E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: భ్రమరాంబకు షాక్ ఇచ్చిన రేఖ

Brahmamudi Serial Today Episode May 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: భ్రమరాంబకు షాక్ ఇచ్చిన రేఖ
Advertisement

Brahmamudi serial today Episode: రాజు, ఇందు వెళ్లి బోర్డు మెంబర్‌ పరంధామయ్యను కలుస్తారు. పరంధామయ్య ఇందు, రాజులను చూసి అచ్చం స్వరాజ్‌, కావ్యలలాగే ఉన్నారని రేఖ కంపెనీలో చేసే అరాచకాలు చూడలేకే దూరంగా ఉంటున్నాను. రేఖ వల్ల కంపెనీనే వదిలేద్దామనుకున్నాను కానీ సీతారామయ్యకు ఇచ్చిన మాట కోసం ఉండిపోయాను అంటూ చెప్తుంటే.. అందుకే తాతయ్య గారు.. నేను కంపెనీకి పూర్వ వైభవం కోసం ముందుకు వెళ్తున్నాను అంటూ చెప్పగానే.. కంపెనీకి పూర్వ వైభవం వస్తుందంటే నాకు సంతోషమే ఇప్పుడు నేనేం చేయాలి అంటూ పరంధామయ్య అడగ్గానే..

రాజు మేము చెప్పినట్టు చేయాలి. ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు.. ఒకమాట తక్కువ మాట్లాడకూడదు అనగానే.. పరంధామయ్య ఆశ్చర్యంగా చూస్తుంటే.. రాజు సారీ తాతయ్యగారు. ఏదో ఫ్లోలో అలా అనేశాను.. మీరు మనసులో ఏదీ పెట్టుకోకూడదు.. ఇందు చెప్పినట్టు ఫాలో అయితే చాలు అంతేకదండి అనగానే.. ఇందు చిన్నగా.. చాలా ఓవరాక్షన్‌ చేస్తున్నావు ఇచ్చే ఇరవై అయిదు వందలకు ఫర్మామెన్స్‌ ఎక్కువ చేయకు అంటూ కంపెనీ సీఈవో గురించి తాను ఏం చేయబోతుందో చెప్తుంది. దీంతో పరంధామయ్య నాకెందుకో నువ్వు పెద్ద ప్రమాదానికి ఎదురెళ్తున్నట్టు ఉన్నావు.. కానీ నీ ఆశయం గొప్పది కాబట్టి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పగానే.. ఇందు, రాజు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Advertisement

రేఖ కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంటే.. భ్రమరాంబ, శేషు వచ్చి ఎవరికోసం వెయిట్‌ చేస్తున్నావు అని అడగ్గానే.. మదన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడే మదన్‌ రాగానే.. ఏంట్రా ఎక్కడికి వెళ్లావురా..? ఈరోజు నుంచి నువ్వు ఇందుకు క్లోజ్‌గా ఉండాలి అది నీ మాట వినేలా చేయాలి అని చెప్పగానే.. భ్రమరాంబ ఏం మాట్లాడుతున్నావు రేఖ. దానికి పెళ్లై మొగుడు ఉన్నాడు కదా.. అని చెప్పగానే.. దానికి సంవత్సరంలో విడాకులు వస్తాయి కదా… ఏయ్‌ మదన్‌ గుర్తు పెట్టుకో.. ఈ రోజు నుంచి నువ్వు అదే పనిలో ఉండు.. నువ్వు లేకపోతే అది చచ్చిపోతాను అనేలా చేయాలి. అని చెప్పగానే.. మదన్‌ ట్రై చేస్తాను మమ్మీ అంటూ వెళ్లిపోతాడు. భ్రమరాంబ, శేషు షాక్‌ లో ఉంటారు. తర్వాత ఇందు, రాజుల ఫస్ట్‌ నైట్‌ ఏర్పాటు చేయాలని.. అందుకోసం అపర్ణ, సుభాష్‌ లకు తెలిసేలా చేస్తారు. భ్రమరాంబ, శేషుల మాటలు దూరం నుంచి అపర్ణ, సుభాష్‌ వింటారు. భ్రమరాంబ, శేషు వెళ్లిపోయాక అపర్ణ, సుభాష్‌తో ఇందు, రాజుల శోభనం చేయాలని చెప్తుంది.

వెంకట్‌ ఇంటర్వ్యూకు వెళ్తుంటే.. చలపతి, లక్ష్మీ అన్ని రెడీ చేస్తుంటారు. ఇంతలో నందు ఒక షర్ట్‌ పంపిస్తుంది. ఫోన్‌ చేసి షర్ట్‌ ఎలా ఉందని అడుగుతుంది. తాను పంపించిన షర్ట్‌ వేసుకుని ఇంటర్వ్యూకు వెళ్లమని చెప్తుంది. డిసపాయింట్‌ కాకుండా కాన్ఫిడెంట్‌గా వెళ్లు తప్పకుండా నీకు జాబ్‌ వస్తుంది అంటూ మోటివేట్‌ చేస్తుంది. సరే అంటూ వెంటక్‌ కాల్ కట్‌ చేశాక. లక్ష్మీ నందును మెచ్చుకుంటుంది. ఈ అమ్మాయి చాలా మంచి దానిలా ఉందని చెప్తుంది.

Advertisement

హాల్లో కూర్చుని ఆలోచిస్తున్న రాజును చూసిన శేషు.. అల్లుడు సీఈవోగా పోటీ చేస్తున్నాడు.. ఒకవేళ సీఈవోగా గెలిస్తే మనకు ఉపయోగపడతాడు.. ఇప్పుడే కాక పట్టుకోవాలి అనుకుంటూ వెళ్లి రాజుతో ఏదేదో మాట్లాడతాడు. దీంతో రాజు కోపంగా సీఈవోగా నేను గెలవకూడదని ఉందా..? నీకు అనగానే.. అదేం లేదని శేషు చెప్తాడు. రేఖ తిడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×