E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 6th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీ గురించి నింజ తెలుసుకున్న రాహుల్‌

Brahmamudi Serial Today November 6th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీ గురించి నింజ తెలుసుకున్న రాహుల్‌
Advertisement

Brahmamudi serial today Episode:     

గోల్డ్‌ బాబుతో కలిసి మందు తాగుతూ కూయిలీ డాన్స్‌ చేస్తుంది. అది చూసి తట్టుకోలేని రాహుల్‌ గోల్డ్‌ బాబును పక్కకు తోసేసి కూయిలీతో డాన్స్‌ చేస్తుంటాడు. దీంతో గోల్డ్‌ బాబు కోపంగా కూయిలీ నాకు ఇక్కడ ఎంటర్‌టైన్‌ మెంట్‌ తగ్గింది. నేను నాఫ్రెండ్‌ ఇంటికి వెళ్లిపోతాను అని అరవగానే.. ఏమైంది బావ సెటప్‌ నచ్చలేదా..? మ్యూజిక్‌ నచ్చలేదా..? అని అడుగుతుంది. దీంతో గోల్డ్‌ బాబు గ్లాస్‌లో డ్రింక్‌ అయిపోతే ఇచ్చేవాళ్లు లేరు కూయిలీ అంటాడు. దీంతో ఇప్పుడే ఇస్తాను ఒక్క నిమిషం ఆగు బావ నేను తీసుకొస్తాను అని వెళ్లి మందు తీసుకొచ్చి గోల్డ్ బాబుకు ఇస్తుంది. మందు తీసుకున్న గోల్డ్‌ బాబు మరి నాతో కలిసి డాన్స్‌ చేసే వాళ్లు లేరు కదా నేను వెళ్లిపోతాను అంటాడు.

దీంతో కూయిలీ బావ నేను ఉన్నాను కదా బావ అంటుంది. దీంతో రాహుల్‌ మరి నా సంగతేంటి..? అని అడగ్గానే.. మనం ఎప్పుడైనా డాన్స్‌ చేయోచ్చు రాహుల్‌ కానీ పాపం ఇంటికి వచ్చిన మీ అన్నయ్యను డిసప్పాయింట్‌ చేసి పంపిస్తామా..? నువ్వు పక్కకు వెళ్లు రాహుల్‌ అని తోసేస్తుంది. రాహుల్‌ రాజ్‌, కావ్య ముందుకు వెళ్లి పడతాడు. ఇప్పటికైనా అర్థం అయిందా.. నీ గర్ల్‌ఫ్రెండ్‌కు నీకంటే డబ్బు ముఖ్యం కాబట్టే నిన్ను పక్కన పెట్టి వాణ్ని ఇంప్రెస్‌ చేస్తుంది అంటాడు రాజ్‌. మా అక్క ఏ రోజైనా అలా చేసిందా..? నిన్ను ఇంకొకరి ముందు అవమానించిందా..? ఎవరు ఏంటో ఇప్పటికైనా తెలుసుకో అంటుంది కావ్య.. ఒరేయ్‌ నిజంగా కూయిలీ కోటీశ్వరురాలే అయితే నువ్వుండగా వాడి వెంట ఎందుకు పడుతుంది. వాడి బిజినెస్‌ డబ్బులు తన కంపెనీలో ఇన్‌వెస్ట్‌ ఎందుకు చేయమని అడుగుతుంది అని రాజ్‌ చెప్పగానే..

Advertisement

రాహుల్‌ కోపంగా వెళ్లి మందు కొడుతుంటాడు. డాన్స్‌ చేసుకుంటూ రాహుల్‌ దగ్గరకు వెళ్లిన గోల్డ్‌ బాబు తనకు మందు కలిపి ఇవ్వమని అడుగుతాడు. రాహుల్‌ కోపంగా చూస్తుంటే.. కూయిలీ మందు కలిపి ఇవ్వమని చెప్తుంది. దీంతో రాహుల్‌ మందు కలిపి ఇస్తాడు. చెప్పేది అర్థం అవుతుంది కదరా..? ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇంటికి వచ్చేయ్‌ స్వప్నను అర్థం చేసుకో నీకు స్వప్నే  మందు కలిపి ఇస్తుంది అంటూ రాజ్‌ చెప్పగానే.. రాహుల్‌ కోపంగా రాజ్‌ను తిట్టి పక్కకు వెళ్లిపోతాడు. తర్వాత అందరూ కలిసి డాన్స్‌ చేస్తుంటారు.. రాహుల్‌ పుల్లుగా మందు కొట్టి పడిపోతాడు.. డాన్స్‌ చేస్తున్న రాజ్‌, కావ్యను చూసి కూయిలీ మీరు నిజంగా ముసలి వాళ్లేనా..? అని అనుమానిస్తుంది. వెంటనే కావ్య నడుము నొప్పి అంటూ నాటకం ఆడగానే.. కూయిలీ నిజంగా ముసలి వాళ్లే అంటుంది. ఇంతలో గోల్డ్‌ బాబు.. మ్యాటర్‌ డైవర్ట్‌ చేస్తాడు. వెంటనే కూయిలీ వెళ్లిపోతుంది.

తర్వాతి రోజు కావ్య, రాజ్‌ నిద్ర లేచి హాల్లోకి రాగానే గోల్డ్‌ బాబు, రాహుల్‌ దగ్గర పడుకుని ఉంటాడు. వెంటనే వెళ్లి రాజ్ కోపంగా గోల్డ్‌ బాబును నిద్ర లేపుతాడు. గోల్డ్‌ బాబు ఏంటి బావ పొద్దుపొద్దునే అని అడగ్గానే.. అరేయ్‌ గోల్డ్‌ మనం ఏం ప్లాన్ చేశామో గుర్తు ఉందా..? రాహుల్‌ గాడు నిద్ర లేవగానే.. నువ్వు కూయిలీ రూంలో ఉండాలి అని చెప్పగానే.. అవును బావ మర్చిపోయాను.. అంటూ గోల్డ్‌ బాబు తన బనీను మీద పెట్టుకుని లిప్టిక్‌ గుర్తులు చూపిస్తాడు. ఏంటిరా ఇది అని రాజ్‌ అడగ్గానే.. పొద్దునే ప్లాన్‌ కోసం రాత్రే నేను ఇవాళ సెట్‌ చేసుకున్నాను.. అని చెప్పగానే.. నీ దగ్గర చాలా ఉన్నాయిరా..? అని రాజ్‌ అనగానే.. మరి ఉండవా సింగిల్‌ టేక్‌ ఆర్టిస్టుని కదా అంటాడు..

Advertisement

ముందు కూయిలీ రూంలోకి వెళ్లరా ఆ రాహుల్‌ గాడు నిద్ర లేస్తాడు అని చెప్పగానే.. గోల్డ్‌ బాబు వెల్లి కూయిలీ పక్కన పడుకుంటాడు. గోల్డ్‌ బాబు వెళ్లిపోగానే.. రాజ్‌, కావ్య ఇద్దరూ కలిసి రాహుల్‌ను నిద్ర లేపుతారు.. కోపంగా గోల్డ్‌ బాబును తిడుతూ రాహుల్‌ను రూంలోకి తీసుకెళ్లి చూపిస్తారు. గోల్డ్‌ బాబు, కూయిలీ కలిసి పడుకోవడం చూసిన  రాహుల్‌ షాక్‌ అవుతాడు. ఇద్దరిని నిద్ర లేపి రాహుల్‌ తిడతాడు., కూయిలీ అసలేం జరిగిందో నాకు తెలియదు అంటుంది. ఇక రాజ్‌, కావ్య తమ మాటలతో కూయిలీని తిడుతూ.. రాహుల్‌ను తిడతారు. కూయిలీ కోటీశ్వరురాలు కాదు.. కేరాఫ్‌ ప్లాట్‌ఫామ్‌ అని చెప్తారు. దీంతో రాహుల్‌ ఆలోచనలో పడిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×