E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 21st:‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లో వాళ్ల ముందే రాజ్, కావ్యను తిట్టిన స్వప్న

Brahmamudi Serial Today November 21st:‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లో వాళ్ల ముందే రాజ్, కావ్యను తిట్టిన స్వప్న
Advertisement

Brahmamudi serial today Episode:  

దుగ్గిరాల ఇంట్లో పెళ్లి చూపుల ఫ్రోంగాం నడుస్తుంది. అపర్ణ అమ్మాయిలా సుభాష్‌ లా అబ్బాయిలా రెడీ అయి ఒకరినొకరు పెళ్లి చూపులు చూసుకున్నట్టు యాక్ట్‌ చేస్తుంటారు. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో స్వప్న వస్తుంది. స్వప్నను చూసిన కావ్య అక్కా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుంది. దీంతో స్వప్న ఇరిటేటింగ్‌ గా ఇళ్లంతా చప్పట్లలో మారిమోగిపోతుంది నవ్వులతో నిండిపోతుంది. అందిర ముఖాల్లో కాంతి నిండిపోతుంది బాగుంది చాలా బాగుంది అంటూ కోపంగా మాట్లాడుతుంది. దీంతో అప్పు ఏంటి ఈ సందడి మిస్‌ అయ్యానని ఫీల్‌ అవుతున్నావా..? బావకు క్యారేజ్‌ ఇవ్వడానికి నువ్వే వెళ్లావు కదా..? అంటుంది. కావ్య కూడా అక్కా రేపు అత్తయ్య వాళ్ల వెడ్డింగ్‌ డే అని తెలుసు కదా ఎందుకు వెళ్లావు.. అని అడుగుతుంది.

దీంతో స్వప్న కోపంగా నాభర్తకు మీరు పని ఇచ్చే యజమానులే కానీ తిండి పెట్టి ఆకలి తీర్చే వాళ్లు కాదు కదా..? అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి నీ మొగుడికి ఎవరో తిండి ఎలా పెడతారు..? స్వయంగా నీ చేత్తో వండిన తిండి పెట్టాలనుకున్నావు.. క్యారేజ్‌ తీసుకెళ్లావు.. దానికే ఎందుకు ఈ పుల్ల విరిపు మాటలు అని అడగ్గానే.. కళ్లు చెదిరే నిజాలు చూసినప్పుడు ఇలాంటి పుల్ల విరుపు మాటలే వస్తాయి అమ్మమ్మ.. అంటుంది. దీంతో రాజ్‌ నిజాలేంటి..? అబద్దాలేంటి..? ఇప్పుడు ఏమైంది స్వప్న అని అడుగుతాడు. కావ్య కూడా ఎందుకు అక్క అదో రకంగా ఉన్నావు.. అని అడుగుతుంది. దీంతో స్వప్న ఎదుటి వాళ్లు ఏ రకంగా ఉన్నారో మీరు ఇట్టే చెప్పగలరు.. కానీ మీరు ఎప్పుడు ఏ రకంగా మారుతున్నారో మీకు తెలియదు.. తెలుసుకునే ప్రయత్నం ఊడా చేయరు..

Advertisement

అంటుంది. దీంతో సుభాష్‌ కల్పించుకుని ఇప్పుడు ఏం జరిగిందని అంత ఉక్రోషంగా మాట్లాడుతున్నావు స్వప్న అని అడుగుతాడు. కావ్య కూడా అక్కా ఎవరు మారాని ఎవరి గురించి మాట్లాడుతున్నావు అక్కా అని అడగ్గానే.. స్వప్న మరింత కోపంగా మీరు మారారు.. నేను మీ గురించే మాట్లాడుతున్నాను. మనుషుల్ని గిల్లి జోల పాడేవాళ్లు ఉంటారు. వాత పెట్టి వెన్న రాసే వాళ్లు ఉంటారు. కానీ అందరి ముందు అందలం ఎక్కించి చాటుగా అధః పాతాళానికి తొక్కే వాళ్లను మిమ్మల్నే చూస్తున్నాను.. అంటుంది. దీంతో రాజ్‌ ఏం మాట్లాడుతున్నావు స్వప్న అసలు ఏం జరిగింది అని అడగ్గానే.. ఆదరించే చోట నిన్ను ఎవరైనా చీదరించుకుంటే నీ భార్య ఒప్పుకుంటుంది. గౌరవించే మనుషులు అగౌరవ పరుస్తూ అవమానిస్తే కావ్య సహిస్తుందా…? ఇప్పుడు నా భర్త కూడా ఆఫీసులో అదే స్థితిలో ఉన్నాడు అని చెప్పగానే.. ఇంద్రాదేవి వాడికి ఏమైంది ఇప్పుడు వాణ్ని ఎవరు అవమానించారు.. అని అడగ్గానే..

చెప్పింది చేయాల్సిన కింది స్థాయి ఉద్యోగులు నా భర్త మాటలు పట్టించుకోవడం లేదు. ఆర్డర్‌ వేస్తే చేతులు కట్టుకుని వినాల్సిన మనుషులు రాహుల్‌ను లెక్క చేయడం లేదు.. అతను మాట్లాడితే నాన్సెన్స్‌ ప్రశ్నిస్తే న్యూసెన్స్‌ ఇదంతా చూశాక నేనెలా తట్టుకుంటాను.. అసలు దీని అంతటికి కారణం ఎవరు..? అని ప్రశ్నించగానే.. సుభాష్‌ కల్పించుకుని ఇంకెవరు నీ మొగుడే..? గౌరవ మర్యాదలు అడుక్కుంటేనో కొనుక్కుంటేనో రావు అవి మన క్యారెక్టర్‌ ను బట్టి వస్తాయి అని చెప్తాడు.. ప్రకాష్‌ కూడా వాడి గురించి ఆఫీసులో అందరికీ తెలుసు కాబట్టి అలా జరిగి ఉంటుంది. వాడికి గౌరవం దక్కాలంటే అంత తేలిక కాదు.. అని చెప్పగానే.. అవును నా మొగుడికి గౌరవం దక్కాలంటే తేలిక కాదు.. అతను మారాడు అని మీరందరూ నమ్మాలంటే తేలిక కాదు.. కానీ అవకాశం ఇచ్చి లాగేసుకోవడం తేలికే.. అనగానే.. రాజ్‌ కోపంగా స్వప్న తెలిసి తెలియక మాట్లాడకు .. వాడు మారాడు అని తెలిశాకే.. ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన అవకాశాన్ని రాహుల్‌ నిలబెట్టుకోవాలనుకున్నాం తప్పా ఆ అవకాశాన్ని లాగేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.. అని చెప్పగానే..

Advertisement

చెప్పడం చాలా ఈజీ కానీ చేయడమే చాలా కష్టం అంటుంది స్వప్న దీంతో కావ్య కోపంగా అక్కా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడగ్గానే.. అవును అధికారం ఇచ్చారు.. అనామకుడిని చేశారు..మీరు రాహుల్‌కు ఇచ్చిన పోస్ట్‌ దాని పవర్‌ ఎంత గొప్పది అంటే రాహుల్‌ ఎవ్వరికీ సలహా ఇవ్వకూడదట. కానీ సంతకం పెడితే చాలట.. రాహుల్‌ పని వాళ్లను పని చేయండి అని చెప్పకూడదట.. జస్ట్‌ ఫ్యాన్‌ కింద కూర్చుంటే సరిపోతుందట.. రాహుల్‌ డిజైన్‌ జోలికి వెల్లకూడదట.. రిజైన్‌ చేసిన వాడిలా మెదలాలట..  నా భర్త ఎవ్వరికీ కరెక్షన్‌ చెప్పకూడదట.. అందరికీ అబార్షన్‌ వస్తుందట.. ఇదా మీరు నా భర్తకు ఇచ్చిన ఉద్యోగం.. ఇదేనా రాహుల్‌కు ఇచ్చిన అధికారం..  ఇంట్లో కూర్చోని మీరిద్దరూ ప్రతి విషయాన్ని ఫైనల్ చేస్తుంటే.. నా భర్తను ఎందుకు ఆఫీసుకు పంపించారు.. బొమ్మలా ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికా..? అని ప్రశ్నిస్తుంటే

రుద్రాణి కల్పించుకుని కాదు స్వప్న నా కొడుక్కి సాయం చేసినట్టు ఉండాలి కదా..? నీ భర్తకు ఉద్యోగం ఇచ్చి గొప్ప పోస్టులో కూర్చోబెట్టామని కలరింగ్‌ ఇచ్చి నిన్ను నీ బిడ్డను ఉద్దరించినట్టు ప్రపంచానికి తెలియాలి కదా అని తిడుతుంటే.. రాహుల్ వస్తాడు. రుద్రాణిని తిడతాడు..  రాజ్‌, కావ్యను తిట్టోద్దని నాకు ఈ హెల్ఫ్‌ చేయడమే చాలా గ్రేట్‌ అంటూ లోపలిక వెళ్లిపోతాడు. తర్వాత స్వప్న దగ్గరకు వెళ్లి రాహుల్ తన నాటకం ఆడతాడు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×