E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటో చెప్పాలన్న స్వప్న  

Brahmamudi Serial Today November 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆర్ ఫ్యాక్టరీ అంటే ఏంటో చెప్పాలన్న స్వప్న  
Advertisement

Brahmamudi serial today Episode:  

రాజ్‌ దగ్గరకు వెళ్లి  నీ ఫోన్‌ ఇవ్వు నా ఫోన్‌ హ్యాంగ్‌ అయింది అర్జెంట్‌ ఒక ఫోన్‌ చేయాలి అని చెప్పి రాజ్‌ ఫోన్ తీసుకుని వెళ్లిపోతుంది స్వప్న. ఫోన్‌ తీసుకుని రావడం చూసిన రాహుల్‌ ఆశ్చర్యపోతాడు. రాజ్‌ ఫోన్ తీసుకొచ్చావా..? ఎలా తీసుకొచ్చావు అని అడుగుతాడు.. తనను అడిగే తీసుకొచ్చానని కాల్ చేసుకుంటానని చెప్పాను.. ఈ ఫోన్‌ మళ్లీ లాక్‌ పడక ముందే ఓపెన్‌ చేసి చూడు అంటుంది స్వప్న దీంతో రాహుల్ ఫోన్‌ తీసుకుని చూసి నా అనుమానం నిజమే స్వప్న ఆర్‌ అనే పేరుతో కొత్త కంపెనీ ఎస్టాబ్లిస్ చేస్తున్నారు. దాని కోసం మన కంపెనీ నుంచి చాలా గోల్డ్‌ను లెక్కల్లో చూపించకుండా ఆ కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ కూడా చేస్తున్నారు. అని చెప్పగానే.. స్వప్న భయంతో అంటే స్వరాజ్‌ కంపెనీలో గోల్డ్‌ మిస్‌ అయిందంటే అందరూ నిన్నే కదా తప్పు పడతారు అంటుంది.

అసలు ఆర్‌ ఫ్యాక్టరీ అంటే ఏంటి..?  ఒకవేళ ఆర్‌ అంటే రాజ్‌ అయితే అని రాహుల్ అనుమానిస్తాడు. నువ్వు చెప్పింది నిజమయ్యే చాన్స్‌ ఉంది ఆర్‌ ఫ్యాక్టరీ అంటే రాజ్‌ ఫ్యాక్టరీయే అంటుంది స్వప్న. ఇది కేవలం మన అనుమానం మాత్రమే స్వప్న నిజం ఏంటో తెలియకుండా రాజ్‌ను వెళ్లి అడగలేం కదా..? నాకు చాలా భయంగా ఉంది స్వప్న అసలు రాజ్‌ కావ్య ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటాడు రాహుల్‌. దీంతో స్వప్న కోపంగా ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం కావాలంటే రాజ్‌, కావ్యలను అడగాల్సిందే.. అంటుంది. దీంత అలా ఎలా అడుగుతాం.. మనకు పూర్తిగా ఏమీ తెలియదు కదా అంటాడు రాహుల్‌. కానీ రాజ్‌, కావ్య అయితే ఆ కంపెనీకి ఫండ్స్‌ ట్రాన్సఫర్‌ చేసినట్టుగా ఈ ఫోన్ లో సాక్ష్యం అయితే  ఉంది కదా..?  దాని గురించే అడుగుదాం అంటుంది స్వప్న.

Advertisement

అలా అడిగితే పెద్ద గొడవ అవుతుందేమో స్వప్న అంటాడు రాహుల్‌. గొడవ అయితే అవ్వని నిజం ఏంటో తెలుస్తుంది. కదా..? ఇప్పుడు మనం అడగకుండా వదిలేస్తే రేపు ఇంట్లో వాళ్లు అందరూ కూడా  నిజం తెలిసినా నువ్వెందుకు చెప్పలేదు అని అందరూ నిన్ను తప్పు పడతారు అనగానే.. రాహుల్‌ అది కాదు స్వప్న ఇవాళ ఆంటీ అంకుల్‌ వాళ్ల పెళ్లి రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ టైంలో మనం వెళ్లి గొడవ చేస్తే.. అని రాహుల్ చెప్తుంటే.. తప్పు జరుగుతుంది అని తెలిసినప్పనుడు వెంటనే వెళ్లి నిలదీయాలి రాహుల్‌.. లేదంటే అది మన మెడకే చుట్టుకుంటుంది. నేనే వెళ్లి అడుగుతాను  అంటూ రాహుల్ చేతిలో ఉన్న రాజ్‌ ఫోన్‌ తీసుకుని కిందకు కోపంగా వెళ్తుంది. రాహుల్ నవ్వుకుంటూ ఇప్పుడూ కథలో అసలు ట్విస్ట్‌ వచ్చింది. రాజ్‌ దీనికి ఏం సమాధానం చెప్తాడో నేను చూస్తాను అనుకుంటాడు.

కింద అందరూ సాంగ్స్‌ పెట్టుకుని డాన్స్‌ చేస్తుంటారు. స్వప్న వచ్చి పూల కుండీని కింద పడేసి అరుస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. రాహుల్ పై నుంచి అంతా గమనిస్తుంటారు. ఇంద్రాదేవి కోపంగా నీకేం మాయ రోగం పట్టిందే.. బంగారం లాంటి ప్లవర్‌ వాజ్ ను అలా పగులగొట్టావు అంటూ తిట్టగానే.. స్వప్న కోపంగా రాజ్‌ అంటూ వస్తుంది.. దీంతో ధాన్యలక్ష్మీ ఏమైంది నీకు ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది.. నిన్నటి నుంచి ఇది ఇలాగే చేస్తుంది. దెయ్యం ఏమైనా పట్టిందేమో అంటుంది ఇంద్రాదేవి.. దీంతో స్వప్న కోపంగా నాకు దెయ్యం పట్టడం కాదు.. నీ మనవడు ఏం చేశాడో తెలిస్తే మీకు పడుతుంది దెయ్యం అంటుంది.

Advertisement

దీంతో రాజ్‌ ఏమైంది స్వప్న నేనేం చేశాను అని అడగ్గానే.. ఏం చేశావా..? ఆర్‌ ఫ్యాక్టరీ అంటే ఏంటి..? స్వరాజ్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు సంబంధం లేకుండా కొత్త కంపెనీని ఎందుకు స్టార్ట్‌ చేస్తున్నారు.. ఈ కంపెనీ గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌ గా ఇలా చేయడానికి కారణం ఏంటి..? అని స్వప్న అడగ్గానే.. సీతారామయ్య కంగారుగా రాజ్‌ ఏంట్రా ఇది కొత్త  కంపెనీ ఏంట్రా..? స్వప్న ఏం చెబుతుంది అని అడగ్గానే.. రాజ్‌ తాతయ్య అది అని చెప్పబోతుంటే.. స్వప్న కల్పించుకుని ముందు ఆర్‌ అనే అక్షరానికి అర్థం ఏంటి అది చెప్పు అంటుంది.. దీంతో సీతారామయ్య కోపంగా మాకు చెప్పకుండా కొత్త కంపెనీ స్టార్ట్‌ చేస్తున్నావా..? అని అడగ్గానే.. సుభాష్‌, ప్రకాష్‌ రాజ్‌ను వెనకేసుకొస్తారు. దీంతో వాళ్లను కూడా స్వప్న తిడుతుంది.. అసలు ఆర్‌ అంటే రాజ్‌ అనే కదా అర్థం అని అడుగుతుంది.

అసలు ఎందుకు ఈ కంపెనీ నాకు తెలియాలి అని ప్రశ్నిస్తుంది. దీంతో స్వప్నను రుద్రాణి రెచ్చగొడుతుంది. దీంతో అపర్ణ రుద్రాణిని తిట్టి రాజ్‌, కావ్యలను వెనకేసుకొస్తుంది. దీంతో సుభాష్‌ ఆర్‌ అంటే అర్థం ఏంటని చెప్పమని అసలు నిజం ఏంటో చెప్పమని అందరి ముందు ఎందుకు దోషులుగా నిలబడతారు అని అడగ్గానే.. ఆర్‌ అంటే రాజ్‌ కాదు.. రాహుల్‌ అని రాహుల్‌ పేరు మీద కొత్త కంపనీ పెట్టబోతున్నాను అని చెప్తాడు రాజ్‌. దీంతో రుద్రాణి కోపంగా ఇదంతా రాహుల్ మీద కుట్ర చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది.

దీంతో కావ్య కోపంగా రుద్రాణి, స్వప్నలను తిడుతుంది. రాహుల్‌ కోసమే ఇదంతా చేశామని రాహుల్‌ను ప్రయోజకుడిని చేయాలని ఇదంతా చేశామని చెప్తుంది. రాజ్‌ కూడా అదే విషయం చెప్తాడు. రాహుల్‌ ఏంటో నిరూపించుకుంటాడనే.. తన పేరు మీద కంపెనీ పెట్టాము.. ఇదంతా మీకు చెప్పి చేయోచ్చు కానీ మీకు ఎవ్వరికీ రాహుల్ మీద నమ్మకం లేదు అందుకే చెప్పలేదు అంటాడు.. దీంతో స్వప్న ఏడుస్తూ.. కావ్యను క్షమించమని అడుగుతుంది. రాహుల్‌ కూడా ఎమోషనల్‌ అవుతూ రాజ్‌ను క్షమించమని అడుగుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×