E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖకు వార్నింగ్ ఇచ్చిన రాజు

Brahmamudi Serial Today Episode May 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖకు వార్నింగ్ ఇచ్చిన రాజు
Advertisement

Brahmamudi serial today Episode: ఇంటి దగ్గర కారు గురించి భ్రమరాంబ బాధపడుతుంటే అప్పుడే రాజు, ఇందు కారులో ఇంటికి వస్తారు. కారును చూసిన భ్రమరాంబ ఎదురుగా వెళ్లి నా కారు నా కారు అంటూ వెళ్లి కారును ముద్దాడుతుంది. ఇంతలో రాజు కారు దిగి ఏంటత్తయ్యా కారు కాకుండా కారు పార్ట్స్‌ వస్తాయి అనుకున్నారా..? అని అడగ్గానే.. శేషు మేము అనుకున్నామని నీకెలా తెలుసు అల్లుడు అని అడగ్గానే.. రాజు గెస్‌ చేశాను అని చెప్పగానే.. ఇంత ముందు చూసు ఉంది కాబట్టే ఎక్కడో బస్తీలో ఉండాల్సిన వాడివి ఈ కోటకు అల్లుడు అయ్యావు. ఇందుకు తోడుగా ఉన్నావు. అని చెప్పగానే..రాజు మామయ్య ఇందుకు అండగా ఉండటం నా బాధ్యత. నా పేమెంట్‌కు నేను న్యాయం చేయాలి కదా..? అనగానే..

శేషు అనుమానంగా పేమెంటా..? ఇందు వెంటనే రాజు కాలు తొక్కుతుంది. అదే కంపెనీలో ఎంప్లాయీస్‌కు ఇచ్చే పేమెంట్‌ గురించి అయినా అత్తయ్యా భయపడకు నీ కారుకు ఏమీ కాలేదు కాస్త దుమ్ము పట్టింది అంతే అనగానే.. భ్రమరాంబ కోపంగా బుద్ది ఉన్నోడు ఎవడైనా ఇంత పాస్ట్‌గా కారు నడుపుతాడా..? అనగానే.. ఓయ్‌ ఏంటత్తయ్యా బుద్ది అదీ ఇది అంటున్నావు.. అప్పుడే ఈ రాజు గాడి హ్యండ్‌ పవర్‌ మర్చిపోయావా..? అత్తయ్యా ఎంతైనా నీ కారు చాలా అదృష్టం చేసుకుంది అనగానే.. శేషు ఎందుకు అని అడుగుతాడు. రాజు ఎందుకంటే నేను డ్రైవింగ్‌ చేశాను కాబట్టి అని చెప్పగానే.. మరోసారి తన కారు మాత్రం తీసుకోవద్దని భ్రమరాంబ రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో రాజు నాకు ఏదైనా ఒక్కసారి నచ్చిందంటే వదిలే ప్రసక్తే లేదు.. ప్రతిరోజు నేను ఈ కారే తీసుకెళ్తాను. ముందు కారును శుభ్రం చేయండి అంటూ వెళ్లిపోతాడు రాజు.

Advertisement

వెంకట్‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్తుంది నందు. ఎందుకు తీసుకొచ్చావని వెంకట్‌ అడగ్గానే… చెప్తాను ఉండు.. బ్రహ్మముడి యాప్‌ నుంచి నీకోసం ముగ్గురు అమ్మాయిలను సెలెక్ట్‌ చేశాను. వారిలో నీకు నచ్చిన అమ్మాయిని చూసి ఆ అమ్మాయితోనే నువ్వు చాటింగ్‌, ఫోన్‌ లాంటివి చేసుకో ఇక నన్ను డిస్టర్బ్‌ చేయకు అంటూ నందు చెప్తుండగానే.. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు వస్తారు. ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడిన వెంకీ తనకు నచ్చలేదని వెళ్లిపోమ్మని చెప్తాడు. ఆ అమ్మాయి వెళ్లిపోయాక నందు వచ్చి తిడుతుంది. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అంటూ తిడుతుంది.

చలపతి, లక్ష్మీ కలిసి రాజుకు వీడియో కాల్‌ చేస్తారు. వీడియో రాజును సూటులో చూసి చలపతి, లక్ష్మీ ఆశ్చర్యపోతారు. ఓరేయ్‌ నువ్వేంటి నీ అవతారం ఏంటి..? నువ్వేంట్రా అంత కాస్లీ బట్టలు వేసుకున్నావు.. అని అడగ్గానే.. రాజు ఏం బాగాలేవా..? నేను మీ కొడుకులా అనిపించడం లేదా..? ఏంటి..? కోటీశ్వరుల ఇంటి బిడ్డలా అనిపిస్తున్నానా..? అనగానే.. లక్ష్మీ ఎమోషనల్ అవుతూ మనసులోనే నువ్వు నిజంగా కోటీశ్వరుల ఇంటి బిడ్డవిరా అనుకుంటుంది. చలపతి మాత్రం కోపంగా ఏంట్రా నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు. నీకు ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌ వస్తుంది. ఆ లక్కీగాడు కూడా ఏమీ తెలియదు అంటున్నాడు. ఎవరికి ఏమీ చెప్పకుండా ఏం చేస్తున్నావు అని అడగ్గానే.. రాజు బిజినెస్‌లో ఉన్నానని చెప్పాను కదా నాన్న. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. అని చెప్పగానే.. చలపతి బిజినెసా ఆ సాహు గాడితో బిజినెస్‌ క్యాన్సిల్‌ చేసుకున్నానని చెప్పావు కదరా.. అనగానే..

Advertisement

రాజు నాన్న ఇది వేరే బిజినెస్‌ చూడు నా డ్రెస్‌ నా స్టైల్‌ ఎలా ఉన్నాయో.. బిజినెస్‌ చేస్తే ఇలాగే రిచ్‌గా ఉంటాము నాన్న అంటూ చెప్తూ కాల్‌ కట్‌ చేస్తాడు. తిరిగి చూస్తూ.. వెనకాలే అపర్ణ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అపర్ణను చూసి రాజు షాక్‌ అవుతాడు. అపర్ణ మాత్రం ఏడుస్తూ.. బాబు మా కష్టాలన్నీ తీర్చడానికి ఆ దేవుడే నిన్ను ఇలా మా ఇంటికి పంపినట్టు ఉన్నాడు. ఈ రోజు నువ్వు నా మనవరాలిని ఆఫీసుకు తీసుకెళ్లాక నాకు ధైర్యం వచ్చింది. ఆస్థి కంపెనీని అన్నింటిని నువ్వు కాపాడతావన్న దైర్యం వచ్చింది. నువ్వు మా కన్నీళ్లు తుడవడానకి మా ఇంటికి వచ్చావనిపిస్తుంది బాబు. నా మనవరాలికి నువ్వు ఎప్పుడూ ఇలాగే తోడుగా ఉంటావా..? అని అడగ్గానే.. రాజు మాత్రం మనసులో ఈవిడేంటి ఇంతలా ప్రేమ కురిపిస్తుంది. ప్రేమ తాళ్లతో కట్టిపడేస్తుంది. వామ్మో మనం వీటికి లొంగిపోకూడదు. మనకు డబ్బులే ముఖ్యం అనుకుంటుంటే.. అపర్ణ మాత్రం చెప్పు బాబు నా మనవరాలికి తోడుగా ఉంటావా..? అని అడగ్గానే.. రాజు ఉంటాను అమ్మమ్మ మీరేం కంగారు పడకండి మీ మనవరాలికి జీవితాంతం తోడుగా ఉంటాను. నా చివరి శ్వాస వరకు తోడుగా ఉంటాను.. అని చెప్పగానే.. అపర్ణ ఏడుస్తూనే.. రాజును కృతజ్ఞతగా చూస్తుంది.

రెస్టారెంట్‌లో ఉన్న వెంకట్‌ దగ్గరకు రెండో అమ్మాయి వస్తుంది. వెంకట్‌, ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత ఆ అమ్మాయిని కూడా వెంకట్‌ నచ్చలేదని చెప్పి పంపిచేస్తాడు. మరోవైపు ఇంట్లోకి వెళ్లిన రాజు కోపంగా హాల్లో ఉన్న సామాన్లు అన్ని పగులగొడుతూ అందరినీ పిలుస్తాడు. అందరూ రాగానే ఇందు ఏమైందని అడుగుతుంది. దీంతో రాజు అసలు నేను ఎవరిని అని అడుగుతాడు. భ్రమరాంబ ఈ ఇంటి అల్లుడివి అంటుంది. రేఖ ఏమైంది రాజు అని అడగుతుంది. దీంతో రాజు ఇంటి అల్లుడిని అయితే మర్యాదలు ఏవీ..? అంటూ అరుస్తాడు. భూషణ్‌ కోపంగా అయితే మరి ఇంకేం కావాలి అని అడగ్గానే.. ఈ ఇంటి అల్లుడిని అయిన నేను ముష్టి ఈ స్టోర్‌ రూంలో ఉండాలా..? అంటూ ప్రశ్నిస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×