E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు కావ్య గోల్డ్ చైన్ ఇచ్చిన ఇందు  

Brahmamudi Serial Today Episode May 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు కావ్య గోల్డ్ చైన్ ఇచ్చిన ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode: శేషు వచ్చి రాజును కాకా పడుతుంటాడు. ఎప్పటికైనా  సీఈవో అవుతాడని ఇప్పుడే కర్చీప్‌ వేసుకుంటే పోతుంది కదా అనుకుంటాడు. దీంతో రాజు, రేఖ గురించి అడిగితే తను ఒక ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫెలో అని తిడుతుంటాడు. అయితే మరి నేను అంటూ రాజు అడగ్గానే.. నువ్వా.. బంగారానివి.. ప్రపంచాన్నే జయించగలిగినంత నాలెడ్జ్‌ ఉంది నీకు అది కాదు అల్లుడు నీ సీఈవో అయ్యే పనులు ఎంత వరకు వచ్చాయి అని అడగ్గానే.. రాజు మనసులో నేను సీఈవో ఏంటి..? మీ ఇందు చేసే పనుల గురించి తెలిస్తే.. గుండె ఆగి చస్తారు అని మనసులో అనుకుని అవును కానీ మీ ఇందు గురించి ఒక్క ముక్కలో చెప్పు అని అడుగుతాడు. దీంతో శేషు ఇందు కూడా నీలాగే బంగారం కాకపోతే చాలా అమాయకురాలు.. అక్షరం ముక్క కూడా రాదు.. అని చెప్పగానే.. రాజు మనసులో మిమ్మల్ని తింగరోళ్లను చేసి ఆడుకుంటుంది అది. దానికి చదువు రాకపోవడం ఏంటి..? ఎవరికీ తెలియకుండా డిగ్రీల మీద డిగ్రీలు చదివేసింది… కొన్నాళ్ల తర్వాత మిమ్మల్ని ఎలా ఆడుకుంటుందో అది తలుచుకుంటుంటే.. అనుకుంటూ రాజు నవ్వగానే..

శేషు ఏంటి అల్లుడు ఏంటి నవ్వుతున్నావు అని అడగ్గానే.. రాజు ఏం లేదు ఫ్యూచర్‌ కనిపించిందిలే.. అంటాడు. ఎవరి ఫీచర్‌ అయినా నీ సీఈవో ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి అల్లుడు అని అడగ్గానే.. అవుతున్నాయి మామ పక్కా మనమే సీఈవో అవుతాము అని చెప్పగానే.. అయితే నువ్వు సీఈవో అయితే నన్ను పీఏగా పెట్టుకుంటావా..? అని అడగ్గానే.. రాజు చీచీ నువ్వు నా పీఏ ఏంటి..? అంటాడు. దీంతో ఏంటి అల్లుడు అంత మాట అన్నావు. ఎవరినో తెలియని వాళ్లను పెట్టుకోవడం బదులు తెలిసిన వాణ్ని మామయ్యను నన్ను పెట్టుకుంటే.. సరిపోతుంది కదా..? అంటాడు.. నిన్ను పీఏగా పెట్టుకుంటే ఏం చేస్తావు. వాటర్‌ బాటిల్లు మోస్తావా..? అని రాజు అడగ్గానే.. ఏదైనా మోస్తాను అల్లుడు అంటూ శేషు చెప్పగానే.. అయితే నీ పీఏ పోస్ట్‌ కన్ఫం అని రాజు చెప్పగానే.. శేషు.. ఆనందంతో హమ్మయ్య ఇక్కడ నా పీఏ పోస్ట్‌ కన్ఫం. ఒకవేళ రేఖ గెలిస్తే అక్కడ భ్రమరాంబ పీఏ పోస్ట్‌ కన్ఫం అని మనసులో సంబరపడుతుంటాడు శేషు.

Advertisement

ఇంతలో డాక్టర్‌, రాజుకు ఫోన్‌ చేసి డబ్బులు పే చేస్తేనే పేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ చేస్తామని లేదంటే పేషెంట్‌ను తీసుకెళ్లమని చెప్తాడు. దీంతో రాజు వెళ్లి ఇందును డబ్బులు అడిగితే ఇందు తన దగ్గర అంత డబ్బు లేదని.. వెంటనే తన మెడలో ఉన్న గోల్డ్‌ చైన్‌ తీసి రాజుకు  ఇస్తుంది ఇందు. నిజంగానే నువ్వు ప్రాబ్లమ్‌లో ఉన్నావని నాకు అర్థం అయింది అందుకే ఈ గోల్డ్ చైన్‌ను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకో తర్వాత డబ్బు వచ్చాక తీసుకుంటాను అంటూ ఇచ్చి రాజు ఇది నాకు మా అమ్మ జ్ఞాపకం దయచేసి దాన్ని అమ్మోద్దు అంటూ చెప్తుంది. రాజు చైన్‌ తీసుకుని వెళ్లిపోతాడు. రాజు చైన్‌ తీసుకుని వెళ్లిపోయాక ఇందు ఎమోషనల్‌ అవుతుంది. వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని సారీ చెప్పుకుంటుంది.

ఇంటర్వ్యూ కు వెళ్లిన వెంకట్‌ను అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సర్టిఫికెట్స్‌ అన్ని బాగానే ఉన్నాయని.. కానీ మీకు ఎఐ టెక్నాలజీ తెలుసా..? అని అడుగుతాడు. తనకు ఏఐ టెక్నాలజీ రాదని చెప్పగానే.. అక్కడ జాబ్‌ లేదని చెప్తాడు. వెంకట్‌ నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక గోల్డ్‌ చైన్‌ తీసుకుని షాపు దగ్గరకు వెళ్లిన రాజు చైన్‌ తాకట్టు పెట్టుకుని డెబ్బై వేలు ఇవ్వమని అడుగుతాడు. షాపు యజమాని యాభై వేలు ఇస్తానని చెప్పడంతో రాజు 70 వేలు ఇవ్వమని రిక్వెస్ట్‌ చేస్తాడు. ఆయన మాత్రం 50వేలే ఇస్తానని కరాకండీగా చెప్పడంతో రాజు యాభై వేలు తీసుకుని వెళ్లి హాస్పిటల్‌ లో పే చేస్తాడు. తర్వాత డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పేషెంట్‌ ఎలా ఉందని అడుగుతాడు. డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ కంటిన్యూ అవుతుందని ఇప్పుడు పర్వాలేదని నెక్స్ట్‌ టైం పేమెంట్‌ లేట్‌ చేయోద్దని చెప్తాడు. రాజు సరే అంటూ ఐసీయూ దగ్గరకు వెళ్తాడు.

Advertisement

మరోవైపు ఇంకో ఇంటర్య్యూకు వెళ్లిన వెంకట్‌కు ఏఐ టెక్నాలజీ ఉంటేనే జాబ్‌ ఇస్తామని చెప్తారు. వెంకట్‌ తాను ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటానని ముందు జాబ్‌ ఇవ్వమని అడుగుతాడు. అలా కుదరదని కంపెనీ హెచ్‌ ఆర్‌ చెప్తాడు. దీంతో వెంకట్‌ నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.  హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన రాజు చిరాకుగా ఇందును తిడతాడు. నేనేదో నీ సొంత మొగుడైనట్టు పెత్తనం చేస్తున్నావేంటి..? అంటూ కోప్పడుతుంటే.. లోపలి నుంచి అపర్ణ ఏంటి బాబు ఏమైంది అంటూ వస్తుంది. అపర్ణను చూసిన ఇందు, రాజు షాక్ అవుతారు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×