E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 27th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: మళ్లీ డ్యూటీలో జాయిన్ కానున్న అప్పు

Brahmamudi Serial Today November 27th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: మళ్లీ డ్యూటీలో జాయిన్ కానున్న అప్పు
Advertisement

Brahmamudi serial today Episode:  

అప్పు, కళ్యాణ్‌ను తీసుకుని బయటకు వెళ్తుంది. దీంతో కళ్యాణ్‌ ఇరిటేటింగ్‌ గా పొట్టి ఇంత రాత్రి పూట నన్ను బయటకు ఎందుకు తీసుకొచ్చావు అని అడగ్గానే.. అలా అలా ప్రపంచం చూద్దామని తీసుకొచ్చాను అని అప్పు చెప్తుంది. నువ్వు నాకు ప్రపంచం చూపించినట్టు లేదు నరకం చూపించినట్టు ఉంది అంటాడు కళ్యాణ్‌. పర్వాలేదు ఇంకాస్త దూరమే అంటుంది అప్పు. ఏంటి నరకమా అని కళ్యాణ్‌ అడగ్గానే.. ఓహో నాతో తిరగడం అంత కష్టంగా ఉందా..? పెళ్లికి ముందు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి బైక్‌ వేసుకుని వచ్చేదాన్ని కదా అప్పుడే మర్చిపోయావా..? అని అప్పు అడగ్గానే.. వద్దు ఇంక ఆపు పొట్టి ఇంతకీ నీ మనసులో ఏముంది చెప్పు అని కళ్యాణ్‌ అడగ్గానే..

నాకు బాగా ఐస్‌క్రీమ్‌ తినాలని ఉంది అని అప్పు చెప్పగానే.. అయ్యో ఐస్‌క్రీమ్‌ అయితే వద్దు మొన్నే ఐస్‌క్రీమ్‌ తింటే పొద్దున్నే జలుబు చేసింది. అది చూసి మా అమ్మ నన్ను తిట్టింది అని కళ్యాణ్‌ చెప్పగానే.. అప్పు సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్పగానే.. కళ్యాణ్‌ ఆపు పొట్టి.. నీకు ఐస్‌ క్రీమ్ తినిపిస్తానులే.. కానీ కొంచెం మాత్రమే తినిపిస్తాను అంటాడు. అప్పు సరే పదా వెళ్దాం అంటుంది. ఇద్దరూ కలిసి వెళ్లి ఐస్‌క్రీమ్‌ తింటుంటారు. ఇంతలో అప్పుకు తాను పని చేసే పోలీస్‌ స్టేషన్‌ కనిపిస్తుంది. దీంతో ఒకసారి స్టేషన్‌లోకి వెళ్లి వస్తానని అప్పు స్టేషన్‌లోకి వెళ్తుంది. అక్కడ ఒకావిడ ఏడుస్తూ తమ పాప అంటూ బాధపడుతుంది. కానిస్టేబుల్‌ ఆమెను తిడుతుంటాడు. అప్పు వెళ్లి ఆ కానిస్టేబుల్‌ను తిట్టి ఏంటండి సమస్య అని అడుగుతుంది.

Advertisement

ఆవిడ ఏడుస్తూ సంవత్సరం నుంచి మా పాప కనిపించడం లేదు అని చెప్తుంది. ఆశ్చర్యంగా అప్పు సంవత్సరం నుంచా..? అని అడగ్గానే.. అవునమ్మా..? కంప్లైంట్‌ ఇచ్చాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మా పాపను వెతకండి అంటే వెతుకుతున్నాము అంటున్నారే తప్పా వెతకడం లేదు. రోజు ఇక్కడికి వస్తున్నాను.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మా పాపకు ఏమైందో తెలియక భయం వేస్తుంది అని ఏడుస్తుంది. అప్పు ఆమెను ఓదార్చి సీఐ సార్‌తో మాట్లాఇ చెప్తాను అంటూ లోపలికి వెళ్తుంది. సీఐని ఆ పాప విషయాలు అడిగి తెలుసుకుంటుంది. ఆ పాప చనిపోయిందని సీఐ చెప్పగానే.. అప్పు మరోసారి ఎంక్వైరీ చేద్దామని ఏదో ఒక క్లూ దొరుకుతుందని అప్పు అడగ్గానే.. సీఐ తనుక  అంత టైం లేదు.. చాలా కేసులున్నాయి.. దీని కోసమే నువ్వు ఇక్కడి దాకా వచ్చుంటే బయటకు వెళ్లు అని చెప్తాడు. దీంతో అప్పు బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రాజ్‌, కావ్య ఇంటికి వెళ్తారు.. రాజ్‌ భయంభయంగా కళావతి నీ బకెట్‌ లిస్ట్‌లో ఉన్న కోరికల్లనీ తీరిపోయాయి కదా..? ఇంకేం కోరిక లేదు కదా మళ్లీ డ్రమ్‌ లిప్ట్‌.. వాటర్‌ ట్యాంక్‌ లిస్టు అంటూ మళ్లీ మొదులు పెట్టవు కదా అని అడగ్గానే.. డ్రమ్‌, వాటర్‌ ట్యాంక్‌ లిస్టు ఏం లేదు కానీ ఒక చిన్న కోరిక అయితే ఉండిపోయిందండి అని కావ్య చెప్పగానే.. రాజ్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో అపర్ణ, సుభాష్‌ అక్కడికి వస్తారు. రాహుల్‌ మీద తమకు నమ్మకం లేదని.. ఏ నమ్మకంతో పది కోట్లు ఇన్వెస్ట్‌ చేసి ఎందుకు రిస్క్‌ తీసుకున్నారని అడుగుతారు. దీంతో రాజ్‌ మేము అన్ని విషయాలు అబ్జర్వ్‌ చేశామని రాహుల్ మన కింద పని చేయడం వల్లే అలా తప్పులు చేశాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తారు.

Advertisement

ఒకవేళ రాహుల్‌ వల్ల కంపెనీ నష్టపోతే ఏం చేయాలి అని సుభాష్‌ అడగ్గానే.. ఒక సంవత్సరం ఆదాయం పోయింది అనుకుందాం మామయ్య అని చెప్తుంది కావ్య. ఇంత రిస్క్‌ తీసుకుని రాహుల్‌ను మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని అపర్ణ అడగ్గానే.. సమన్యాయం కోసం అత్తయ్య నాకు అప్పు ఈ ఇంట్లో ఇచ్చిన విలువ మా అక్కకు రావాలని చెప్తుంది. అవును డాడీ కళావతి చెప్పింది నిజమే.. పోతే ఓ పది కోట్లు పోతాయి అని రాజ్‌ చెప్పగానే.. సరేలేరా రాహుల్‌, రుద్రాణి మారుతారు అనుకుంటే సంతోషమే అని చెప్పి సుభాష్‌, అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

స్టేషన్‌ లో తప్పిపోయిన పాప గురించి తలుచుకుని నిద్రలోంచి ఉలిక్కి పడి లేస్తుంది అప్పు. దీంతో కళ్యాణ్‌ షాక్‌ అవుతాడు. అప్పు బాధపడుతుంటే.. ఓదారుస్తాడు. అయితే తాను మళ్లీ డ్యూటీలో జాయిన్‌ అయి ఆ పాప కేసు రీ ఓపెన్‌ చేస్తానని చెప్తుంది. కళ్యాణ్ ఒప్పుకోడు.. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎవ్వరూ ఒప్పుకోరు అంటాడు. కానీ అప్పు అసలు ఒప్పుకోదు.. ఎలాగైనా కేసు రీ ఓపెన్‌ చేస్తానని చెప్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×