// // Brahmamudi Serial Today November 27th: - ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో ఒంటరి వాడైన సీతారామయ్య -  అప్పు చేతికి చెక్ ఇచ్చిన కళ్యాణ్ -->
E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో ఒంటరి వాడైన సీతారామయ్య –  అప్పు చేతికి చెక్ ఇచ్చిన కళ్యాణ్

Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో ఒంటరి వాడైన సీతారామయ్య –  అప్పు చేతికి చెక్ ఇచ్చిన కళ్యాణ్
Advertisement

Brahmamudi serial today Episode:  కళ్యాణ్‌ విషయంలో ప్రకాష్‌ ఏం చేయడం లేదని బెడ్‌ రూంలోంచి బయటకు గెంటేస్తుంది ధాన్యలక్ష్మీ. దీంతో ప్రకాష్‌ దుప్పటి కప్పుకుని రాజ్‌ రూం దగ్గరకు వచ్చి డోర్‌ కొడతాడు. రాజ్‌ ఆయోమయంగా సుభాష్‌ను చూడగానే నేనేం నీ పెళ్లాన్ని కాదురా నువ్వు చూడగానే వెళ్లి డోర్‌ తీయడానికి అంటాడు. రాజ్‌ వెళ్లి డోర్‌ తీసి ప్రకాష్‌ను చూసి షాక్‌ అవుతాడు. ప్రకాష్‌ లోపలికి వెళ్లి బెడ్‌ మీద కూర్చుంటాడు. రాజ్‌ ఎందుకొచ్చావు బాబాయ్‌ అని అడుగుతాడు. ఇంకెందుకు వచ్చాను ఇక్కడ నీ రూంలోనే బెడ్‌ షేర్‌ చేసుకుందామని వచ్చాను అంటాడు ప్రకాష్‌. వెంటనే దుప్పటి కప్పుకుని పడుకుంటాడు ప్రకాష్‌.

కావ్య ఆలోచిస్తూ ఇంటి మెట్ల మీద కూర్చుని ఉంటుంది. అపర్ణ వస్తుంది. ఇంతలో అపర్ణకు ఇందిరాదేవి ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అపర్ణ చెప్పండి అత్తయ్యగారు అంటూ అడుగుతుంది అపర్ణ. ఏం చెప్పమంటావు నువ్వేమో నీ కొడుకు మీద అలిగి పుట్టింటికి వెళ్లినట్టు నీ కోడలి ఇంట్లో కూర్చుని సంతోషంగా అది చేసి పెట్టే వంటలు తింటూ హాయిగా ఉన్నావు. కానీ నా పరిస్థితే దారుణంగా ఉంది అని ఇందిరాదేవి చెప్పగానే ఏమైంది అత్తయ్యా అని అపర్ణ అడుగుతుంది. ఏమవ్వడం ఏంటి..? ఇన్నాళ్లు నువ్వు నా బాగోగులు చూసుకునే దానివి. కావ్య వచ్చాక నాకు ఏ లోటు రాకుండా సాగింది.

Advertisement

ఇప్పుడు మీరిద్దరూ ఇంట్లో లేకపోయే సరికి నన్ను పట్టించుకునే వారు లేకుండా పోయారు. అదేంటత్తయ్యా నా కొడుక్కి బుద్ది చెప్పడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు అంటుంది అపర్ణ. ఏంటో ఈ గొడవలు వీలైనంత త్వరగా వాణ్ని మార్చి మీరిద్దరు ఇక్కడికి వచ్చేయండి. ఇళ్లంతా బోసి పోయినట్టు ఉంది అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. అత్తయ్యా ఈ మధ్య మీరు కూడా అబద్దాలు బాగానే ఆడుతున్నారు అంటుంది కావ్య. ఏంటి నేను చేసిన అబద్దపు వాగ్దానాలు..  నా కొడుకుతో గొడవ పడి ఇంత దాకా వస్తే నీకు వెటకారంగా ఉందా..? మీరు మీరు కొట్టుకుని బాగానే ఉన్నారు. కానీ మిమ్మల్ని కలపడానికి నేను చస్తున్నాను అంటుంది అపర్ణ.

నిద్రలో సుభాష్‌ గురక పెడుతూ రాజ్‌ మీద కాలు వేస్తాడు. మరోవైపు ప్రకాష్‌ కూడా గురక పెడుతుంటాడు. దీంతో నిద్ర లేచిని రాజ్‌ ఇరిటేటింగ్‌ గా ఇద్దరిని నిద్రవ లేపి ముందు మీరు అర్జెంట్‌ గా బయటకు వెళ్లండి అంటాడు. దీంతో నేను బయటకు వెళ్లాలంటే నువ్వు మీ అమ్మను తీసుకురా..? అంటాడు సుభాష్‌. నువ్వు వెళ్లి మీ పిన్నిని కన్వీన్స్‌ చేయ్‌ అంటడు ప్రకాష్‌. వాళ్లను కన్వీన్స్‌ చేయడం కంటే.. నేను వెళ్లి నేల మీద పడుకుంటాను అని కింద పడుకుంటాడు రాజ్‌. రాజ్‌ను చూసిన సుభాష్‌ వీడికి నిద్ర లేకుండా టార్చర్‌ పెడితే అలాగైనా కావ్యను తీసుకొస్తాడు అనుకుంటే కింద పడుకున్నాడు. లాభం లేదు రేపటి న నుంచి డోస్‌ పెంచాలి. అని మనసులో అనుకుంటాడు.

Advertisement

గార్డెన్‌ లో కూర్చుని పేపర్‌ చదువుతున్న సీతారామయ్య దగ్గరకు ఇందిరాదేవి వెళ్లి ఏంటి బావ ఇది కావ్య ఆఫీసులోంచి వెళ్లిపోయింది. అపర్ణ ఇంట్లోంచి వెళ్లిపోయింది. కానీ నువ్వేమీ పట్టనట్టు తాపీగా పేపర్‌ చదువుతున్నావు. అంటూ అడుగుతుంది. ఏం చేయమంటావు చెప్పు కావ్య ఆఫీసుకు రానంటుంది. రాజ్‌ నా మాట వినడం లేదు. కనీసం అపర్ణ అయినా తల్లిగా ఏదో ప్రయత్నం చేస్తుంది కదా..? చేయనివ్వు అంటాడు సీతారామయ్య. కానీ రాజ్‌ను ఇలాగే వదిలేస్తే.. వాడికి ఎవ్వరి అవసరం లేదన్నట్టు ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంటాడు అంటుంది ఇందిరాదేవి. మరేం చేయమంటావు అని సీతారామయ్య అడిగితే నువ్వు మళ్లీ పందెమే పెడతావో.. వాడి పొగరుకు కళ్లేమే వేస్తావో నాకు తెలియదు.. వాడు తిరిగి తల్లితో పాటు కావ్యను కూడా తీసుకొచ్చేలా నువ్వే చేయాలి అని ఇందిరాదేవి చెప్తుంది.

కిచెన్‌ లోకి వెళ్లిన ఇందిరాదేవి, పాలు వేడి చేస్తున్న ధాన్యలక్ష్మీని  చూస్తూ.. మీ మామయ్యగారికి ఇంత ఆలస్యంగానా పాలు ఇచ్చేది అని అడుగుతుంది. ఆ పాలు మామయ్యగారికి కాదని అవి తన కోసమని ధాన్యలక్ష్మీ చెప్తుంది. దీంతో ఇందిరాదేవి షాక్‌ అవుతుంది. ఇంతలో రాజ్‌ అక్కడికి వస్తాడు. పనిమనిషి శాంత ఎక్కడ అని ఇందిరాదేవి అడిగితే ఏమో అత్తయ్యా నాకు తెలియదు ఇంకా రాలేదేమో అంటుంది ధాన్యలక్ష్మీ. అయితే మీ మామయ్య గురించి పట్టించుకునే బాద్యత నీకు లేదా..? అంటూ ఇందిరాదేవి నిలదీయడంతో రుద్రాణి వస్తుంది.

ఇది మరీ దారుణం అమ్మా తన బాధ గురించి చెప్పినప్పుడు పట్టించుకోలేదు. పైగా వేరు కుంపటి పెట్టుకుంటాను అంటే వెటకారంగా మాట్లాడతారు అంటుంది రుద్రాణి. దీంతో చాల్లే దీన్ని చెడగొడుతుంది నువ్వే.. అంటుంది ఇందిరాదేవి. నేను చెడగొట్టడం లేదు అమ్మా అంటుంది రుద్రాణి. నువ్వు మా అత్తయ్య దగ్గర నుంచి  చాలా ఎక్స్‌పెక్ట్‌  చేస్తున్నావు రుద్రాణి. ఇన్ని రోజులు తన పెద్ద  కోడలు, కావ్య ఉండటం వల్ల అన్ని సాగిపోయాయి. ఇప్పుడు వాళ్లు లేరనేసరికి సడెన్‌గా మనం గుర్తుకు వచ్చాం. అంటూ ధాన్యలక్ష్మీ మాట్లాడుతుంది. రాజ్‌ కోసంగా ఏంటి పిన్ని ఇది అంటూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ధాన్యలక్ష్మీని, రుద్రాణిని తిడతాడు.

ఇంటికి వచ్చిన కళ్యాణ్‌, అప్పు కోసం వెతుకుతాడు. పైన బట్టలు ఆరేస్తున్న కళ్యాణ్‌ ఎగ్జైంటింగ్‌ గా వెళ్లి అప్పును కళ్లు మూసుకోమని చెప్పి చేతిలో చెక్‌ పెడతాడు. అది చూసిన అప్పు షాక్‌ అవుతుంది. రైటర్‌ చెక్‌ ఇచ్చాడా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఇది నీ సక్సెస్‌ కు మొదటి అడుగు. నా కూచి ఎప్పుడు గొప్పవాడు అంటూ కళ్యాణ్‌ను మెచ్చుకుంటుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×