E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మదన్, ఇందులకు పెళ్లి ఫిక్స్ చేసిన రేఖ  

Brahmamudi Serial Today Episode May 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మదన్, ఇందులకు పెళ్లి ఫిక్స్ చేసిన రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్య కోపంగా రాజుకు కాల్‌ చేస్తుంది. లక్కీ ఫోన్‌ చూసి అరేయ్‌ మామ ఐశ్వర్య ఫోన్‌ చేస్తుంది. డబ్బుల గురించి అడుగుతుంది. ఏం చేయాలి చెప్పరా మామ నువ్వు అలా సైలెంట్‌గా ఉంటే ఎలా చెప్పు.. అనగానే..ఫోన్‌ కట్‌ అవుతుంది. దీంతో ఐశ్వర్య కాల్‌ లిఫ్ట్‌ చేయడం లేదేంటి అసలు ఏమనుకుంటున్నారు వీళ్లు నా గురించి  అనుకుంటూ మళ్లీ చేస్తుంది ఐశ్వర్య. లక్కీ కంగారు పడుతూ చూశావా..? మళ్లీ చేస్తుంది. వదిలిపెట్టడు. మామ లిఫ్ట్ చేసి మాట్లాడరా.. నేనైతే తనను ఫేస్‌ చేయలేను. నువ్వైతే ఏదో ఒకటి చెప్పి మానేజ్‌ చేయరా..? అంటూ కాల్‌ లిఫ్ట్‌ చేసి ఇవ్వగానే..

ఐశ్వర్య కోపంగా ఏయ్‌ ఏంటి ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి ఆటలుగా ఉందా..? డబ్బులు ఇస్తానని కమిట్‌ అయ్యారు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు డిలే చేస్తున్నారెందుకు అనగానే.. రాజు మీరు టెన్షన్‌ పడకండి తొందరలోనే ఇచ్చేస్తాము అని చెప్పగానే.. ఐశ్వర్య ఏంట్రా మీరు ఇచ్చేది అంటుంది. దీంతో రాజు కోపంగా ఏయ్‌ రా ఏంటే రా పిచ్చిపిచ్చిగా ఉందా..? రా అంటున్నావు. నీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.. మర్యాద ఇచ్చిపుచ్చుకో అనగానే.. ఐశ్వర్య మరింత కోపంగా ఏట్రా నీకు మర్యాద ఇచ్చేది. డబ్బులు ఇవ్వాలన్న సంగతి తెలియదు కానీ మర్యాద కావాల్సి వస్తుందా..? నీకు అనగానే.. రాజు కోపంగా ఇదిగో చూడు నువ్విలాగే మాట్లాడితే నేను దిగజారిపోయి మాట్లాడగలను. అంటూ చెప్పగానే..

Advertisement

ఐశ్వర్య ఏంట్రా బెదిరిస్తున్నావా..? ఏం మాట్లాడతావో మాట్లాడరా..? అనగానే.. చూడు నేను చాలా కంట్రోల్‌గా చెప్తున్నాను. మళ్లీ మళ్లీ చెప్పడానికి నాకు ఓపిక లేదు.  మాకు డబ్బులు వచ్చేంత వరకు మేము నీకు ఇవ్వలేం. అప్పటి వరకు వెయిట్‌ చేస్తే చేయ్‌  లేదంటే ఊరుకో అంతే కానీ ఫోన్‌ చేసి పిచ్చి పిచ్చి వాగుడు వాగకు అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. ఐశ్వర్య ఇరిటేట్‌ అవుతుంది. ఇటువైపు లక్కీ కూడా ఎందుకురా అంత కోపంగా మాట్లాడుతున్నావు.. ఎందుకు ఇలా బిహేవ్‌ చేస్తున్నావు అంటూ అడగ్గానే.. రాజు కోపంగా లక్కీని తిడతాడు. దీంతో లక్కీ ఎమోషనల్‌ అవుతాడు. నీ అవసరం తీరాక నన్ను దూరం పెడుతున్నావా..? వెళ్తాను మామ అంటూ లక్కీ వెళ్లిపోతాడు.

ఇందు కిచెన్‌లో వంట చేస్తుంటే అపర్ణ హెల్ప్‌ చేస్తుంది. అప్పుడే స్వాతి వెళ్లి ఎంత బాగా స్మెల్ వస్తుందో.. అంటూ ఇందు చేస్తున్న వంటను మెచ్చుకుంటుంది. నాన్నమ్మ అక్కు పెళ్లి చేద్దామా..? అంటుంది. దీంతో ఇందు ఎందుకు ఆస్థి మీద నాకు హక్కు రావడానికా..? అంటుంది. అపర్ణ మాత్రం పెళ్లి చేయడం అంటే అంత సులువు అనుకున్నావా..? అంటుంది. ఇందును పెళ్లి చేసుకునే వాడు ఎలా ఉండాలో అపర్ణ చెప్తుంది. ఇంతలో హాల్లోంచి రేఖ ఇందును పిలుస్తుంది. కిచెన్‌ లోంచి ముగ్గురు రాగానే.. హాల్లో పంతులు, రేఖ, భూషణ్‌, భ్రమరాంబ ఉంటారు. అపర్ణ పంతులు ఎందుకొచ్చారు అని అడుగుతుంది. రేఖ మంచి ముహూర్తం చూడటానికి వచ్చారు అని చెప్తుంది.

Advertisement

ముహూర్తమా..? దేనికి ఇంట్లో ఏదైనా పూజ చేస్తున్నామా.. అని స్వాతి అడుగుతుంది. అదేం లేదు కానీ ఆంటీ మీరు వెళ్లి అంకుల్‌ ను తీసుకురండి అని చెప్పగానే.. అపర్ణ లోపలికి వెళ్లి సుభాష్‌ను తీసుకొచ్చి ఇప్పుడు చెప్పు పంతులు గారిని ముహూర్తం ఎందుకు చూడమన్నావు అని చెప్పగానే.. ఇందుకు నా కొడుకు మదన్‌కు పెళ్లి చేయాలని డిసైడ్‌ అయ్యాను అంటుంది రేఖ. రేఖ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ తిట్టినా.. సుభాష్‌ తిట్టినా.. పట్టించుకోకుండా మదన్‌ రాగానే ఇందును పక్కన కూర్చోబెట్టి చూడండి వీరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ చెప్తుంది. అపర్ణ కోపంగా ఇందు కన్నా మదన్‌ మూడేళ్లు చిన్న వాడు అని చెప్పినా వినకుండా ఈ పెళ్లి చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది.

తర్వాత స్వాతి, ఇందు, అపర్ణ, సుభాష్‌ నలుగురు కలిసి రేఖ నిర్ణయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. ఎలాగైనా ఈ పెళ్లి నుంచి ఇందును తప్పించాలని ఆలోచిస్తారు. ఇందు మాత్రం పెళ్లి వద్దంటే అపర్ణ, సుభాష్‌ లను చంపేస్తుందేమోనని భయపడుతుంది. దీంతో అపర్ణ, ఇందును కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. పొరపాటున మదన్‌తో నీకు పెళ్లి జరిగితే మేము చనిపోయినట్టే లెక్క అంటూ ఎమోషనల్‌ అవుతుంది. స్వాతి కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అక్కా ఈ పెళ్లి జరగడం మాకెవరికీ ఇష్టం లేదు అంటూ చెప్పి వెళ్లిపోతుంది.

తర్వాత బయట మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్న స్వాతిని చూసి ఇందు షాక్‌ అవుతుంది. ఎందుకు ఏడుస్తున్నావంటూ అడగ్గానే.. తాను మదన్ ను ప్రేమిస్తున్నానంటూ మదన్‌ తో నా పెళ్లి నువ్వెలా జరుపుతావు అంటూ ఎమోషనల్‌ అవుతుంది. స్వాతి మాటలకు ఇందు షాక్‌ అవుతుంది. తర్వాత తేరుకుని స్వాతి నీకు మాటిస్తున్నాను.. ఈ పెళ్లి జరగదు.. అంటూ చెప్తుంది.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×