E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 13th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి షాక్ ఇచ్చిన రాహుల్  

Brahmamudi Serial Today November 13th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి షాక్ ఇచ్చిన రాహుల్  
Advertisement

Brahmamudi serial today Episode:   

స్వప్న వచ్చి రాహుల్‌ ను మెచ్చుకుని రుద్రాణిని తిడుతుంది. దీంతో రుద్రాణి కోపంగా నాకే వార్నింగ్‌ ఇస్తున్నావా..? అంటుంది. దీంతో స్వప్న వార్నింగ్‌ కాదు నిజమే చెప్తున్నాను.. మీ అబ్బాయిని మళ్లీ చెడగొట్టాలని చూస్తే మీ దారికి నేను అడ్డు రావాల్సి ఉంటుంది. తెలుసుగా నేను అడ్డొస్తే.. బుల్డోజర్‌ లా తొక్కుకుంటూ వెళ్లడం మాత్రమే నాకు తెలుసు.. నువ్వు రా రాహుల్  అని చెప్పగానే.. వస్తాను పద అంటూ స్వప్న వెళ్లిపోయాక నవ్వుతూ నా పర్మామెన్స్‌ ఎలా మమ్మీ అంటాడు రాహుల్. రాహుల్‌ మాటలకు రుద్రాణి షాక్‌ అవుతుంది. ఫర్మామెన్సా..? అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా అని అడగ్గానే.. యాక్టింగ్‌ మమ్మీ నా పెళ్లాన్ని నా దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన యాక్టింగ్‌ అని చెప్తాడు రాహుల్‌..

దీంతో రుద్రాణి నువ్వు వాళ్ల మాటలకు కరిగిపోయి మారిపోయావని భయపడిపోయాను కదరా..?  ఇంత పెద్ద ట్విస్ట్‌ ఇస్తావని నేను అనుకోలేదు అంటుంది. దీంతో రాహుల్‌ నేను నీ రక్తాన్ని మమ్మీ నన్ను కోర్టులో శిక్ష పడకుండా కాపాడినట్టు నటించి వాళ్ల కాళ్ల దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న రాజ్‌ మాటలను ఎలా నమ్ముతాను అనుకున్నావు.. అని రాహుల్‌ చెప్పగానే.. హమ్మయ్య నువ్వు ఇంకా నా దారిలోనే ఉన్నావన్నమాట. అది సరే కానీ మరి ఈ యాక్టింగ్‌ అంతా ఎందుకు చేస్తున్నావు అని రుద్రాణి అడగ్గానే..

Advertisement

స్వప్న నీతో ఎలా మాట్లాడుతుందో చూశావు కదా..? తనకు ఎదురు వెళ్లడం కంటే తన దారికి మనం వెళ్లినట్టు నటించి తనను మన దారికి తెచ్చుకుంటే మంచిది మమ్మీ. ఇప్పుడు చూడు నన్ను అప్పుడే ఎంతలా సపోర్ట్‌ చేయడం మొదలు పెట్టిందో.. ఇక నుంచి నేనేం చేయాల్సిన అవసరం లేదు. తనే నా గురించి ఆలోచిస్తుంది. ఏదో ఒకటి చేసి నాకు అవకాశం ఇప్పించాలని ప్రయత్నిస్తుంది. ఒక్క అవకాశం మమ్మీ ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు సూర్యుడిని రాహువు మింగినట్టు  ఈ కుటుంబాన్ని ఈ రాహుల్‌ మింగేస్తాడు.. అని చెప్పగానే.. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చిందిరా.. నీ దారిలో నువ్వు చేసేది చేయ్‌… నేను చేసేది నేను చేస్తాను.. త్వరలోనే నిన్ను ఈ సామ్రాజ్యానికి రాజును చేస్తాను అంటుంది.

మరోవైపు రాజ్‌, ఆఫీసుకు ఫోన్‌ చేసి మాట్లాడుతుంటే.. కావ్య వచ్చి కోపంగా చూస్తుంది. కాల్‌ కట్‌ చేసిన రాజ్‌ ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు అని అడుగుతాడు. దీంతో కావ్య కోపంగా అవును మరి పండగ పూట చేసిన పాయసం మీరు ఎలా తినాలా అని చూస్తున్న అని చెప్పగానే.. కారణం లేకుండా అలగడం మీ ఆడవాళ్ల జన్మహక్కు అంటాడు రాజ్‌. దెప్పిపొడవడం మీ మగవాళ్ల జన్మహక్కా అని కావ్య అనగానే.. అందులో కూడా మీరే పీహెచ్‌డీ చేశారు కానీ ఇంతకీ మ్యాటర్‌ ఏంటి చెప్పు అని రాజ్‌ అడగ్గానే.. నాకు మీరు ఇచ్చిన మాటేంటి మీరు చేస్తున్న పనేంటి.. అంటుంది కావ్య. ఓసేయ్‌ రాత్రి నీ కోసమే కదే చికెన్‌ చేశాను అంటాడు రాజ్‌. దీంతో కావ్య నాలుగు చికెన్‌ ముక్కలు చేస్తే సరిపోతుందా..? అంటూ కావ్య అలిగిపోతుంది.

Advertisement

దీంతో రాజ్‌, కావ్యను బుజ్జగించే పనిలో పడిపోతాడు. అందుకోసం రాజ్‌, కావ్య కోసం లవ్‌ లెటర్ రాయడానికి గార్డెన్‌లోకి వెళ్తాడు. అప్పటికే అక్కడ సుభాష్‌, ప్రకాష్‌ కూర్చుని లవ్‌ లెటర్స్‌ రాస్తుంటారు. వాళ్లను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. నాన్న బబాయ్‌ మీరేంటి ఇక్కడ ఇలా అని రాజ్‌ అడగ్గానే.. నువ్వేం చేస్తే మేము అదే చేయాలని మీ అమ్మ పిన్ని మాకు ఆర్డర్‌ వేశారురా అని ప్రకాష్‌ చెప్తాడు. దీంతో రాజ్‌ ఆహా అయితే అందరం కలిసి లవ్‌ బస్‌ ఎక్కాం అన్నమాట కానీయండి రాసేయండి అని చెప్తాడు రాజ్‌. మొత్తంమ్మీద కిందా మీద పడి ముగ్గురు ప్రేమలేఖలు రాసి కావ్య, అపర్ణ, ధాన్యలక్ష్మీకి ఇస్తారు. ముగ్గురు  ఆ లవ్‌ లెటర్స్‌ చదువుకుని నవ్వుకుంటారు. అసలు ఇవి లవ్‌ లెటర్సా అంటూ తిడతారు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×