// // Brahmamudi Serial Today May 10th: - ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి నిజం చెప్పిన అపర్ణ – రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన కావ్య -->
E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి నిజం చెప్పిన అపర్ణ – రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన కావ్య

Brahmamudi Serial Today May 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి నిజం చెప్పిన అపర్ణ – రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:  ఐసీయూలో ఉన్న రాజ్‌ దగ్గరకు యామిని వెళ్తుంది. యామిని రావడం చూసిన రాజ్‌ కళావతి వచ్చిందా అని అడుగుతాడు. దీంతో యామిని షాక్‌ అవుతుంది. నీ కోసం పరితపించేది నేను.. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు అంటుంది. దీంతో రాజ్‌ నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు.. కళావతి గారు వచ్చారా..? అని అడుగుతాడు. దీంతో యామిని ఎందుకు వస్తుంది బావ.. తనకు నాకు నీ మీద ఉన్న ప్రేమ కానీ బాధ్యత కానీ ఉంటుందా..? అక్కడ నువ్వు కళ్లు తిరిగి పడిపోయేసరికి ఎవరితోనో హాస్పిటల్‌కు పంపించి అక్కడే ఉండిపోయింది. అని యామిని చెప్పగానే.. ఏంటి..? కళావతి గారు హాస్పిటల్‌కు రాలేదా..? అంటాడు.

మరోవైపు బయటి నుంచి చూస్తున్న కావ్య ఏడుస్తుంది. కళ్యాణ్‌ బాధపడుతూ చూశావా వదిన యామిని నీ గురించి అంత చెడుగా చెప్పినా కూడా కళ్లు తెరవగానే అన్నయ్య నీ గురించి అడిగారు. నువ్వెందుకు ఇంకా కంగారు పడుతున్నావు అని అడగ్గానే.. లేదు కవి గారు నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను పాపిస్టి దాన్ని నా నీడ కూడా ఆయన మీద పడటానికి వీల్లేదు నేను మాట్లాడినా ఏం చేసినా ఆయన గతాన్ని గుర్తు చేసినట్టే అవుతుంది. నా నీడ కూడా ఆయన మీద పడటానికి వీల్లేదు. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య.

Advertisement

ఇంట్లో అందరూ కావ్య కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఇంద్రాదేవి ఏంటి కావ్య రాత్రికి అక్కడే ఉంటానందా..? అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్యా కాసెపట్లో వచ్చేస్తున్నామని ఫోన్‌ చేసి చెప్పారు. మళ్లీ ఫోన్‌ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తుంది. ఇంతలో అక్కడి వచ్చిన రుద్రాణి ఎలా వస్తాడు. గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే మళ్లీ కోమాలోకి వెళ్లాడు కదా రాజ్‌ అంటుంది. దీంతో రాహుల్ అసలు ఇప్పుడు నీ ప్లానేంటి మమ్మీ అని అడుగుతాడు. దీంతో రుద్రాణి ఫ్రెండ్స్‌ పార్టీకి అని చెప్పి ఇంట్లో అందరికీ అబద్దం చెప్పి వెళ్లి ఆ రాజ్ తో డాన్స్‌ చేసింది కదా రామ్‌ అంటూ అది ఆడుతున్న నాటకాన్ని దానితోనే ఎలా ముగిస్తానో చూడు అంటుంది.

ఇంతలో కావ్య, అప్పు, కళ్యాణ్‌ ఇంటికి వస్తారు. రుద్రాణి వచ్చి  ఆగు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావు..ఏం చేసి వచ్చావు.. అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా ఏంటా ఆడగడం పార్టీకి వెళ్తున్నాను అని నా మనవరాలు చెప్పింది కదా..? అంటుంది. దీంతో రుద్రాణి కోపంగా ఈ దుగ్గిరాల ఇంటి కోడలు అంటే ఒక పరువు ఉంది. ఒక మర్యాద ఉంది. నువ్వు అది ఇవాళ దిగజార్చావు అంటుంది. దీంతో అపర్ణ కోసంగా రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు.. అంటుంది. దీంతో రుద్రాణి మరింత కోపంగా నా మీద అరవడం కాదు వదిన పార్టీకి అని చెప్పి రిసార్ట్స్‌ లో పరాయి మగాడితో గంతులేసి వచ్చింది. నేను చెప్తుంది నిజమో కాదో మీ ముద్దుల కోడలిని అడగండి.. ఏం ధాన్యలక్ష్మీ ఏదో రహస్యం మాట్లాడుతున్నట్టు మెల్లగా మాట్లాడుతున్నావు.. కావ్య చేసింది ఏమైనా చిన్న పనా అలా పరాయి మగాడితో తిరుగుతుంటే మన ఇంటి పరువు ఏమౌతుందో అడగండి.. చనిపోయిన మొగుడు ఎలాగూ తిరిగి రాడనుకుని ఇలా చెడు తిరుగుళ్లు తిరుగుతుంది. ఏం వదినా ఏం మాట్లాడవేంటి.. వెళ్లి కాస్త గడ్డి పెట్టు.. అంటూ రుద్రాణి చెప్పగానే..

Advertisement

అపర్ణ కోసంగా గడ్డి పెట్టాల్సింది నా కోడలికి కాదు.. నీకు.. ఇంతకంటే ఇక దిగజారవు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుతున్నావు.. అంటుంది. తప్పు చేసింది నీ కోడలైతే నన్ను తిడుతున్నావేంటి..? అంటుంది రుద్రాణి.. ఇంత పెద్ద న్యూస్‌ చెబితే ఆ కావ్యను తిడతారు అనుకుంటే మమ్మల్ని తిడుతున్నారేంటి..? ఇదెక్కడి ట్విస్ట్‌ అని మనసులో అనుకుంటాడు రాహుల్‌. అపర్ణ కోపంగా నా కోడలి గురించి ఏమనుకుంటున్నావు.. ప్రాణం పోయినా తన మనసులో వేరొకరికి స్థానం ఇవ్వదు.. ప్రాణం ఉన్నంత వరకు నా కొడుకే ప్రాణంగా బతుకుతుంది అని చెప్పగానే.. పిచ్చి వదిన నన్ను నీ అమాయకత్వాన్ని చూస్తుంటే.. జాలేస్తుంది. ఆ కావ్య నిన్ను మాత్రమే కాదు మన కుటుంబాన్ని మోసం చేస్తుంది. రామ్‌ అనే కుర్రాడితో తిరుగుతుంది. కావాలంటే తననే అడుగు అని చెప్తుంది రుద్రాణి. దీంతో అపర్ణ ఎవర్నీ అడగాల్సిన అవసరం నాకు లేదు. అన్ని నిజాలు నాకు తెలుసు.. రామ్‌ వేరు రాజ్‌ వేరు కాదు వాళ్లిద్దరూ ఒక్కటే అన్న విషయం కూడా నాకు తెలుసు.. నాకే కాదు ఈ ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి నిజం తెలుసు.. ఒక్క నీకు నీ కొడుకుకి తప్పా అని చెప్పగానే.. రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు.

ఇన్ని రోజులు మేము వేసిన ప్లాన్‌లో వీళ్లందరూ పాత్రధారులు అనుకున్నాం.. కానీ వీళ్లు ఆడుతున్న నాటకంలో మేము జోకర్లం అయ్యామా..?అని రాహుల్‌  మనసులో అనుకుంటాడు. రుద్రాణి కోపంగా అంటే రాజ్‌ బతికే ఉన్నాడన్న విషయం మీ అందరికీ తెలుసా.. అని అడుగుతుంది. తెలుసు అని ఇంద్రాదేవి చెప్తుంది. తను గతం మర్చిపోయాడన్న విషయం తెలుసా..?అని అడగ్గానే తెలుసని సుభాష్‌ చెప్తాడు. దీంతో రుద్రాణి షాకింగ్‌ గా చూస్తుంది. దీంతో ఇంద్రాదేవి ఏంటి అలా చేస్తున్నావు.. గట్టిగా మాట్లాడితే ఆ రిసార్ట్‌ ప్లాన్‌ చేసింది మేమే.. కావ్యను ఒప్పించి అక్కడకు పంపించిదే మేము అని చెప్తుంది. రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. ఇంతలో సుభాష్‌ కోపంగా నిజం తెలిసిపోయింది కదా అని పిచ్చి పిచ్చిగా మట్లాడకు అంటాడు.   దీంతో నేను కామ్‌గా ఉంటే సరిపోతుందా..? మీ కోడలు చేసిన పనికి రాజ్‌ మళ్లీ హాస్పిటల్‌ లో పడ్డాడు అంటుంది. దీంతో కావ్య అందరికీ నిజం చెప్తుంది.

రాజ్‌ను ఇంటికి తీసుకెళ్లాక కావ్య గురించి ఆలోచిస్తుంటాడు. యామిని వాళ్ల అమ్మా నాన్న వెళ్లి రాజ్‌తో మాట్లాడతారు. పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేయమని అడుగుతాడు. యామిని ఓకే అంటుంది. తర్వాత ఏం చేయబోతున్నావు అని యామిని వాళ్ల అమ్మా నాన్న అడిగితే నేను బావ రూట్లోనే వెళ్లి బావ ద్వారానే పెళ్లి చేసుకుందాం అనేలా చేస్తానంటుంది. తర్వాత రాజ్‌ కావ్యకు ఫోన్‌ చేస్తుంటాడు. కావ్య లిఫ్ట్‌ చేయదు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×