్లారు కదా తీసుకురావడానికి అంటాడు. దీంతో అప్పు బాధపడుతూనే ఉంటుంది.

మరోవైపు కావ్య డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని అమ్మా టిఫిన్‌ రెడీ అయిందా…? అంటూ కేకలు వేస్తుంది. అమ్మా ఎంత సేపు అయిందా..? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అంటుంది. ఆగవే వస్తున్నాను..నువ్వు ఆకలితో కాదు కోపంతో చచ్చిపోయేలా ఉన్నావు అంటూ టిఫిన్‌ తీసుకుని వెళ్తుంటే.. మధ్యలో మూర్తి ఆపేసి కనకం ఎప్పుడూ లేనిది అమ్మాయేంటి..? ఇంత కోపంగా ఉంది అంటాడు. దీంతో మీరేం కంగారు పడకండి దాని కోపానికి కారణాలేంటి నేను కనుక్కుంటాను కదా అంటుంది కనకం. అమ్మాయిని ఎక్కువగా విసిగించకు అంటాడు మూర్తి. విసిగించకపోతే ఏం జరిగిందో ఎలా చెప్తుంది.. మీరు ఉండండి నేను కనుక్కుంటాను. అంటూ కావ్య దగ్గరకు వెళ్లి టిఫిన్‌ పెడుతుంది. అమ్మా కావ్య టిఫిన్ ఎలా ఉంది… అని అడగ్గానే..

Advertisement

టిఫిన్‌ లాగే ఉందని కావ్య అంటుంది. దీంతో కనకం కోపంగా ఏంటే ఏది అడిగినా అలా కసుకుంటావేంటి..? ఏం జరిగింది అంటే చెప్పవు..ఎందుకు వచ్చావంటే చెప్పవు.. అసలు నువ్వు ఇలా వచ్చావని ఇంట్లో వాళ్లకు చెప్పావా… పాపం నీ గురించి వాళ్లు కంగారు పడతారే అంటూ తిడుతుంది. ఇంతలో రాజ్‌ అక్కడికి వచ్చి మా గురించి ఆలోచిస్తే ఇలా చెప్పా పెట్టకుండా ఎలా వస్తుంది అత్తయ్యగారు అంటాడు దీంతో కావ్య కోపంగా నేనేం చెప్పాపెట్టకుండా రాలేదు.. లెటర్‌ రాసే వచ్చాను అని చెప్తుంది కావ్య. ఏంటి లెటర్‌ రాసి రావడం.. నీకు కొంచెమైనా బుద్ది ఉందా..? ఇంట్లో వాళ్లు ఎంత టెన్షన్‌ పడతారో తెలుసా..? అని రాజ్‌ చెప్పగానే.. మీ వల్ల నేను ఎంత టెన్షన్‌ పడుతున్నానో తెలుసా.. ? అంటుంది కావ్య. దీంతో రాజ్‌ ఆ విషయంలో నా నిర్ణయం మారదు అంటాడు రాజ్‌.

దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మధ్యలో కనకం కలగజేసుకుంటే.. విషయం తెలియక మాట్లాడుతున్నావని కావ్య చెప్తుంది. మీరు కారణం చెబితేనే వస్తానని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. ఇక కళ్యాణ్ అప్పు దగ్గరకు వెళ్లి వదిన మీ ఇంట్లోనే  ఉందట ఇక నువ్వు టెన్షన్‌ పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్తాడు. దీంతో అప్పు నిద్రపోతుంది. ఇంతలో కనకం అప్పుకు ఫోన్‌ చేస్తుంది. నిద్రలో ఉన్న అప్పు ఫోన్‌ తీయదు. దీంతో కనకం, మూర్తి మరింత టెన్షన్‌ పడుతుంటారు. ఇంతలో రాజ్‌ ఇంటికి వెళ్తాడు. రాజ్‌ ఒక్కడే రావడం చూసిన అపర్ణ రాజ్‌ను అపర్ణ తిడుతుంది. దీంతో రాజ్‌ తాను తన పుట్టింట్లోనే ఉందని ఎంత అడినా రావడం లేదని ఇక తనను కాళ్లు పట్టుకుని బతిమాలాలా..? అంటాడు రాజ్‌. దీంతో రాజ్‌ను అందరూ తిడతారు. నువ్వేం చేస్తావో దాన్ని నువ్వు ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు అది నా కోడలిగా ఇంటికి రావాలి నువ్వే తీసుకురావాలి అని చెప్పగానే.. తను వస్తే రాని లేకపోతే లేదు.. నేను మాత్రం బతిమాలను అంటూ రాజ్‌ రూంలోకి వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×