E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పంతులును పిలిపించిన ధాన్యలక్ష్మీ – పెద్దరికం తీసుకున్న రాజ్‌  

Brahmamudi Serial Today May 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: పంతులును పిలిపించిన ధాన్యలక్ష్మీ – పెద్దరికం తీసుకున్న రాజ్‌  
Advertisement

Brahmamudi serial today Episode: రూంలో రాహుల్ నెక్లెస్‌ మారుస్తుంటే.. ఇంతలో స్వప్న వస్తుంది. స్వప్నను చూసిన రాహుల్ టెన్షన్‌ పడుతుంటాడు. స్వప్న నువ్వా అంటాడు. మన రూంలోకి నేను రాకపోతే ఎవరు వస్తారు. మళ్లీ ఏం తప్పు చేశావు అని అడుగుతుంది. దీంతో రాముల్ చీచీ నేనేం చేస్తాను అంటూ రాహుల్ సమర్థించుకోవడంతో స్వప్న కప్‌బోర్డు తెరచి నెక్లెస్‌ చూస్తుంది. మిగతా నగలన్నీ చెక్‌ చేసుకుంటుంది. అన్ని కరెక్టుగానే ఉన్నాయి అంటుంది. దీంతో రాహుల్ అంటే నీ నగలు కొట్టేయడానికి వచ్చాను అనుకుంటున్నావా..? అంటాడు రాహుల్ అని నేను ఎక్కడ అన్నాను అంటుంది స్వప్న.

అనాల్సిన అవసరం లేదు.. నువ్వు రాగానే నగలు చెక్ చేసుకుంటున్నావు కదా అయినా నన్ను అనుమానించడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అడుగుతాడు రాహుల్‌. దీంతో స్వప్న నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు కాబట్టి అనుమానిస్తున్నాను అంటుంది. దీంతో రాహుల్ సిటీ మొత్తం తిరిగి నీకోసం ఒకటి తీసుకొచ్చాను అంటూ పూలు చూపిస్తాడు రాహుల్‌. దీంతో ఇవి నిజంగా నా కోసమే తీసుకొచ్చావా..? వేరే వాళ్లకు తీసుకొచ్చి మిగిలిపోయినవి నాకోసం తీసుకొచ్చావా..? అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.

Advertisement

హాల్లో అపర్ణ, ఇందిరాదేవి ఆలోచిస్తుంటారు. ఎందుకు వదిన టెన్షన్‌ పడతావు.  రాజ్‌ తప్పకుండా వస్తాడు. ముందు వచ్చి ఇలా కూర్చుని కావ్య పెట్టిన వేడి వేడి కాఫీ తాగు అంటాడు ప్రకాష్‌. దీంతో అపర్ణ నీకేం బాబు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటావు. కానీ నా పరిస్తితి అలా కాదు కదా అంటుంది. దీంతో ప్రకాష్‌ అలా అస్తమానం మర్చిపోతానని నా మీద నిందలు వేయకండి వదిన.. రాజ్‌ ఇక్కడికి వచ్చి యామిని పెళ్లి విషయం మాట్లాడతాడు అంతే కదా అంటాడు ప్రకాష్‌. దీంతో అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్‌ తలలు పట్టుకుంటారు. ఏంటి అందరూ అలా తలలు పట్టుకున్నారు. రాజ్‌ పెళ్లి విషయం మాట్లాడటానికి రావడం లేదా..? ఏదైనా ఫ్రోగ్రాం మారిందా అంటాడు ప్రకాష్‌. దీంతో అపర్ణ నీలాంటొడు ఒక్కడు చాలు నా కొడుకు గతం మర్చిపోవడానికి.. నీ మతిమరుపు కలిసి దగ్గరుండి యామిని పెళ్లి కూడా చేసేస్తావు అంటుంది.

దీంతో ఇంద్రాదేవి కల్పించుకుని రాజ్‌ వస్తుంది యామిని పెళ్లి విషయం మాట్లాడటానికి కాదు.. కావ్య ప్రేమ విషయం మాట్లాడటానికి అని చెప్తుంది. ఇంతలో రాజ్‌ వస్తాడు. వెనకాలే పంతులు వస్తుంటాడు. వీడేంటి పంతులును తీసుకొస్తున్నాడు.. కొంపదీసి వీడికి కూడా ప్రకాషం లాగా మతిమరుపు వచ్చిందా ఏంటి అంటుంది ఇంద్రాదేవి.. నాకు కూడా అదే అనుమానంగా ఉంది అత్తయ్యా వీడు ప్రేమ విషయం చెప్పడానికి వచ్చాడా..? లేక పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వస్తున్నాడా..? అని అపర్ణ అడుగుతుంది. ఇంతలో రాజ్‌ను పంతులును ఎందుకు పిలిపించావు అని అడుగుతారు. ఆ పంతులుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాజ్‌ చెప్తాడు. మరి ఎవరు పిలిపించారు అని అడగ్గానే.. నేనే పిలిపించాను అంటూ ధాన్యలక్ష్మీ వస్తుంది. అప్పు స్టేషన్‌కు వెళ్తుంటే.. ధాన్యలక్ష్మీ  హలో మీ కోసం పంతులును పిలిపిస్తే నువ్వు వెళ్తానంటావేంటి..? అంటుంది. మాకోసమా అంటూ ఆశ్చర్యంగా కళ్యాణ్‌ అడుగుతాడు. అవును మీ ఇద్దరి శోభనానికి   ఈ రోజు ముహూర్తం పెట్టమని పంతులు గారికి చెప్పాను అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇక రాజ్‌ రంగంలోకి దిగి కళ్యాణ్‌, అప్పులకు శోభనం చేయాలని తొందర పెడతాడు.

Advertisement

ధాన్యలక్ష్మీ పంతులును ముహూర్తం పెట్టమని చెప్తుంది. పంతులు పంచాంగం చూసి ఈరోజు రాత్రి 11 గంటలకు మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ అదే కాయం చేయండి అని చెప్తుంది. ఇంతలో కళ్యాణ్‌ అమ్మా ఒక్క నిమిషం.. మేము చెప్పేది వింటావా..? అంటుంటే.. ఇక ఏదీ మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పటి వరకు మీరు చెప్పింది విన్నాను.. ఈ రోజు మాత్రం ఆ ముహూర్తానికి మీ శోభనం జరగాల్సిందే.. ఇదే ఫైనల్‌.. అంటుంది. రాజ్‌ కూడా ఎస్‌ ఇదే ఫైనల్‌.. పిన్ని గారు చెప్పాక ఇక అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఫైనల్‌.. కళావతి గారు మీరు నాతో వచ్చారంటే శోభనానికి  కావాల్సిన లిస్ట్‌ అంతా పైనల్ చేద్దాం అంటాడు. దీంతో ఇంద్రాదేవి.. ఓరేయ్‌ దానికంటే ముందు మేము నీతో ఒక విషయం మాట్లాడాలి అంటే రాజ్‌ కంగారుగా నాన్నమ్మ అది అంటూ తప్పించుకోవడానికి చూస్తుంటే.. అపర్ణ, ఇంద్రాదేవి బలవంతంగా రాజ్‌ను పక్కకు లాక్కెళ్లతారు. నువ్వు ఇవళ చేయాల్సిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటి అంటూ తిడతారు. దీంతో శోభనం రూం డెకరేషన్‌ పూర్తి అయ్యే లోపు ప్రపోజ్‌ చేస్తాను అని రాజ్‌ చెప్పి వెళ్లిపోతాడు. దీంతో వీడు ఓవరాక్షన్‌ చేసి చెడగొట్టుకునేలా ఉన్నాడు అని అపర్ణ కంగారు పడుతుంది. ప్రశ్న, మనదే ఆన్సర్ మనదే అయినప్పుడు టెన్షన్‌ దేనికి అంటుంది ఇంద్రాదేవి.

తర్వాత రుద్రాణి, యామినికి ఫోన్‌ చేసి రాజ్‌ను ఎందుకు పంపించావు అని తిడుతుంది. ఎందుకు రాజ్‌ను ఆపలేకపోయావు అంటూ నిలదీస్తుంది. అయితే నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్‌ను వదిలిపెట్టనని యామిని చెప్తుంది. దీంతో రుద్రాణి అసలు నీ ప్లాన్‌ ఏంటి..? అని అడుగుతుంది. దీంతో యామిని తన ప్లాన్‌ చెప్తుంది. రాజ్‌ తిరిగి నా దగ్గరకు పరుగెత్తుకుని వచ్చేలా చేయబోతున్నాను. రాజ్‌ లో ఉన్న వీక్‌నెస్‌ నేను వాడుకోబోతున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×