E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ కు షాక్ ఇచ్చిన రాహుల్  

Brahmamudi Serial Today November 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ కు షాక్ ఇచ్చిన రాహుల్  
Advertisement

Brahmamudi serial today Episode:  

కళ్యాణ్‌, అప్పును తీసుకుని స్టేషన్‌కు వెళ్తూ ఇంట్లో వాళ్లు అడిగితే గుడికి వెళ్తున్నామని చెప్తాడు. అయితే ధాన్యలక్ష్మీ కళ్యాణ్‌ను ఆపేసి అప్పు చేతిలో గుడికి వెళ్లడానికి కొబ్బరికాయ ఉంది. కానీ నీ భుజానికి ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్‌, అప్పు షాక్‌ అవుతారు. బ్యాగా అంటే అది అంటూ కళ్యాణ్‌ నసుగుతుంటే.. అప్పు కల్పించుకని అది అత్తయ్యా బ్యాగ్‌ అంటే.. అని చెప్పబోతుంటే.. చెప్పు కళ్యాణ్‌ ఆ బ్యాగులో ఏం ఉన్నాయి అని అడుగుతుంది. వెంటనే కళ్యాణ్‌ బ్యాగులో నా లిరిక్‌ పేపర్స్‌ ఉన్నాయి. నిన్నటి నుంచి ఓ సాంగ్‌ రాద్దామంటే ఏ ఆలోచన రావడం లేదు.. అందుకే దేవుడి దగ్గర పెన్నులు పేపర్లు పెట్టి సాంగ్‌ రాద్దామని అనుకుంటున్నాము అది తప్పా.. అని ఎదురు ప్రశ్నిస్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ.. నేను  అడుగుతుంది. బ్యాగు ఎందుకు అంత ఎత్తుగా ఉంది. పెన్నులు, పేపర్లు అంత ఎత్తు ఉంటాయా..? అని ప్రశ్నించడంతో ఏం చెప్పాలో అర్థం కాక కళ్యాణ్, అప్పు చూస్తుంటే.. దేవుడికి సమర్పించడానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నారేమో అంటాడు ప్రకాష్.. దీంతో కళ్యాణ్‌, అప్పు కూడా అదే పట్టువస్త్రాలు తీసుకెళ్తున్నాము అని చెప్పి వెళ్లిపోతారు.

రాజ్‌, కావ్య ఆఫీసుకు వెళ్తాడు. మేనేజర్‌ సతీష్‌ కనిపిండం లేదని శృతిని అడుగుతారు. ఆయన రెండు రోజుల క్రితమే రిజైన్‌ చేసి వెళ్లారు. ఆయన రాహుల్ సార్‌ కంపెనీలో జాయిన్‌ అయ్యారంట సార్‌ అని శృతి చెప్పగానే.. రాజ్‌, కావ్య షాక్‌ అవుతారు. మీరు ఫోన్‌ చేసి మాట్లాడతారా..? సార్‌ అని శృతి అడగ్గానే.. లేదు కొత్త మేనేజర్‌ పోస్టుకు ఇంటర్వూ కండక్ట్‌ చేయండి. ఎవరు వచ్చినా నా దగ్గరకు పంపించు అని చెప్పగానే.. శృతి సరే అంటుంది.

Advertisement

మరోవైపు రాహుల్‌, సతీష్‌తో నీ ఎక్స్‌ ఫీరియన్స్‌ అంతా ఉపయోగించి స్వరాజ్‌ కంపనీతో ఉన్న క్లయింట్స్‌ మొత్తం మన కంపెనీకి వచ్చేలా చూడాలి అని చెప్పగానే.. అలా జరగదు సార్‌ వాళ్లంతా రాజ్‌ సార్‌ అంటే చాలా నమ్మకం అని మేనేజర్‌ సతీష్‌ చెప్పగానే.. వాళ్లకు నువ్వంటే కూడా నమ్మకమే కదా..? ఆ నమ్మకాన్ని ఉపయోగించి వాళ్లను ఒకరికి తెలియకుండా ఒకరిని మీటింగ్‌కు పిలువు అని రాహుల్‌ చెప్పగానే.. మేనేజర్‌ సతీష్‌ సరే సార్‌.. రేపే అందరినీ మీటింగ్‌కు పిలుస్తాను అంటూ వెళ్లిపోతాడు. రాజ్‌.. ఇక స్వరాజ్‌ గ్రూప్‌ కంపెనీ కోటలు కూలబోతున్నాయి.. ఆ కూలిని ఇటుకలతో ఆర్ కంపెనీ పునాదుతు కడతాను అనుకుంటాడు.

అప్పు స్టేషన్‌కు వెళ్లి మిస్సయి పోయిన పాప కేసుకు సంబంధించిన ఫైల్ తీసుకుని స్టడీ చేస్తుంది. కానిస్టేబుల్‌ దగ్గర వివరాలు తెలుసుకుంటుంది. ఇంతలో సీఐ దగ్గరకు వెళ్తుంది. అప్పు ను చూసిన సీఐ ఆశ్చర్యంగా ఏంటి అపూర్వ మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అయ్యావా..? అని అడగ్గానే.. అవును జాయిన్‌ అయ్యాను అని అప్పు చెప్తుంది. ఏంటి అమ్మా ఇంత సడెన్‌గా అని సీఐ అడగ్గానే.. మీరే అన్నారు కదా సార్‌ ఆ పాప కేసు చూడటానికి ఎవ్వరూ లేరు కావాలంటే నువ్వే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారు కదా సార్ అందుకే వచ్చాను సార్‌ అని చెప్పగానే.. నేను ఏదో కాజువల్‌గా అన్నాను అమ్మ అని సీఐ చెబితే నేను సీరియస్‌గా తీసుకున్నాను సార్‌ అంటుంది అప్పు. అది క్లోజ్‌ అయిన కేసు అమ్మా దానికి ఎందుకు టైం వేస్ట్ అని సీఐ చెప్పగానే.. ఏదో ప్రయత్నం చేయాలనిపించింది సార్‌ అని అప్పు చెప్పగానే.. నీకెలా చెప్పాలో నాకేమీ అర్తం కావడం లేదమ్మా.. అంటూ సీఐ వెళ్లిపోతాడు. అప్పు కానిస్టేబుల్‌ను తీసుకుని రేణుక ఇంటికి వెళ్తుంది.

Advertisement

ఆఫీసుకు వెళ్లిన కావ్య, రాజ్‌ ఫైల్స్‌ మొత్తం చెక్‌ చేస్తారు. అన్ని కరెక్టుగానే ఉన్నాయి. కానీ మరి ఎందుకు టర్నోవర్‌ తగ్గుతుంది అని ఆలోచిస్తారు. అందుకు డిజైన్స్‌ ను మార్చాలని డిసైడ్‌ అవుతారు. ఇక రేణుక దగ్గరకు వెళ్లిన అప్పు ఆమె వాయిస్‌ రికార్డు చేసుకుంటుంది. వివరాలు మొత్తం తెలుసుకుంటుంది. రేణుక ఏడుస్తూ వివరాలు చెప్తుంది. మీ పాపను నేను త్వరలోనే పట్టుకుంటాను అని అప్పు, రేణుకకు భరోసా ఇచ్చి పాప స్కూల్‌ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది. రాత్రికి అందరూ భోజనం చేస్తుంటే.. రాహుల్ వెళ్లి సతీష్‌ విషయం రాజ్‌ అడిగితే ఎలాగోలా మేనేజ్‌ చేయాలని మనసులో అనుకుని వెళ్తాడు. రాజ్‌కు అడగక ముందే రాహుల్‌ మేనేజర్‌ సతీష్ గురించి చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×