E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అచ్చం కావ్య, స్వరాజ్ లా రెడీ అయినా రాజు, ఇందు 

Brahmamudi Serial Today Episode May 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అచ్చం కావ్య, స్వరాజ్ లా రెడీ అయినా రాజు, ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్య ఇవ్వాల్సిన డబ్బుల కోసం రాకేష్‌ ఇంటి దాకా వస్తాడు. గేటు దగ్గర నిలబడి ఐశ్వర్యతో గొడవ పడుతుంటాడు. అప్పుడే బయటకు వచ్చిన ఇందు వాళ్లను చూసి దగ్గరకు వెళ్లి విషయం కనుక్కుంటుంది. ఐశ్వర్య కోపంగా ఇందును రాకేష్‌ను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇందు మాత్రం రాకేష్‌ను ఎలాగైనా డబ్బులు వచ్చేలా చేస్తానని మాటిస్తుంది. దీంతో రాకేష్‌ వెళ్లిపోతాడు. తర్వాత రూంలో కూర్చున్న ఇందు రేఖ, మాటలు, రాకేష్‌ మాటలు గుర్తు చేసుకుని డబ్బుల గురించి ఆలోచిస్తుంది. అప్పుడే అపర్ణ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. కంపెనీ బాధ్యతలు చేపట్టమని మోటివేట్‌ చేసిన విషయం గుర్తు చేసుకుని ఏడుస్తూ.. వెళ్లి అల్మరాలో ఉన్న స్వరాజ్‌, కావ్య బట్టలు తీసుకుని హగ్‌ చేసుకుని ఎమోషనల్ అవుతుంది.

మరుసటి రోజు ఉదయమే స్వరాజ్‌ సూట్‌ తీసుకుని వెళ్లి రాజ్‌ను నిద్ర లేపుతుంది. నిద్ర లేచిన రాజు ఏంటిది పొద్దుపొద్దుగాల సూటు పట్టుకుని వచ్చావు..? అని అడగ్గానే.. ఇది మా నాన్నది. ఇప్పుడు నవ్వు ఇది వేసుకోవాలి అని చెప్పగానే.. రాజు.. అనుమానంగా ఎందుకు మా నాన్న సూటు వేసుకున్నానని మరో రెండు వేలు కట్‌ చేయడానికా..? అనగానే.. ఇందు హలో నువ్వేమైనా బలవంతంగా వేసుకుంటున్నావా..? నేనే కదా ఇస్తున్నాను. నేను ఇచ్చి నేను కట్‌ చేస్తానా..? రాజు ఈ సూట్‌కు ఒక హిస్టరీ ఉంది. ఒక రెస్పెక్ట్‌ ఉంది. మా నాన్న ఈ సూట్‌ వేసుకుని ప్రాజెక్టు మీద సైన్‌ చేస్తే అలా సైన్‌ చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్‌ అయిందట అని చెప్పగానే.. రాజు కూడా మనసులో సూట్‌ చూస్తే టెంప్టింగ్‌ గా ఉంది. మనసు ఆగడం లేదు. అయినా దీని దగ్గర తొందర పడకూడదు అనుకుంటూ.. సరే సరేలే మీ ఫ్యామిలీ హిస్టరీ చాలానే ఉంది కానీ మీ నాన్నంటే ఆఫీసుకు వెళ్లేవాడు. బిజినెస్‌ మీటింగ్స్‌ అన్ని అలవాటు కానీ ఈ సూటు వేసుకుని ఉంటాడు. మరి నేను ఏం చేస్తున్నానని వేసుకోవాలి అని చెప్పగానే..

Advertisement

ఇందు నువ్వు ఈ సూటు వేసుకుని నాతో పాటు ఆఫీసుకు రావాలి అని చెప్పగానే.. రాజు షాకింగ్‌ గా అలా అనకు రాజు మా రేఖ ఆంటీ కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మా కంపెనీస్‌ రోజు రోజుకు డౌన్‌ ఫాల్‌ అవుతున్నాయి. నువ్వు కూడా చూశావు కదా మా ఆంటీ ఇప్పటి వరకు ఎంప్లాయీస్‌కు శాలరీ కూడా ఇవ్వలేదు. శాలరీ టైంకు రాకపోతే మధ్య తరగతి వాళ్లు ఎన్ని కష్టాలు పడతారో నాకన్న నీకే బాగా తెలుసు కదా..? అందుకే నేను ఇప్పుడు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలనుకున్నాను. అందుకే నువ్వు ఈ సూటు వేసుకుని ఆఫీసుకు వచ్చి నాతో పాటు నాకు సపోర్టుగా ఉండు అంటూ ఇందు తన మాటలతో రాజును కన్వీన్స్‌ చేస్తుంది. దీంతో రాజు నువ్వు కండీషన్స్‌ పేరుతో నా పేమెంట్‌ కట్‌ చేయనని చెప్తేనే సూటు వేసుకుంటాను అని చెప్పగానే.. ఇందు అంత లేదు కండీషన్స్‌ కండీషన్సే.. మూసుకుని రెడీ అయి రా..? అంటూ సూటు వేసుకునిరా అంటూ సూటు ఇచ్చి వెళ్లిపోతుంది. రాజు కోపంగా డబ్బులు అవసరం లేకపోతేనా దీని తాట తీసేదాన్ని ఏ మాటకు ఆ మాట అబ్బ ఈ సూటు చాలా బాగుంది. అనుకుంటూ వెళ్లిపోతాడు.

స్వాతి వెళ్లి మదన్‌ను ఆటపట్టిస్తుంటే.. భ్రమరాంబ, శేషు చూస్తారు. అబ్బా ఇద్దరూ ఎలా ఉన్నారు..? వాడే నా కూతురుకు భర్త ఈ ఇంటికి యువరాజు అని శేషుతో చెప్తుంటే.. అప్పుడే రాజు, స్వరాజ్‌ సూటు వేసుకుని కిందకు వస్తుంటాడు. అప్పుడే ఇందు, కావ్య శారీ కట్టుకుని రాజుతో కలిసి వస్తుంది. వాళ్లను చూసిన శేషు ఈ ఇంటికి అసలైన వారసుడు అదిగో అక్కడ వస్తున్నాడు.. చూడు అనగానే.. భ్రమరాంబ వాళ్లిద్దరిని చూసి షాక్‌ అవుతుంది. అపర్ణ, సుభాష్‌ చూసి ఆశ్చర్యపోతారు. భ్రమరాంబ ఏంటీ ఈ కొత్త అవతారం అని అడగ్గానే.. రాజు ఇదే వర్జినల్ అవతారం అని చెప్తాడు. అయినా మీరు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు రేఖ చూసుకుంటుంది కదా..? అనగానే.. రాజు కోపంగా అత్తయ్య నాకు చిరాకు వస్తుంది. చిరాకు వస్తే కోపం వస్తుంది. అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. భ్రమరాంబ, శేషు షాక్‌ అవుతారు. ఇక రాజు, ఇందు ఇద్దరూ కలిసి అపర్ణ, సుభాష్‌తో ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×