// // Brahmamudi Serial Today May 30th: - ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుకి దొరికిన దొంగ – ధాన్యలక్ష్మికి దొరికిపోయిన అప్పు, కళ్యాణ్‌   -->
E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుకి దొరికిన దొంగ – ధాన్యలక్ష్మికి దొరికిపోయిన అప్పు, కళ్యాణ్‌  

Brahmamudi Serial Today May 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుకి దొరికిన దొంగ – ధాన్యలక్ష్మికి దొరికిపోయిన అప్పు, కళ్యాణ్‌  
Advertisement

Brahmamudi serial today Episode: దొంగ చార్లెస్‌ రాజ్‌, కావ్యను తాడుతో కట్టేసి అక్కడ ఉన్న స్వట్లు తింటుంటాడు. ఇంతలో రాజ్‌ రాజ్‌ మెల్లగా ఫోన్‌ తీసుకుని అప్పుకు మెసేజ్‌ పెడతాడు. సిటీలో గాలిస్తున్న అప్పు గట్టిగా స్టాప్‌ అంటుంది. కళ్యాణ్‌ కారు ఆపేసి ఏమైంది పొట్టి అని అడుగుతాడు. ఆ చార్లెస్‌ గాడు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మన ఇంట్లోనే తిష్ట వేశాడట అని చెప్పగానే కళ్యాన్‌ ఆశ్చర్యంగా ఏంటి మన ఇంటికి వెళ్లాడా..? అంటాడు. అవును అక్కను బావను వాడు రూంలో లాక్‌ చేశాడట. వెంటనే మనం వెళ్లాలి త్వరగా పోని కూచి అని చెప్పగానే.. సరే అంటూ కళ్యాణ్‌ కారు తిప్పుతాడు. రూంలో ఉన్న రాజ్‌ అప్పు, కళ్యాన్‌ వస్తున్నారట వాళ్లు వచ్చే వరకు మనం వీడిని తాడుతో కట్టిపడేయాలి అని రాజ్‌ కట్టు విప్పుతాడు.

అంటే ఇప్పటిదాకా తాడు ఉన్నట్టు నాటకం ఆడారా..? అంటూ కావ్య కోప్పడుతుంది. రాజ్‌ ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ ముందు వాణ్ని కట్టి పడేయాలి పదా అంటూ ఇద్దరూ కలిసి చార్లెస్‌ ను తాడుతో కట్టిపడేస్తారు. ఇంతలో వెనక నుంచి అప్పు, కళ్యాణ్‌ వచ్చి పిలవగానే.. చార్లెస్‌ ను సంచిలో వేసి మూట గట్టి కిందకు పడేస్తారు. కానిస్టేబుల్స్‌ పట్టుకుని సంచి ఓపెన్ చేస్తారు. చార్లెస్‌ ను పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్తారు. కళ్యాణ్‌, అప్పు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అందరూ హాల్లోనే ఉన్నారు అని కళ్యాణ్ చెప్తాడు. మనం వెంటనే గదిలోకి వెళ్లిపోవాలి. లేదంటే అందరికీ అక్కా బావ ఎక్కడ అని డౌట్‌ వస్తుంది అంటుంది అప్పు. దీంతో హాల్లో కూర్చున్న ఇంద్రాదేవి ఇంతసేపు అయినా కావ్య, రాజ్‌  రాలేదేంటి అని అడుగుతుంది. దీంతో అప్పు, కళ్యాణ్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ధాన్యలక్ష్మీ, సుభాష్‌ వస్తారు. అప్పు, కళ్యాణ్‌ను లోపలికి తీసుకెళ్లి అందిరి ముందు చర్చ పెడతారు.

Advertisement

మీకు ఇంకా అర్థం కాలేదా..? అప్పు కేసు పని మీద పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పింది కదా..? దానికి ధాన్యలక్ష్మీ నో అంది దానికే మొగుణ్ని కన్వీన్స్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు ఉంది అంటూ రుద్రాణి చెప్పగానే.. రుద్రాణి చెప్పింది నిజమా అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. నిజమా అని అలా అడుగుతావేంటి ధాన్యలక్ష్మీ నిన్ను మోసం చేసి వెళ్లారు అని రుద్రాణి చెప్తుంది. దీంతో కళ్యాణ్‌ కోపంగా అత్తా  నువ్వు లేనిపోని గొడవలు పెట్టకు.. కాసేపు ఆగే..  అమ్మా నిన్ను మోసం చేయాలనో బాధ పెట్టాలనో కాదు.  మేము పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది నిజమే కానీ వెల్లడానికి ఒక కారణం ఉంది. అప్పు ఎంతో కష్టపడి పట్టుకున్న ఒక దొంగ తప్పించుకున్నాడు. వాణ్ని పట్టుకోవడానికే మేము వెళ్లాము. అలా వెళ్లకపోయి ఉంటే అప్పు జాబ్‌ పోయేది అని కళ్యాణ్‌ చెప్తాడు. ప్రకాష్‌ మాత్రం కూల్‌గా ఇంతకీ ఆ దొంగ దొరికాడా..? అని అడగ్గానే.. ధాన్యలక్ష్మీ కోపంగా ఇప్పుడు అదా ముఖ్యం మీ కోడలు చేసే పనికిరాని చేజింగ్‌ లోకి మన కొడుకును కూడా తీసుకెళ్లి వాడిని కూడా రిస్క్‌ లో పడేసింది. ఒకవేళ వాడికి జరగరానికి జరిగి ఉంటే.. అంటూ ప్రశ్నిస్తుంది.

దీంతో కళ్యాణ్‌ అమ్మ  అర్ధరాత్రి నా భార్య బయటకు వెళ్తుంటే తోడుగా  వెళ్లకుండా ఎలా ఉండమంటావు. అయినా ఇప్పుడు నాకేం కాలేదు కదా అంటాడు కళ్యాణ్‌. దీంతో ధాన్యలక్ష్మీ  కోపంగా ఒకవేళ అయి ఉంటే.. అంటూ నిలదీస్తుంది. ఇంతలో అప్పు కల్పించుకుని అత్తయ్యా మీరు చెప్పింది కరెక్టే.. నేను చేసే పనిలో కళ్యాణ్‌ ను ఇన్వాల్వ్‌ చేసి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి అత్తయ్యా అంటుంది అప్పు. చేతులెత్తి దండం పెట్టినంత మాత్రానా నువ్వు చేసింది తప్పు కాకుండా పోతుందా..? అంటూ రుద్రాణి అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా ఆగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పుడు ధాన్యలక్ష్మీని ఎందుకు రెచ్చగొడుతున్నావు నోరు మూసుకుని ఉండలేవా… అంటూ తిడుతుంది.

Advertisement

దీంతో రుద్రాణి ప్రతిసారి నన్నే అనండి కానీ నేను ఏం చెప్తున్నానో అర్తం చేసుకోకండి.. ఒకవేళ వీళ్లు పట్టుకోవాలనుకున్న దొంగ దగ్గర రివాల్వర్‌ ఉండి ఉంటే.. అంటూ బయపెట్టినట్టు మాట్లాడుతుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. అప్పును కళ్యాణ్‌ను మెచ్చుకుంటారు. మరి మీరిద్దరూ ఇక్కడున్నారు మరి రాజ్‌, కావ్య ఎక్కడున్నారు అని అడగ్గానే.. వాళ్లు మా గదిలో ఉన్నారు అని చెప్తారు. దీంతో అందరూ పైకి శోభనం గదిలోకి వెళ్తారు. అందరినీ చూసి షాక్‌ అవుతారు. తర్వాత రాజ్‌, కావ్యకు ప్రపోజ్‌ చేయబోతుంటే వైదేహి ఫోన్‌ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×