E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు మెడలో తాళి తెంపేయబోయిన రేఖ 

Brahmamudi Serial Today Episode May 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు మెడలో తాళి తెంపేయబోయిన రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode: రాజు వచ్చి తానే ఇందును కిడ్నాప్‌ చేశానని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. భ్రమరాంబ అంటే ఆ ఇరవై లక్షలు అంటూ అడగ్గానే..  అవును నేనే నొక్కేశాను అంటాడు రాజు. దీంతో డబుల్‌ షాక్‌ అవుతుంది రేఖ. భూషణ్‌ మాత్రం కోపంగా కిడ్నాప్‌ చేసిన అమ్మాయిని పెళ్లి ఎలా చేసుకున్నావని అడగ్గానే.. రాజు మీ అందరికీ ఇప్పుడు కథ చెప్తాను.. నేను ఆరోజు ఇందును కిడ్నాప్‌ చేసి వారం రోజులు నా దగ్గర పెట్టుకున్నాను కదా ఆ టైంలోనే నేను తన చక్రాలు లాంటి కళ్లకు ఫ్లాట్ అయ్యాను. తన విశాలమైన మనసుకు మెల్ట్‌ అయ్యాను. నాకే తెలియకుండా నేను ఇష్ట పడటం మొదలుపెట్టాను.. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది అంటూ రాజు చెప్తుండగానే.. శేషు అది కాస్త పిచ్చి ప్రేమగా మారింది అంటావు అంతేనా అబ్బాయి అనగానే.. కరెక్టుగా చెప్పావు మామయ్య.. కానీ నేను ఎంత ఇష్టపడినా ఇందు మాత్రం ఇష్టపడలేదు అంటాడు.

దీంతో శేషు అది మా ఇందు నీ లాంటి లోఫర్ గాడిని ఇష్టపడతారా ఎవరైనా.. అంటాడు. రేఖ కూడా కోపంగా అయినా నువ్వు ప్రేమించడం వల్ల ఇందు మెడలో తాళి కట్టడం ఏంటి..? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అనగానే.. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. మా పెళ్లి జరిగిపోయింది అనుకో.. దండలు కూడా మార్చుకున్నాము అనగానే.. రేఖ కోపంగా అసలు వీడు నీ మెడలో తాళి కడుతుంటే.. నువ్వేం చేస్తున్నావు.. తల వంచి తాళి కట్టించుకున్నావా..? అసలు ఏం చేస్తున్నావు.. అని అడగ్గానే.. కాదు ఆంటీ ఏడుస్తూ ఉన్నాను అంటుంది ఇందు. దీంతో రేఖ ఏయ్‌ ఏడ్వడం ఏంటి..? ఎదురు తిరిగి నాలుగు పీకాల్సింది పోయి.. సైలెంట్‌గా ఉంటావేంటే చెప్పు.. అనగానే.. రాజు అడ్డుపడి ఎవరైనా తాను చేసిన తప్పును తానే చెప్పుకుంటారా ఏంటి..? అనగానే.. శేషు ఏంటి మా ఇందు తప్పు చేసిందా..? ఏం చేసింది అంటూ.. అడగ్గానే.. రాజు ఉరిము ఉరిమి మెరుపు మెరిసి వర్షం కురిసిన రాత్రి అంటూ  ఏదో కట్టుకథ చెప్తుంటాడు.

Advertisement

దీంతో శేషు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు బాబు అంటూ ఆసక్తిగా అడుగుతుంటే.. భ్రమరాంబ అడ్డుపడుతూ శేషు..ఆ దరిద్రం ఇంకా డీటెయిల్‌ గా వినాలా..? అంటూ తిడుతుంది. ఇంతలో రాజు పిన్ని అలా మా ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయింది.  కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందు మీద ప్రేమ పెరిగిపోయింది. కాకపోతే నాకున్న డబ్బు సమస్యల వల్ల మీ దగ్గర డబ్బు తీసుకుని ఇందును పంపించేశాను అని చెప్పగానే.. భూషణ్‌ ప్రేమకంటే డబ్బుకే ఎక్కువ ఇంపార్టెంట్‌ ఇచ్చావన్నమాట అనగానే.. రాజు అవును కానీ ఆ తర్వాతే అర్థం అయింది. డబ్బుతో ఏమైనా కొనగలం కానీ ప్రేమను, మనసును కొనలేం అని నేను అప్పుడు మీతో పాటు ఇందును మాత్రమే పంపించలేదు అని చెప్తుంటే.. శేషు అడ్డు పడి అదేంటి బాబు ఇందునేగా పంపించావు అని అడగ్గానే.. రాజు తనతో పాటు ఇంకోటి పంపించాను మామయ్య.. అదే నా మనసును పంపించాను.. అసలు తను లేకపోతే నాకు జీవితంమే లేదనిపించింది.. అప్పుడే డిసైడ్‌ అయిపోయాను ఎలాగైనా తన ప్రేమను పొందాలని.. నా ప్రేమ విషయం తనకు చెబుదామని ట్రై చేస్తుంటే.. అప్పుడే తెలిసింది తనకు మీ అబ్బాయితో పెళ్లి జరిపించబోతున్నారని.. అందుకే ఇలా చేశాను అంటూ చెప్తాడు రాజు.

దీంతో రేఖ కోపంగా నువ్వు దొంగతనంగా పెళ్లి చేసుకుంటే అది నిజమైన పెళ్లి కాదు.. బొమ్మల పెళ్లి అవుతుంది.. ఇందు మెడలో నువ్వు కట్టిన తాళి తీసేస్తా అంటూ తాళి తీయబోతుంటే రాజు అడ్డుపడతాడు. మా ఇద్దరికి నిజమైన పెళ్లి జరిగింది.. నువ్వు ఇక ఏమీ చేయలేవు.. కావాలంటూ చూడు మా పెళ్లి రిజిష్టర్‌ చేయించా.. ఇంకొన్ని రోజుల్లో మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ కూడా వస్తుంది. ఇంకా మా పెళ్లిఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి చూడండి అంటూ తన ఫోన్ లో ఫోటోలు వీడియోలు చూపిస్తాడు రాజు. దీంతో భ్రమరాంబ వీళ్లు నిజంగా పెళ్లి చేసుకున్నారు ఇక మనం చేయడానికి ఏమీ లేదు.. అంటుంది. దీంతో రాజు చూడ్డానికి కామెడీ ఫేస్‌లా ఉన్నా.. నిజం చెప్పావు.. ఇక మీరందరూ నన్ను ఈ ఇంటి అల్లుడిగా ఒప్పుకోక తప్పుదు.. అంటాడు. దీంతో లేకపోతే ఏం చేస్తావురా అంటూ రేఖ తిట్టగానే.. అరేయ్‌ గిరేయ్‌ అనోద్దు పిన్ని నేను ఇప్పుడు ఈ ఇంటి అల్లుడిని ఇప్పుడు ఇది పెళ్లి కాదు కూడదు అంటే.. ఈ ఫోటోలతో వెళ్లి ఏదో ఒక న్యూస్‌ చానెల్‌లో కూర్చుంటాను అంటూ రేఖను బెదిరిస్తాడు రాజు.

Advertisement

దీంతో ఇందు కూడా ఇలాగే నన్ను బెదిరించాడు ఆంటీ అందుకే భయంగా తాళి కట్టించుకున్నాను.. కన్నీళ్లతో వేలి ముద్ర వేశా కానీ వీడంటే నాకు అసలు ఇష్టం లేదు. జరిగిపోయిన పెళ్లి ఎలాగూ జరిగిపోయింది. మీరు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను ఆంటీ కానీ వీడిని బయటకు పంపిస్తే మన ఇంటి పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది ఆంటీ.. అంటూ ఇందు చెప్పగానే.. రేఖ కోపంగా చూస్తుంది. రాజు కోపంగా ఏంటి అలా చూస్తున్నావు.. సరేలే పద వెళ్దాం.. ఫస్ట్‌ టైం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాము.. గుమ్మం దాటి ఇంట్లోకి రమ్మంటారా..? లేక మీడియా గుమ్మం తొక్కమంటారా..? అంటాడు. దీంతో భ్రమరాంబ ఏదో ఒకటి చెప్పు రేఖ అనగానే.. లోపలికి రమ్మను వదిన అంటూ వెళ్లిపోతుంది. దీంతో భ్రమరాంబ హారతి తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది.

ఇంట్లోకి వచ్చిన రాజును చూసిన అపర్ణ ఎమోషనల్ అవుతుంది. నాన్న అచ్చం నువ్వు నా కొడుకులా ఉన్నావు..? అంటూ ఏడుస్తుంది. నీ పేరేంటి..? అని అడగ్గానే..రాజు అని చెప్పగానే.. అపర్ణ, సుభాష్‌ మరింత ఆశ్చర్యపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×