E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీకి చుక్కలు చూపిస్తున్న రాజ్‌, కావ్య

Brahmamudi Serial Today November 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీకి చుక్కలు చూపిస్తున్న రాజ్‌, కావ్య
Advertisement

Brahmamudi serial today Episode: డైనింగ్‌ టేబుల్‌ దగ్గర అందరూ కూర్చుని ఉండగా రాజ్‌, కావ్య వస్తారు. అన్ని ఐటెమ్స్ వచ్చాయా అని అడుగుతారు. వచ్చాయని కూయిలీ చెప్పగానే.. మరి వడ్డించడానకి పని వాళ్లు లేరా అని అడుగుతారు. లేరని కూయిలీ చెప్తుంది. ఇంట్లో పని వాళ్లు కూడా లేని ఈ ఇంటి పిల్ల మన మనవడికి సరిపోదని చెప్తుంది కావ్య. అవును నిజమే అంటాడు రాజ్‌. అయితే ఇంట్లో పని వాళ్లు మ కంపెనీ సీక్రెట్స్‌ పక్క వాళ్లకు చెప్తున్నారని తీసేశామని చెప్తాడు రంజీత్‌. మరి మాకు ఎవరు వడ్డిస్తారు అని కావ్య అడగ్గానే.. మా కూయిలీ మీకు వడ్డిస్తుంది. అని చెప్తాడు.. దీంతో కూయిలీ కూడా అవును నేను వడ్డిస్తాను.. అంటూ వెళ్లి రాజ్, కావ్యకు కూయిలీ వడ్డిస్తుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్న రాజ్‌, కావ్య బయటకు ఉమ్మేసి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. కాకా హోటల్‌ నుంచి తెప్పించారా..? అని అంటాడు రాజ్‌…

రంజీత్‌ పలకకుండా ఉండిపోతాడు. కావ్య మాత్రం తిండి కూడా సరిగ్గా పెట్టని ఈ ఇంటి పిల్ల మన వాడికి ఎలా సరిపోతుందండి అంటుంది. అందుకే మన మనవడిని తీసుకుని వెళ్లిపోదాం పద అంటాడు రాజ్‌. దీంతో కూయిలీ.. అయ్యో తాతగారు.. బామ్మ గారు ఆగండి రేపు మీ కోసం ఇంత కన్నా పెద్ద హోటల్‌ నుంచి ఫుడ్డు తెప్పిస్తాను.. అని కూయిలీ చెప్పగానే.. రంజిత్‌ ఇంత కన్నా పెద్ద హోటలా..? అంటాడు. దీంతో రాజ్‌ ఏరా తెప్పించరా..? అంత సీన్‌ లేదా..? అని అడుగుతాడు.. దీంతో కావ్య అంటే అంత లోపల అంత డొల్ల అన్నమాట.. అంటుంది. అంటే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నుంచే కదా తెప్పించేద్దాం అంటాడు రంజిత్‌. దీంతో కావ్య కోపంగా అయితే మొత్తం హోటల్‌ తిండి పెట్టి నా మనవడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు..? అని అడుగుతుంది. వాన్ని చంపేద్దాం అనుకుంటున్నారు అని రాజ్‌ చెప్తాడు. అయినా గుండ్రాయి లాంటి ఆడది ఇంట్లో ఉండగా హోటల్‌ తిండి ఎందుకురా మనవడా నీకు అంటుంది కావ్య..

Advertisement

రాజ్‌ కూడా నాకు ఈ హోటల్‌ ఫుడ్డు అసలు పడదు.. అంటాడు. కావ్య కూడా నాకు అసలు పడదు అని చెప్తుంది. దీంతో రంజీత్‌ మీరే కదా హోటల్‌ పుడ్డు కావాలి అన్నారు అంటాడు. అన్నాము.. కానీ ఇప్పుడు వద్దంటున్నాము అనకూడదా అంటారు.. అనొచ్చు లేండి అంటుంది కూయిలీ.. అయితే రేపటి నుంచి ఈ కూయిలీ వంట చేస్తుంది అని కావ్య అనగానే.. బామ్మగారు నాకు వంట రాదు.. అని చెప్తుంది. అయితే ఇలాంటి దాన్ని చేసుకుని నా మనవడు ఏం సుఖపడతాడు ఇంక వద్దురా రాహుల్‌ వెళ్దాం పద ఇక్కడి నుంచి అని రాహుల్‌ అంటాడు. అయితే అంత దూరం ఎందుకు లేండి..? నేను వంట నేర్చుకుంటాను.. అని కూయిలీ చెప్తుంది. ఎలా నేర్చుకుంటావు.. ఎప్పుడు నేర్చుకుంటావు అని రాజ్‌ అడగ్గానే.. బామ్మ దగ్గర నేర్చుకుంటాను.. బామ్మే నాకు వంట నేర్పిస్తుంది అని కూయిలీ చెప్పగానే.. రాజ్‌ నవ్వుకుంటూ.. అయితే నీకు మరణ మృదంగం మొదలైనట్టే అని చెప్తాడు.

తర్వాత కూయిలీ దగ్గరకు వెళ్లిన రంజిత్‌ ఒక్క రోజే తిండికి 30వేలు బిల్లు చేశారు.. ఇలా అయితే ఇక మనం లక్షలు పెట్టాల్సి వస్తుంది వీరికి అని బాధపడతుంటే.. ఎం కాదులే మహా అయితే నాలుగు రోజులు ఉంటారు.. తర్వాత వాళ్ల దగ్గర ఉన్న కోట్ల ఆస్థి మనం కొట్టేయోచ్చు అని కూయిలీ చెప్తుంది. కానీ ఇప్పటికే మనకు లక్షల అప్పు ఉంది అంటాడు రంజీత్‌.. ఉండని కానీ వాళ్ల కోట్ల ఆస్థి మనకు వచ్చాక ఈ లక్షలు మనకొక లెక్కా అని మాట్లాడుకుంటుంటే చాటు నుంచి రాజ్‌, కావ్య వింటారు. పక్కకు వెళ్లి వీళ్లకు బుద్ది చెప్పాలంటే మరోకడు దిగాల్సిందే..? అంటూ డైమండ్‌ బాబును దింపుతాను అంటాడు రాజ్‌.  తర్వాత రాజ్‌, కావ్య కలిసి కూయిలీ చేత ఇంటి పని వంట పని చేయిస్తూ ఇరిటేట్‌ చేస్తుంటారు. వాళ్లు చేసే టార్చర్‌ భరించలేక ఇబ్బంది పడుతుంది కూయిలీ. అంతా చూస్తున్న రాహుల్‌ కోపంగా కావ్య, రాజ్‌ను తిడతాడు.. దీంతో కావ్య, రాజ్‌ మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతాము అని చెప్పగానే.. వద్దని నేను అన్ని పనులు చేస్తానని కూయిలీ రాహుల్‌ను తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×