E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 20th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వప్నకు నిజం తెలిసేలా చేసిన రాహుల్ 

Brahmamudi Serial Today November 20th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వప్నకు నిజం తెలిసేలా చేసిన రాహుల్ 
Advertisement

Brahmamudi serial today Episode:

ఆఫీసులో ఉన్న రాహుల్ దగ్గరకు ఫైల్‌ తీసుకెళ్లి ఇస్తుంది శృతి. మీరు సైన్‌ చేస్తే చాలు అని చెప్తుంది. రాజ్‌ ఈ ఫైల్స్‌ ఎప్పుడూ స్టడీ చేశారు అని రాహుల్‌ అడగ్గానే.. ఇందాకే అరగంట తర్వాత మెయిట్‌ చేశాము సార్‌ స్టడీ చేసి పంపిచారు. అవే ఫైల్స్‌ మీ దగ్గరకు తీసుకొచ్చాము సార్‌ అంటుంది శృతి. అయితే నేను ఓన్లీ సంతకం మాత్రమే చేయాలా.? అంటాడు రాహుల్‌ అవును సార్‌ అంటుంది శృతి. సరే ఇవ్వు అంటూ ఫైల్స్‌ మీద సంతకం చేస్తుంటాడు రాహుల్‌.. శృతి మాత్రం ఈయన గారికి రాజ్‌ సార్‌ ఫుల్‌ పవర్స్‌ ఇచ్చాడని అనుకున్నట్టు ఉన్నాడు.. కానీ ఇప్పుడు అర్థం అయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ నవ్వుతుంది. దీంతో రాహుల్ ఏంటి నవ్వుతున్నావు అని అడగ్గానే.. ఏం లేదు సార్‌ అంటుంది. సంతకం పెట్టాను కదా..? వెళ్లు అంటాడు శృతి నవ్వుతూ వెళ్లగానే.. నేను ఏమి అనుకున్నాను.. ఏం జరుగుతుంది అని ఫీల్‌ అవుతుంటాడు.

ఇంతలో బయటకు వచ్చిన రాహుల్ మేనేజర్‌ నేను డిజైన్స్‌ లో కొన్ని కరెక్షన్స్‌ చెప్పాను కదా కరెక్ చేసి పంపిస్తా అన్నారు.. ఇంకా పంపిచలేదు అని అడగ్గానే.. అది సార్‌  మీరు కరెక్షన్‌ చెప్పక ముందే.. కావ్య మేడం డిజైన్స్‌ చూసి యాజ్‌ టీజ్‌గా ఉంచమన్నారు సార్‌ మేడం ఓకే చెప్పారు.. క్లయింట్స్‌కు కావ్య మేడం ఫైనల్ చేసిన డిజైన్స్‌ బాగా నచ్చాయట.. మన్యూఫాశ్చరింగ్‌కు వెళ్లిపోయాయి అని మేనేజర్‌ చెప్పగానే.. ఓహో అయితే నేను డిజైన్స్‌ చూడక్కర్లేదు.. నేను  ఏ కరెక్షన్స్‌ చెప్పక్కర్లేదు.. కావ్య మేడం ఫైనల్‌ చేస్తే చాలు అన్నమాట అని రాహుల్ అనగానే.. అవును సార్‌ మీరు చూడాల్సిన అవసరం లేదు.. కావ్య మేడం చూసుకుంటారు అని మేనేజర్‌ చెప్పగానే.. రాహుల్ కోపంగా తన చాంబర్‌ లోకి వెళ్తాడు. కోపంగా ఇంట్లో వాళ్ల అందరి ముందు నాకేదో కంపెనీలో పెద్ద పోస్ట్ ఇచ్చినట్టు బిల్డప్‌.. నన్ను ఉద్దరించినట్టు ఫోజు ఒకటి.. ఫవర్స్‌ అన్నీ వాళ్లకు పనికిరాని కుర్చీ నాకు.. లాభం లేదు ఇలాగే ఉంటే నేను ఆఫీసులో ఉన్నా రోడ్డు మీద ఉన్నా తేడా లేదు.. దీనికి పుల్‌స్టాప్‌ పెట్టాలి. ఫవర్స్‌ అన్ని నా చేతిలోకి తీసుకోవాలి. అంటే స్వప్న వైపు నుంచి నరుక్కురావాలి. స్వప్నకు ఈ విషయం తెలియాలి. అప్పుడే దీని అంతటికి సొల్యూషన్‌ దొరుకుతుంది. అనుకుని స్వప్నకు కాల్ చేస్తాడు.

Advertisement

స్వప్న వర్క్‌ ఎలా ఉంది అని అడుగుతుంది. బాగుంది స్వప్న అన్నింటి మీద ఒక అవగాహన తెచ్చుకుంటున్నాను అని చెప్తాడు రాహుల్. ఇంకేమీ ఆలోచించకు వర్క్‌ మీద ద్యాస పెట్టు అందరికీ నువ్వేంటో తెలుస్తుంది అని స్వప్న చెప్పగానే.. ఇంత మంచి అవకాశం ఇచ్చారు నేను వదులుకుంటానా..? నీకోసం మన పాప కోసం రాత్రి పగలు కష్టపడతాను..ఇంతకీ నువ్వు భోజనం చేశావా..? స్వప్న అని అడగ్గానే.. లేదు ఇంతకీ నువ్వు తిన్నావా..? అని స్వప్న అడగ్గానే.. నాకు ఆఫీసు ఫుడ్డు పడదు.. పైగా ఆర్డర్‌ పెట్టుకోవడం నాకు నచ్చదు కదా..? సరేలే ఈవినింగ్‌ ఇంటికి వచ్చాక తింటాను అని రాహుల్ చెప్పగానే.. ఇంటికి వచ్చాక తినడం ఏంటి… లంచ్‌ చేయాలి కదా నీకు అక్కడ ఫుడ్డు పడదు.. నేను తీసుకొస్తాను కదా..? అంటుంది స్వప్న.. అయ్యో నీకు శ్రమ ఎందుకు స్వప్న అని రాహుల్‌ అనగానే.. శ్రమ లేదు ఏం లేదు.. నేను లంచ్‌ తీసుకొస్తున్నాను అంటూ కాల్ కట్‌ చేస్తుంది. రాహుల్ మాత్రం రా స్వప్న రా నువ్వు ఆఫీసుకు రావాలి. ఇక్కడ విషయాలు అన్ని తెలియాలి.. అదేగా నాకు కావాల్సింది అనుకుంటాడు.

మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, సుభాష్‌ల పెళ్లి రోజు యానివర్సరీలిన వెరైటీగా గ్రాండ్‌ గా ప్లాన్‌ చేస్తారు. అందుకోసం అపర్ణను సుభాష్‌ పెళ్లి చూపుల్లో చూసిన దగ్గర నుంచి అన్ని విషయాలు మళ్లీ రిపీట్‌ చేస్తుంటారు. మరోవైపు స్వప్న లంచ్‌ బాక్స్‌ తీసుకుని రాహుల్ ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ ఆఫీసులో రాహుల్‌ను చూసిన స్వప్న ఎమోషనల్ అవుతుంది. నిన్ను ఇలా చూడాలనే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇంతలో శృతి వచ్చి రాహుల్‌ను ఫైల్‌ మీద సంతకం పెట్టమని అడుగుతుంది. దీంతో స్వప్న అంతా అర్థం చేసుకుని శృతి మీద అరుస్తుంది. దీంతో రాహుల్ నా పెళ్లానకి మొత్తం అర్తం అయింది అని మనసులో అనుకుంటాడు. ఫైల్‌ మీద సంతకం చేసి శృతిని పంపిచేస్తాడు. మళ్లీ మేనేజర్‌ను పిలిచి డిజైన్స్‌ గురించి అడుగుతాడు మేనేజర్‌ కావ్య మేడం అంతా చూసి ఫైనల్‌ చేస్తున్నారు అని చెప్తాడు. అంతా వింటున్న స్వప్న కోపంగా బాధపడుతుంది. దీంతో రాహుల్ కూడా మెల్లగా స్వప్నను రెచ్చగొడతాడు. స్వప్న కోపంతో రెచ్చిపోతుంది. మరోవైపు ఇంట్లో సుభాష్‌, అపర్ణల పెళ్లి చూపుల సీన్‌ నడుస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×