E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వరాజ్ లా బిహేవ్ చేసిన రాజు  

Brahmamudi Serial Today Episode May 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వరాజ్ లా బిహేవ్ చేసిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: రాజు బోర్డు మెంబర్స్‌కు ఫోన్‌ చేసిన విషయం రేఖకు చెప్తుంది ఇందు. వాడు నా భర్తగా ఉండటానిని వీల్లేదని ఇంటిదాకా వచ్చిన వాడు కంపెనీకి సీఈవో కూడా అవుతాడని వాడిని అసలు నమ్మోద్దని వెంటనే ఏదైనా చేయండి ఆంటీ అంటూ ఇందు ఏమీ తెలియనట్టు నటిస్తుంది రేఖ ముందు. రేఖ మాత్రం నేను చూసుకుంటాను ఇందు నువ్వు వెళ్లు అని చెప్పగానే.. ఇందు అక్కడి నుంచి వెళ్తుంది. డోర్ దగ్గర నిలబడి అంతా వింటున్న రాజు షాక్‌ అవుతాడు. ఓసేయ్‌ రాక్షసి పోయి పోయి ఆ రేఖకు అంతా చెప్పేశావు. ఇది అసలు వదలదు. నన్ను మట్టిలో కప్పేసినా కప్పేస్తుంది. ఇందు దగ్గర తేల్చుకుందామని కోపంగా లోపలికి వెళ్లిపోతాడు.

వెంకట్‌ తన ఫ్రెండ్‌ డల్లుగా ఉంటే ఎందుకురా డల్లుగా ఉన్నావు అంటూ అడగ్గానే.. తమ కొలీగ్‌కు లేఆఫ్‌ ఇచ్చారట. మనకు కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు అంటూ చెప్పగానే.. వెంకట్‌ మనకేం అలాంటి పరిస్థితి రాదని చెప్తుండగానే.. వెంకట్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. తన అకౌంట్‌లో మూడు లక్షలు పడినట్టు వస్తుంది. దీంతో అనుమానంగా మేనేజర్‌ దగ్గరకు వెళ్లి అడగ్గానే.. నీ జాబ్‌ తీసేశామని.. నీకిచ్చే లక్ష జీతానికి ముగ్గురు చేసేందుకు రెడీగా ఉన్నారని చెప్తాడు. దీంతో వెంకట్‌ బాధగా జాబ్‌ నాకు చాలా ఇంపార్టెంట్‌ సార్‌ అంటూ రిక్వెస్ట్ చేయగానే.. అన్ని మూసుకుని వెళ్లిపో అంటూ మేనేజర్‌ వార్నింగ్‌ ఇచ్చి పంపిచేస్తాడు.

Advertisement

రాజు భోజనం చేయడానికి కూర్చుని ఇందును కోపంగా చూస్తుంటాడు. ఆ రాక్షసి దగ్గర నన్ను ఇరికించేశావు కదూ చెప్తా నీ కథ అని మనసులో అనుకుంటాడు. ఇందు కూడా గుర్రుగా చూస్తూ.. మూసుకుని తిను అని మనసులో అనుకుంటుంది. ఇక చికెన్ చూసిన రాజు ఆశగా చికెన్‌ మొత్తం లాగేయాలని ఆదుర్దాగా భోజనం చేస్తుంటాడు. స్వరాజ్‌ కూడా పెరుగోలకి చికెన్‌ తినడం అపర్ణ గుర్తు చేసుకుని అలాగే చూస్తుంటుంది. రాజు ఎందుకు నాన్నమ్మ నన్ను అలా చూస్తున్నావు అని అడగ్గానే.. నీ పోలికలే కాదు అలవాట్లు కూడా అచ్చం నా కొడుకు స్వరాజ్‌ లాగే ఉన్నాయని అపర్ణ చెప్పగానే.. ఇందు షాక్‌ అవుతుంది.

చలపతి రాజు గురించి ఆలోచిస్తూ.. పెద్దొడు ఎప్పుడొస్తాడంటావు అని అడగ్గానే.. నాకేం తెలుసండి వాడి క్షేమం కోరుకోవడం తప్పా మనమేం చేయగలం. వాడి గురించి ఆలోచిస్తూ మీరు ఇలా అయిపోతే ఎలా అండి.. అంటూ లక్ష్మీ ఓదారుస్తుండగానే.. వెంకట్‌ ఆఫీసు నుంచి వచ్చి మూడు లక్షల రూపాయలు ఇస్తాడు. దీంతో చలపతి నీ జీతం లక్ష రూపాయలే కదరా..? మూడు లక్షలు ఇస్తున్నావేంటి..? నీకు ప్రమోషన్‌ వచ్చిందా అని అడగ్గానే.. వెంకట్‌ డల్లుగా నా ముఖానికి అదొక్కటే తక్కువ అంటూ బాధపడుతుంటే.. లక్ష్మీ ఏంట్రా ఆ ఆ మాటలు అంటుంది. చలపతి ఏమైందిరా..? ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే.. వెంకట్‌ తన ఉద్యోగం పోయిందని చెప్తాడు. వెంకట్‌ మాటలకు చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. అసలు నీ ఉద్యోగం పోవడం ఏంట్రా..? నువ్వు అన్ని పనులు ఫర్పెక్ట్‌గా చేస్తావు కదా..? అంటూ అడగ్గానే.. నేను ఆ ఉద్యోగానికి పనికిరానంట నాన్న అంటూ బాధగా లోపలికి వెళ్లిపోతాడు వెంకట్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×