E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్మీ, చలపతిలను కలిసి నిజం చెప్పిన శృతి

Brahmamudi Serial Today Episode May 2nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్మీ, చలపతిలను కలిసి నిజం చెప్పిన శృతి
Advertisement

Brahmamudi serial today Episode: గుడిలో ఉన్న ఇందు దగ్గరకు వెళ్లిన రేఖను చూసిన ఇందు షాక్‌ అవుతుంది. ఇంతలో రేఖ, భూషణ్‌కు ఫోన్‌ చేసి ఇందు దొరికింది డబ్బులు ఇచ్చేయ్‌ అని చెప్తుంది. భూషణ్‌ డబ్బులు లక్కీకి ఇస్తాడు. లక్కీ డబ్బులు  తీసుకుని వెళ్లిపోతాడు. రేఖ, ఇందును తీసుకుని వెళ్లిపోతుంటే.. రాజు బాధగా చూస్తుంటాడు. ఇందు బాధగా రాజును చూస్తూ వెళ్తుంది. ఇందు ఏడుస్తూ.. రాజును చూస్తూ కారెక్కి వెళ్లిపోతుంది. రాజు బాధపడుతుంటే లక్కీ చూసి షాక్‌ అవుతాడు. డబ్బులు చూపిస్తూ.. డబ్బులు అందాయిరా.. ఏంట్రా అంతలా ఫీలవుతున్నావు..? ఇందాక కూడా ఏదో తెగ ఫీలవుతున్నానని చెప్పావు. ఇప్పుడు ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు..? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా..? అందుకే అంతలా ఫీలవుతున్నావా..? అని లక్కీ అడగ్గానే.. ఓరేయ్‌ పిచ్చోడా… ప్రేమా తొక్కా..? మనకి  డబ్బులే ముఖ్యంరా.. అవి వచ్చేయిగా ఇలా ఇవ్వు అంటూ తీసుకుంటుంటే..

లక్కీ మరి ఎందుకు అంతలా ఫీలవుతున్నావు అని అడగ్గానే.. రేయ్‌ ఫీల్‌ లేదు ఏం లేదు.. అని చెప్పగానే.. సరేలే మన వాటా పది.. నా ఫిగర్‌ వాటా పది ఇచ్చేయ్‌ అనగానే.. డబ్బులు లెక్క పెడుతూ కూడా రాజు, ఇందును గుర్తు చేసుకుంటూ ఆగిపోతాడు. లక్కీ ఒరేయ్‌ మామ డబ్బులు అందాయి కదరా..? అయినా కూడా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడగ్గానే.. రాజు బాధపడుతూ.. ఇందు కారెక్కుతూ కూడా నా వైపు ఒక లుక్కు ఇచ్చిందిరా.. తను అలా దూరంగా వెళ్తున్నా కూడా నావైపే చూస్తుంది. ఆ కళ్లల్లో ఏదో కాంతి కనిపించింది. తన కళ్లల్లో ఏవో చక్రాలు తిరుగుతున్నట్టు అనిపించిందిరా దాని అర్థం ఏంటో అర్థం కాలేదురా..? అనగానే.. లక్కీ నేను కూడా చూశాను మామ నాకు ఒకటి అర్థం అయింది అని చెప్పగానే..

Advertisement

రాజు ఏంటి ఏం చూశావు.. ఏం అర్థం అయింది అని అడగ్గానే.. లక్కీ రాత్రి మిగిలిపోయిన కూరలు ఫ్రిజ్‌లో ఉన్నాయని అవి మర్చిపోకుండా తినండని తన కళ్లతో చెప్తుంది. ఏం కాదంటావా..? అని చెప్పగానే.. రాజు డిస్సపాయింట్‌గా నీ దగ్గర నుంచి ఇంతకన్న ఎక్కువ ఎక్స్‌ఫెక్ట్‌ చేయలేనురా.. రేయ్‌ ఆ డబ్బు ఆ సాహు గాడికి ఇచ్చేయ్‌ అని చెప్పగానే.. ఏం నువ్వు రావా..? అని లక్కీ అడిగితే నేను తర్వాత వస్తాను నవ్వు వెళ్లి ఆ సాహు గాడికి డబ్బు ఇచ్చేయ్‌ నా ఫ్యామిలీ సేఫ్‌గా ఉంటుంది అని చెప్పగానే.. లక్కీ అలాగే అంటూ వెళ్లిపోతాడు.

ఇందును ఇంటికి తీసుకెళ్లిన రేఖ హాల్లో తోసేస్తుంది. ఇందును చూసిన అపర్ణ, సుభాష్‌ హ్యాపీగా ఫీలవుతారు. అపర్ణ కోపంగా ఏయ్‌ నీకు బుద్దుందా ఎందుకు అలా తోసేస్తున్నావు.. ఏదైనా గాయం అయితే అంటూ తిట్టగానే.. నాకు అయినా గాయం కన్నా పెద్దది కాదులే నీ మనవరాలు కిడ్నాప్‌ అయిందని మీడియాకు చెప్తాను. పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తాను అన్నావు కదా..? ఇప్పుడు చూడు నేనే నీ మనవరాలిని ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పగానే.. భ్రమరాంబ వాళ్ల ముఖాలు చూస్తే తెలుస్తుంది కదా రేఖ వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో అని అనగానే..పక్కనే ఉన్న శేషు అవును అవును వాళ్ల కన్నా ఎక్కువ మనమే సంతోషంగా ఉన్నామని మన ముఖాలు కూడా చెప్తున్నాయి అంటాడు. మరోవైపు వెనక నుంచి అంతా గమనిస్తున్న ఐశ్వర్య ఇందు ఇంటికి వచ్చింది నా ప్లాన్‌ సక్సెస్‌ అయింది అని మనసులో అనుకుంటుంది.

Advertisement

భూషణ్‌ మాత్రం ఈ కిడ్నాప్‌ ఏంటో కానీ కిడ్నాపర్‌ కు ఇచ్చే డబ్బుల కోసం మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ప్రతి ఒక్కరి చేత మాటలు పడాల్సి వచ్చింది అంటాడు. భ్రమరాంబ బాధపడుతూ నా బంగారం మొత్తం లాగేసుకున్నాడు ఆ చక్రిగాడు.. ఇదంతా నీవల్లే కాస్త జాగ్రత్తగా ఉండి ఉటే.. మనకి ఈ బాధలు వచ్చేవి కాదు కదా అందరి ముందు గంభీరంగా తల ఎత్తుకుని బతికే మా రేఖ నీకోసం అందరి ముందు తల దించుకుని బతకాల్సి వచ్చింది అంటూ తిడుతుంది.  తర్వాత అందరూ వెళ్లిపోతారు. సుభాస్‌, అపర్ణ అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని అడగ్గానే.. ఇందు జరిగింది చెప్తుంది. అపర్ణ సుభాష్‌ ఎమోషనల్ అవుతారు.

రాజు హాస్పిటల్‌లో ఉంటాడు. ఐసీయూలో ఉన్న ఒక పేషెంట్‌ గురించి డీటెయిల్స్ అడుగుతుంటాడు. ఎంత డబ్బైనా సరే తను కోలుకోవాలని డాక్టర్‌కు చెప్తాడు. అయితే డాక్టర్‌ మాత్రం వారానికి పేమెంట్‌ ఆపకుండా ఉంటే తనకు ట్రీట్‌మెంట్‌ చేస్తామని చెప్తాడు డాక్టర్‌. దీంతో రాజు ఇప్పుడు కంటిన్యూగా డబ్బులు కడతానని తనకు ఏమీ కాకుండా చూసుకోమని డాక్టర్‌కు చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి, రాజును చూసి షాక్‌ అవుతుంది. రాజ్‌ సార్‌ లా ఉన్నారేంటి..? అనుకుంటూ రాజు వెళ్లి పోతుంటే వెనకే వెళ్లి బైక్‌ మీద వెళ్తున్న రాజును ఆటోలో ఫాలో అవుతుంది. ఇంటికి వెళ్లిన రాజును చలపతి నీ బిజినెస్‌ ఎలా ఉందని అడుగుతాడు. ఎటూ కాకుండా ఆగిపోయిందని దాని వల్ల లాభం లేదు  నష్టం లేదని చెప్తాడు. దీంతో ఏదైనా జాబ్‌ చూసుకోమని చలపతి చెప్తాడు.

లక్ష్మీ కూడా ఈసారి అయినా మీ నాన్న మాట వినరా..? అంటూ ఇందు గురించి అడుగుతుంది. ఇంతలో రాజుకు లక్కీ ఫోన్‌ చేసి బయటకు రమ్మని చెప్తాడు. రాజు బయటకు వెళ్లి బైక్‌ స్టార్ట్‌ చేస్తుంటే.. అప్పుడే శృతి వస్తుంది. ఆగమని రాజును అడిగితే రాజు కోపంగా మా నాన్న లోపల ఉన్నాడు వెళ్లి మాట్లాడండి అంటూ వెళ్లిపోతాడు. లోపలికి వెళ్లిన శృతి, రాజు గురించి అడగ్గానే.. చలపతి, లక్ష్మీ రాజు తమ కొడుకని చెబితే శృతి మీరు అబద్దం చెప్తున్నారు. తను మీ కొడుకు కాదు అంటుంది. దీంతో ఇద్దరూ షాక్‌ అవుతారు. నిజం చెబితే రాజు గురించి తెలుస్తుందేమోనని లక్ష్మీ చెప్పగానే.. చలపతి, శృతికి నిజం చెప్తుంది. దీంతో శృతి, చలపతి లక్ష్మీలకు నిజం చెప్తుంది. రాజు దుగ్గిరాల ఇంటి వారసుడు అంటుంది. చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×