E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నిజం చెప్పిన నందు

Brahmamudi Serial Today Episode May 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నిజం చెప్పిన నందు
Advertisement

Brahmamudi serial today Episode: చలపతి ఇంటికి వెళ్లిన అపర్ణ ఏడుస్తూ.. రాజు గురించి చెప్తుంది. శ్రీశైలం వెళ్తుంటే యాక్సిడెంట్‌ జరిగిన విషయం చెప్పి మీ అబ్బాయి రాజును చూడగానే.. వాడు నా మనవడిలాగే అనిపించింది. అందుకే నేను ఇప్పుడు తన గురించి తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను.. చెప్పండి రాజు మీ కన్న కొడుకు కాదు కదా..? తనను మీరు పెంచుకుంటున్నారు కదా..? అందరిని పోగొట్టుకున్నాను. అసలు జీవితంలో కన్నీళ్లు తప్పా మాకు ఏమీ మిగలలేదు. రాజును చూడగానే.. వాడు మా మనవడే అయ్యుంటాడు అని ఆశ కలిగింది. తను మీ ఇంటి బిడ్డ కాదు కదా..? దుగ్గిరాల వారసుడు అయ్యుంటాడు కదా..? దయచేసి నిజం చెప్పండి.. అంటూ ఏడుస్తుంటే..

లక్ష్మీ అమ్మా మీ లాంటి గొప్ప వాళ్లు మా లాంటి వాళ్ల ఇంటి ముందు ఇలా చేయకూడదు అనగానే.. అపర్ణ ఏడుస్తూనే.. సరే అయితే ఆ రాజు నా మనవడే అని చెప్పండి.. వాడు మీ బిడ్డ కాదు అని చెప్పండి అంటూ ప్రాధేయపడుతుది. చలపతి నిజం చెప్పబోయి శృతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆగిపోతాడు. అపర్ణ ఏడుస్తూనే.. రాజు నా మనవడే కదా చెప్పండి అని అడగ్గానే.. లేదమ్మా తను మా  కొడుకు మా ఇంటి వారసుడు అని చెప్పగానే.. అపర్ణ షాక్‌ అవుతుంది. మరైతే అచ్చుగుద్దినట్టు నా కొడుకులాగే ఉన్నాడు ఎందుకు అని అంటూ ప్రశ్నించగానే.. చూడమ్మా మనిషిని పోలిని మనిషి  ఉంటాడన్న విషయం మీకు తెలియదా..? ఇక మీరు బయలుదేరొచ్చు అంటూ చలపతి చెప్పగానే అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న శృతి, అపర్ణను కలుస్తుంది. మీరేంటి మేడం ఇక్కడ అంటూ అపర్ణను అడుగుతూనే మేడంకు రాజు సార్‌ బతికి ఉన్న విషయం చెప్పాలా వద్దా అని మనసులో అనుకుంటుంది. చిన్న పని మీద వచ్చాను.. మీ ఫ్యామిలీ అతా బాగున్నారా అమ్మా..? ఇప్పుడు ఎక్కడ వర్క్‌ చేస్తున్నావు అని అడగ్గానే.. అంతా బాగున్నారు మేడం మన కంపెనీలోనే వర్క్‌ చేస్తున్నాను మేడం అంటూ చెప్పగానే… అవునా ఆఫీసులో ఏ ఇబ్బంది లేదు కదా..? టైంకు వర్కంతా ఫినిష్‌ అవుతుంది కదా అంటూ అడుగుతుంటే శృతి మౌనంగా ఉండిపోతుంది. దీంతో అపర్ణ ఏమైదమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ అడగ్గానే.. శృతి బాధగా కంపెనీలో ఏ వర్క్‌ సరిగ్గా చూసుకోవడం లేదని.. ఎంప్లాయిస్‌కూ ఈ నెల శాలరీ కూడా ఇవ్వలేదని చెప్తుంది. ఎంప్లాయీస్‌కు రావాల్సిన శాలరీ 20 లక్షలు తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంది రేఖ మేడం అంటూ చెప్పగానే.. అపర్ణ రేఖను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శృతి, అపర్ణకు నిజం చెప్పనందుకు బాధపడుతుంది.

పొద్దున్నే నిద్రపోతున్న రాజుకు నందు వీడియో కాల్ చేస్తుంది. రాజు లిఫ్ట్‌ చేసి ఇల్లు చూపిస్తూ.. తాను ఇందును పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. దీంతో నందు షాక్‌ అవుతుంది. తాను నమ్మనని చెప్తుంది. దీంతో వీడియో కాల్‌ లో రాజు ఇల్లు చూపిస్తాడు.. ఇది మీ అక్క ఇల్లే కదా ఇప్పటికైనా నమ్ము అంటూ కాల్ కట్‌ చేస్తాడు.  జైలు నుంచి విడుదల అయిన ఆంటోని కోసం లక్కీ కారేసుకుని వెళ్తాడు. కారులో వెళ్లిన లక్కీని చూసి ఆంటోని షాక్‌ అవుతాడు. ఈ కారెక్కడిదిరా అని అడగ్గానే.. ఫ్రెండ్‌ను అడిగి తీసుకొచ్చాను అని చెప్పగానే.. కారు సరే నాకు నాలుక పీకేస్తుందిరా..? నాకోసం బీరు బిర్యాని తీసుకొచ్చావా..? అని అడగ్గానే.. అది మర్చిపోతానా..? తీసుకొచ్చాను అంటూ లక్కీ కారులోంచి బీరు బిర్యానీ తీసి ఆంటోనికి ఇస్తాడు. అవి తీసుకున్న ఆంటోని ఓరేయ్‌ లక్కీ నాకు తెలుసురా నువ్వు తీసుకొస్తావని.. నేనంటే నీకు ఎంత అభిమానంరా..? అనగానే.. లక్కీ మనసులో తిట్టుకుంటూ.. అభిమానమా..? తొక్కా నీ నుంచి మా అమ్మ గురించి తెలుసుకోవాలని చేస్తున్నాను.. అంటూ ఓరేయ్‌ ఆంటోని ఇంకా ఎన్నాళ్లనీ.. అంటూ అంటుండగానే.. ఓరేయ్‌ ఆగు.. ఇదిగో ఈ రెండు తింటూ తాగుతూ మాట్లాడుకుందామా..? అదిగో అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం దా అంటూ ఇద్దరు కలిసి పక్కకు వెళ్తారు.

Advertisement

మరోవైపు నందు, ఇందు దగ్గరకు వెళ్లి ఆ రాజు ఏదేదో వాగుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటున్నాడేంటి..? నీ మెడలో ఆ తాళి ఏంటి..? నువ్వు వాణ్ని పెళ్లి చేసుకున్న మాట నిజమేనా..? అని అడగ్గానే.. ఇందు నిజమే..అనగానే.. నందు షాక్‌ అవుతుంది. నేను నమ్మను నువ్వు ఏదో డ్రామా ఆడుతున్నావు.. నాకు ఇంకా నమ్మబుద్ది కావడం లేదు. అక్కా నువ్వు ఏదో మాయలో పడి ఏ పరిస్థితుల్లో చేసుకున్నావో ఏంటో.. వాడు ఎంత ఫ్రాడో తెలుసా..? అంతెందుకు డబ్బుల కోసం నిన్నే  కిడ్నాప్‌ చేశాడు కదా..? ఈ పెళ్లి నాకు ఇష్ట లేదక్కా తెలిసిన తెలిసి నీ జీవితం నాశనం అయిపోతుంటే నేను చూడలేను.. ముందు నీ మెడలో ఆ తాళి తీసేయ్‌..

నాకు చాలా ఆసహ్యంగా ఉంది. నేను నీకో మంచి సంబంధం చూస్తాను.. బాగా చదువుకున్నోడిని.. నీ స్థాయికి తగ్గుట్టు చూస్తాను.. ముందు మెడలో ఆ తాళి తీసేయ్‌ అక్కా ఏ పరిస్థితుల్లో.. ఏ కారణం చేత చేసుకున్నావు చెప్పు అంటూ నందు నిలదీస్తుంటే.. ఇందు కోపంగా ఏయ్‌ ఏ హక్కుతో అడుగుతున్నావు.. ఏదో సొంత చెల్లిలా మాట్లాడుతున్నావేంటి..? అంటూ కోపంగా తిట్టగానే.. నందు అవును సొంత చెల్లిని కాబట్టే అడుగుతున్నాను.. నేను నీ నందుకు అక్కా అంటూ నిజం చెప్పగానే.. ఇందు ఎమోషనల్ అవుతూ.. నందును హగ్‌ చేసుకుని ఏడుస్తుంది. నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఎంత వెతికానో తెలుసా..? ప్రతి పండగకు నీకోసం ఎదురుచూసేదాన్ని అంటూ ఎమోషనల్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×