E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాహుల్ కు కంపెనీ బాధ్యతలు అప్పగించిన రాజ్

Brahmamudi Serial Today November 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాహుల్ కు కంపెనీ బాధ్యతలు అప్పగించిన రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:   

డైనింగ్ టేబుల్ దగ్గరకు రాజ్‌, రాహుల్‌ను పిలిచి ఇంకెన్నాళ్లు ఇలా ఉంటావు నీకు ఆఫీసులో ఏదైనా చాన్స్‌ ఇస్తానంటాడు. కావ్య చేత ఏవో పేపర్స్ తెప్పించి రాహుల్‌కు ఇప్పిస్తాడు. దీంతో రాహుల్‌ ఏంటి రాజ్‌ ఇది అని అడగ్గానే.. ఓపెన్ చేసి చూడు అని చెప్తాడు రాజ్‌. దీంతో ఓపెన్‌ చేసి చూసిన రాహుల్ ఆశ్చర్యంగా జాయినింగ్‌ లెటరా..? అని అడగ్గానే.. అవును నువ్వు రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లు అని చెప్తాడు రాజ్‌. దీంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇది నీ జాయినింగ్‌ లెటర్‌.. నేను ఆఫీసుకు రావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కంపెనీ వ్యవహారాలన్నీ నీకు అప్పగిస్తున్నాను. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి అని చెప్పగానే..

రుద్రాణి నా కొడుకు మొత్తానికి సాధించాడు అని మనసులో అనుకుంటుంది. కంపెనీ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను రాహుల్‌ రేపే జాయిన్‌ అవ్వు.. అని రాజ్‌ చెప్పగానే.. వద్దు రాజ్‌ నాకు ఇంత పెద్ద  బాధ్యతలు వద్దు  అంటాడు రాహుల్‌. దీంతో కావ్య ఏం రాహుల్ ఎందుకని వద్దంటున్నావు..? అని అడగ్గానే.. 20 లక్షల బాధ్యత అప్పగిస్తేనే ఫెయిల్‌ అయిపోయిన వాడిని ఇప్పుడు అంత పెద్ద బాధ్యత నాపై పెడితే ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోరు.. వీళ్లందరికీ ఇష్టం లేకుండా నేను ఆఫీసుకు వెళ్లలేను రాజ్‌ అంటాడు.

Advertisement

దీంతో కావ్య కల్పించుకుని రాహుల్‌ 20 లక్షల విషయంలో నువ్వు ఫెయిల్‌ అవ్వలేదు రాహుల్‌.. నీ నిజాయితీని నిరూపించుకున్నావు.. ఆ నిజాయితీ గుర్తించబడింది కాబట్టే నీకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది అని చెప్పగానే.. నీకు ఇంకో అవకాశం ఇవ్వాలని కళావతి చెప్పింది.. నాకు నీ మీద కన్నా కళావతి మీద నమ్మకం ఎక్కువ కాబట్టి తన నమ్మకాన్ని నిలబెడతావని నమ్ముతున్నాను.. అని రాజ్‌ చెప్పగానే.. తప్పకుండా రాజ్‌ ఇదే మీరు నాకిచ్చే చివరి అవకాశం మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను.. రాత్రింబవళ్లు కష్టపడైనా మీ నమ్మకాన్ని నిలబెడతాను అంటాడు రాహుల్‌.

తర్వాత రూంలోకి వెళ్లి అపాయింట్‌ మెంట్ లెటర్‌ చూసుకుంటూ ఉంటాడు రాహుల్‌. అప్పుడే రుద్రాణి వచ్చి  ఇది నేను అసలు నమ్మలేకపోతున్నానురా..? రాజ్‌ ఇంత త్వరగా నిన్ను నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తాడని అసలు నమ్మలేదు అంటుంది. ఇప్పుడు కూడా రాజ్‌ నన్ను పూర్తిగా నమ్మలేదు మామ్‌. స్వప్న కోసమే కావ్య ఇదంతా చేసింది అని చెప్పగానే.. ఆ కావ్య మరీ ఇంత పిచ్చిదా… స్వప్న కళ్లల్లో వచ్చిన నాలుగు కన్నీటి చుక్కలకే ఇంత కరిగిపోతుందా..? అని రుద్రాణి అడగ్గానే.. మన శత్రువు అయినా సరే కావ్య గొప్పదనాన్ని మెచ్చుకోక తప్పదు మమ్మీ.. ఇన్ని మోసాలు చేసినా మళ్లీ అక్క జీవితాన్ని నిలబెట్టడానికి రిస్క్‌ తీసుకుంది చూడు నిజంగా తను గ్రేట్‌ అంటాడు రాహుల్‌..

Advertisement

ఇవన్నీ తర్వాత ముందు అంది వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించుకో.. అని రుద్రాణి చెప్తుంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది మమ్మీ రేపే ఆ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాను. రాజ్‌ స్థానంలో వెళ్లి కూర్చుంటాను.. అని చెప్తాడు రాహుల్‌. రాజ్‌ స్థానంలో కూర్చోవడం కాదు నిన్ను ఎలాగైతే కంపెనీ నుంచి తరిమేశారో నువ్వు అలాగే చేయాలి అని చెప్తుంది రుద్రాణి. దీంతో నేను మునుపటి రాహుల్ కాదు మమ్మీ స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ మొత్తాన్ని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను అని చెప్తాడు రాహుల్‌.

రాజ్‌, కావ్య దగ్గరకు వెళ్లి రొమాంటిక్‌గా మాట్లాడుతుంటే.. కావ్య సరసాలు చాలు గానీ అత్తయ్య, మామయ్యల పెళ్లి రోజు గ్రాండ్‌గా చేయాలని చెప్తుంది. దీంతో రాజ్‌ అవును కదా నేను మర్చిపోయాను సరే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం అంటాడు రాజ్‌. ఆఫీసుకు వెళ్లిన రాహుల్ ను చూసి శృతి బయపడుతుంది. వీడేంటి మళ్లీ వస్తున్నాడు అని మనసులో తిట్టుకుంటుంది. రాహుల్‌ దగ్గరకు వచ్చి శృతిని నేను రావడం నీకు నచ్చనట్టు ఉంది అంటూ అడగ్గానే.. శృతి ఇబ్బంది పడుతుంది. రాహుల్ నవ్వుతూ క్యాబిన్‌లోకి వెళ్లిపోతాడు.

తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా రాజ్‌, కావ్య ఇద్దరూ కలిసి అపర్ణ, సుభాష్‌లకు కొత్త బట్టలు ఆర్డర్ చేస్తారు. అవి ఇంటికి రాగానే అందరూ సర్‌ఫ్రైజ్‌ అవుతారు. కావ్య, రాజ్‌ను అందరూ మెచ్చుకుంటారు. అందరూ కలిసి అపర్ణ, సుభాష్‌ ల పెళ్లి రోజు గ్రాండ్ గా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని డిసైడ్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×