E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 24th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ల్యాప్ టాప్ తీసుకెళ్లిన స్వప్న – అందులో సీక్రెట్స్ లేవన్న రాహుల్ 

Brahmamudi Serial Today November 24th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ల్యాప్ టాప్ తీసుకెళ్లిన స్వప్న – అందులో సీక్రెట్స్ లేవన్న రాహుల్ 
Advertisement

Brahmamudi serial today Episode:  

అపర్ణ, సుభాష్‌లను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్‌ వేస్తారు. అందరూ కలిసి అపర్ణ, సుభాష్‌లను పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. పెళ్లి తతంగం గురించి వధూవరుల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఇంతలో కావ్య ఇంతటి బంగారాన్ని మీకు అప్పగిస్తున్నాం కదా మీ అబ్బాయి మా అమ్మాయిని ఎలా చూసుకుంటాడో చెప్పండి అని అడుగుతుంది. దీంతో రాజ్ మా ఇంటికి వచ్చి దీపం పెట్టిన ఈ అమ్మాయికి ఎప్పుడు కోపం కనిపించకుండా చూసుకుంటాము.. వేలు పట్టుకుని నమ్మి నడిచొచ్చిన ఈ పుత్తడి బొమ్మకు చెమట జాడ తెలియకుండా వింజామర విసిరే సేవకులమై చూసుకుంటాము.. తను అల్లరి చేస్తున్నప్పుడు ఆట బొమ్మను అవుతాను. తను అలిసిపోయినప్పుడు జోల పాటను అవుతాను.. ఈ మల్లెకొమ్మ నవ్వుకు కామా కూడా ఉండకూడదు. తన మీద పెట్టుకున ఆశలకు హద్దులే ఉండకూడదు.. ఒక్కమాటలో చెప్పాలంటే మీ అమ్మాయితో సాగే ఈ ప్రయాణంలో ఎన్నటికీ ఒక్క స్టాప్‌ కూడా ఎదురవ్వకూడదు అంటూ రాజ్‌ చెప్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు..

ఇంతలో కళ్యాణ్‌ కల్పించుకుని అన్నయ్య ఏంటిది..? ఇదంతా పెద్దమ్మ పెద్దనాన్న కోసం చెప్తున్నట్టు లేదు అంటాడు. దీంతో ఇంద్రాదేవి కల్పించుకుని ఓరేయ్‌ కళ్యాన్‌ వాడు వాని పెళ్లాం గురించి చెప్తున్నాడు తెలియడం లేదా..? అంటుంది. ఇంతలో ప్రకాష్‌ కల్పించుకుని అబ్బాయి అమ్మాయిని ఎలా చూసుకుంటాడని అడగడం కాదమ్మా.. మీ అమ్మాయి బంగారం అయితే మా అబ్బాయి ప్లాటినం..మా వాణ్ని మీకు అప్పగిస్తున్నాం.. మరి మా వాడిని మీ అమ్మాయి ఎలా చూసుకుంటుందో కొంచెం సెలవు ఇవ్వండి అని అడగ్గానే.. ఎక్కడో ఆకాశంలో అల్లంత దూరంలో ఉన్న నెల రాజును చూస్తూనే మనసు పులకించిపోతుంది. అలాంటిది ఆ చందమామే చేతికి అందితే ఆ రాజుకు పొడి పట్టినా.. గుడి కట్టినా చిన్నదే అవుతుంది. అందుకే గుండెల్లో పెట్టుకున్నాం.. సరిపోదా..? మీ అబ్బాయి కోపాన్ని దీపంగా మల్చుకుంటాను. మీ యువరాజు నవ్వుల్ని జడలో పువ్వుల్లా చుట్టుకుంటాను ఎండల్లో ఆయనకు గొడుగు అవుతాను. ఆయన అడుగులకు మడుగు అవుతాను. ఆయన ప్రేమకు బానిసై చూసుకుంటాను. కానీ కలలలో కూడా మీ మహారాజు కలత చెందకూడదని ఆశపడుతున్నాను.. ఎందుకంటే మజిలీ లేని ప్రయాణం విరామం లేని జీవితం లాంటిది ఊహించుకోలేను అని కావ్య చెప్పగానే..

Advertisement

కళ్యాణ్‌ నవ్వుతూ వదిన సూపర్‌ అంటాడు. చూశారా మీ రాజ్‌కు మా కావ్య కరెక్టుగా కౌంటర్‌ ఇచ్చింది అని ధాన్యలక్ష్మీ చెప్పగానే.. రుద్రాణి కల్పించుకుని ఇంకా కవితలు కథలేనా.. గిఫ్టులు ఇచ్చి దండలు మార్చుకునేది ఉందా లేదా… అని అడగ్గానే.. ఎందుకు లేదు.. అత్తయ్య గారికి మామయ్య గారికి ఎవరెవరు ఏం గిఫ్టులు ఇవ్వాలో ఇచ్చేయండి.. అత్తయ్య, మామయ్య మీరు ఈ దండలు మార్చుకోండి అని చెప్తుంది. అపర్ణ, సుభాష్‌ దండలు మార్చుకోగానే.. ఒక్కోక్కరుగా వెళ్లి విష్‌ చేస్తుంటారు. గిఫ్టులు ఇస్తుంటారు.. కావ్య ఇచ్చిన గిఫ్టు చూసి అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. కావ్యకు థాంక్స్‌ చెప్తుంది.  తర్వాత రాజ్‌ ఇచ్చిన గిఫ్టును చూసిన సుభాష్‌ ఎమోషనల్‌ అవుతాడు. రాజ్‌కు థాంక్స్‌ చెప్తాడు.

అందరూ కింద హ్యపీగా ఉంటే స్వప్న, రాజ్‌ వాళ్ల రూంలోకి వెళ్లి లాప్‌ట్యాప్‌ వెతుకుతుంది. ఇంతలో కింద పెళ్లికొడుకు పెళ్లి కూతురుకు బాసికాలు లేవని అనగానే.. నా దగ్గర రూంలో ఉన్నాయి నేను తీసుకొస్తాను ఉండండి అంటూ కావ్య రూంలోకి వెళ్తుంది. రూంలో స్వప్నను చూసిన కావ్య అక్కా అని పిలవగానే.. స్వప్న షాక్‌ అవుతుంది. దీంతో అందరూ హాల్లో ఉంటే నువ్వు ఇక్కడున్నావేంటి అక్కా అని అడుగుతుంది. నాకు నా స్టిక్కర్స్‌ నచ్చడం లేదే అందుకే నీ స్టిక్కర్స్‌ కోసం వచ్చాను ఏం నేను నీ స్టిక్కర్స్‌ పెట్టుకోకూడదా..? అంటుంది స్వప్న. పెట్టుకోకూడదని ఎవరన్నారు.. అని కావ్య చెప్పగానే.. అయితే నిన్ను అడగకుండా నీ గదిలోకి రాకూడదన్నమాట అంటుంది స్వప్న..

Advertisement

అది కూడా నేను అనలేదే.. నువ్వు నా బుజ్జి అక్కవు నీకోసం నీ ఆనందం కోసం మా వారికి ఇష్టం లేకపోయినా తనతో పోరాడి మరీ రాహుల్‌ ను ఆఫీసులో పెట్టించాను. అలాంటిది గదిలోకి రావడానికి కండీషన్‌ పెడతానా..? అని చెప్తుంటే.. స్వప్న సరేలేవే ఇంతకీ స్టిక్కర్స్‌ ఎక్కడున్నాయి అని అడగ్గానే.. ఆ కప్‌ బోర్డులో ఉన్నాయి తీసుకో అని చెప్పి కావ్య బాసికాలు తీసుకుని వెళ్లిపోతుంది. స్వప్న లాప్‌ టాప్‌ తీసుకుని రాహుల్ దగ్గరకు వెళ్లిపోతుంది. ల్యాప్‌ ట్యాప్‌ ఓపెన్‌ చేసిన రాహుల్‌ అందులో ఆర్‌ కంపెనీ చెందిన విషయాలేవీ లేవని చెప్తాడు. అయితే రాజ్‌ తన ఫోన్‌లో ఉండొచ్చని రాహుల్‌ చెప్తాడు. దీంతో స్వప్న ఇప్పుడే వెళ్లి రాజ్‌ ఫోన్‌ ఎలాగైనా తీసుకొస్తాను అని లాప్‌ టాప్‌ తీసుకుని వెళ్లిపోతుంది. కింద ఫంక్షన్స్‌ లో ఫోటోలు తీస్తున్న రాజ్‌ దగ్గరకు వెళ్లి  నీ ఫోన్‌ ఇవ్వు నా ఫోన్‌ హ్యాంగ్‌ అయింది అర్జెంట్‌ ఒక ఫోన్‌ చేయాలి అని చెప్పి రాజ్‌ ఫోన్ తీసుకుని వెళ్లిపోతుంది స్వప్న. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×