E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చేత రాజుకు విడాకులు ఇప్పించాలనుకున్న రేఖ 

Brahmamudi Serial Today Episode May 12th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చేత రాజుకు విడాకులు ఇప్పించాలనుకున్న రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode: రూంలోకి వెళ్లిన తర్వాత నేను పెట్టిన కండీషన్స్‌కు అని ఒప్పుకుని ఈ ఓవరాక్షన్‌ ఏంటి  అంటూ ఇందు కోప్పడుతుంటే.. ఏదో ఒక కథ చెప్పాను.. కానీ ఆ ఫీలింగే వేరు అంటాడు. దీంతో ఇందు నీ పేమెంట్‌లో రెండు వేలు కట్‌ అని చెప్పగానే.. రాజు ఏయ్‌ నా యాక్టింగ్‌తో అందరూ మనం నిజంగానే పెళ్లి చేసుకున్నామని నమ్మేశారు కదా..? ఇప్పుడు పేమెంట్‌ ఎందుకు కట్‌ చేస్తున్నావు అని అడగ్గానే..

అందరినీ నమ్మించడం కోసం నా క్యారెక్టర్‌ బ్యాడ్‌ చేస్తావా..? అంటూ ఇందు తిడుతుంది. దీంతో రాజు సారీ ఈ పాయింటే తట్టలేదు నాకు అంటాడు. దీంతో ఇందు అదంతా నాకు తెలియదు నీ పేమెంట్‌లో రెండు వేలు కట్‌ చేస్తున్నాను అనగానే.. అసలే నువ్వు గీకి గీకి పది వేలు ఇస్తానన్నావు.. ఇప్పుడు అందులో రెండు వేలు కట్‌ చేస్తే.. ఇంక నాకేం మిగులుతుంది అంటాడు. దీంతో అది నువ్వు ముందు ఆలోచించుకోవాలి అంటుంది ఇందు. దీంతో రాజు, ఇందును రిక్వెస్ట్ చేస్తాడు. అయినా ఇందు ఒప్పుకోదు.. చూడు ఇదేం నువ్వు కిడ్నాప్ చేసిన ప్లేస్‌ కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి అనగానే.. రాజు అక్కడ కూడా నీకు ఇష్టం వచ్చినట్టే ఉన్నావు కదా.. అంటాడు రాజు. దీంతో రాజును ఇందు తిడుతుంది. ఎక్కువ మాట్లాడితే ఇంకో రెండు వేలు కట్‌ చేస్తాను అంటుంది. దీంతో రాజు షాక్‌ అవుతాడు.

Advertisement

తర్వాత రాజును రూంలోకి తీసుకెళ్లిన ఐశ్వర్య ఓరేయ్‌ నా డబ్బేదిరా..? మొదటి కిడ్నాప్‌ డ్రామా ఆడావు.. తర్వాత నా ఇరవై లక్షలు కొట్టేశావు ఇప్పుడు ఈ ఆస్థి కొట్టేయడానికి వచ్చావా..? అందుకే ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నావా..?  అంటూ నిలదీయగానే.. రాజు డ్రామా ఏంటి డ్రామా..? మేము నిజంగానే పెళ్లి చేసుకున్నాము అంటాడు రాజు. దీంతో ఐశ్వర్య కోపంగా నీ గురించి నాకు తెలియదా..? నువ్వు డబ్బులకు తప్పు ఏ ఎమోషన్‌కు వ్యాల్యూ ఇవ్వవు. అలాంటిది ప్రేమ అంటూ దాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నేను ఎలా నమ్ముతానురా..?  ఒకవేళ   నీకు ఈ ఆస్తి మీద కన్నుంది అంటే మా రేఖ ఆంటీ నిన్ను బతకనివ్వదు.. ఇరవై అయిదేళ్లుగా ఈ ఆస్థి కోసం తను కాచుకు కూర్చుంది అని చెప్పగానే.. రాజు హలో ఈ గొడవల వల్ల ఉపయోగం ఏమీ లేదు.. వారం రోజుల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అని చెప్పినా ఐశ్వర్య వినకుండా నాకు ఇప్పుడే కావాలి అంటూ పట్టుపడుతుంది. దీంతో రాజు ఇప్పుడే కావాలంటే ఎలా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పగానే.. కచ్చితంగా నీ దగ్గర డబ్బులు ఉండే ఉంటాయి. నాకు ఇప్పుడే డబ్బులు కావాలి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది ఐశ్వర్య.

దీంతో రాజు కోపంగా నువ్విలా ప్రెసర్‌ పెడితే బాగోదు చెప్తున్నా అనగానే.. ఐశ్వర్య కోపంగా ఏం చేస్తావురా..? చెప్పు ఏం చేస్తావు.. అంటూ అడగ్గానే.. ఏముంది ఈ విషయాలు మొత్తం మీ రేఖ ఆంటీ దగ్గరకు తీసుకెళ్తాను. ఎలాగూ కిడ్నాప్‌ చేసింది నేనే అని అందిరికీ తెలుసు. ఇప్పుడు నీకు నాకు లెక్కల్లో తేడా వచ్చింది అని చెబితే తను ఏం సాల్వ్‌ చేస్తుందో అదే ఫాలో అవుదాం అంటూ చెప్పగానే.. ఐశ్వర్య భయంగా అలా అయితే ఈ కిడ్నాప్‌ చేయించింది నేనే అని తెలుస్తుంది కదా..? అనగానే.. తెలుస్తుంది. అక్షరం పొల్లుపోకుండా చెప్తాను. నువ్వే ఇందును కిడ్నాప్‌ చేయమన్నావని ఇరవై లక్షలకు ఒప్పుకోమన్నావని మొత్తం చెప్తాను అని రాజు బెదిరించగానే.. ఐశ్వర్య కోపంగా ఏంటి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావా..? అనగానే.. అవును కాకపోతే నీ డబ్బులు నీకు ఇవ్వాలనుకుంటున్నాను.. కొద్దిగా టైం ఇస్తే.. లేదంటే మీ రేఖ ఆంటీకి అంతా చెప్పేస్తాను అంటూ రాజు చెప్పి వెళ్లిపోతాడు. ఐశ్వర్య మాత్రం తాను ఇలా ఇరుక్కుపోయానేంటి అని బాధపడుతుంది.

Advertisement

తర్వాత హాల్లో కూర్చున్న రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఇందును పిలుస్తారు. వాళ్ల దగ్గరకు వచ్చిన ఇందు బాధపడుతున్నట్టు నటిస్తూ.. నా జీవితం నాశనం చేసినందుకే వాణ్ని పెళ్లి చేసుకున్నానని ఏడుస్తూ చెప్తుంది. భ్రమరాంబ మాత్రం ఏంటి ఇది ఎప్పుడు ఇలా చేయలేదు అనుకుంటుంది. ఇంతలో రేఖ సరే నీకు ఈ పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది అంటావు..? అనగానే.. అవును ఆంటీ  అంటుంది ఇందు. అయితే వాడికి విడాకులు ఇవ్వడానికి నువ్వు సిద్దంగా ఉన్నావా..? అని అడగ్గానే..

జరిగిందే ఇష్టం లేని పెళ్లి.. ఇక మీరు ఎప్పుడు విడాకులు ఇవ్వమంటే ఇస్తాను అని చెప్పగానే.. రేఖ నమ్మోచ్చా..?అంటుంది. ఆంటీ మీరు హండ్రెడ్‌ పర్సెంట్‌ నమ్మొచ్చు అని చెప్పగానే.. అయితే సరే నువ్వు వెళ్లు అంటుంది రేఖ. ఇందు వెళ్లిపోతుంది. చూశావా… వదిన ఇష్టం లేని పెళ్లి చేసుకునే సరికి మన వైపు తిరిగింది. ఇక వెంటనే ఇందుకు విడాకులు ఇప్పించి మదన్‌తో పెళ్లి చేస్తాను అని చెప్పగానే.. అదే జరిగితే నా కొంప మునిగినట్టే అని భ్రమరాంబ మనసులో అనుకుంటూ ఎవరికైనా విడాకులు రావాలంటే సంవత్సరం పడుతుంది కదా రేఖ అని చెప్తుంది. దీంతో రేఖ ఆలోచనలో పడిపోతుంది.

లక్కీ, రాజుకు ఫోన్‌ చేస్తే స్విచ్చాప్‌ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా స్విచ్చాప్ ఉండటంతో లక్కీ కోపంగా రాజును తిట్టుకుంటాడు. మరోవైపు చలపతి కూడా రాజుకు ఫోన్‌ చేస్తాడు. రాజు ఫోన్‌ కలవదు. దీంతో చలపతి, లక్కీకి ఫోన్‌ చేద్దామనుకునే లోపే లక్కీ, చలపతికి ఫోన్‌ చేసి రాజు గురించి అడగ్గానే.. చలపతి లక్కీని తిడతాడు. వాడు నీ దగ్గరే ఉండి ఇలా ఫోన్‌ చేయిస్తున్నాడు కదా అంటాడు. దీంతో లక్కీ తన దగ్గర లేడని వాడు ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×