E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తమ్ముడిని తిట్టిన రాజు 

Brahmamudi Serial Today march 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తమ్ముడిని తిట్టిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: 

ఇంట్లో నాన్నతో చీవాట్లు తిన్న రాజు ఆఫీసుకు వెళ్తున్న తమ్ముడిని అడ్డుకుంటాడు. నీ జీవితాన్ని ఉద్యోగానికి తాకట్టు పెట్టేశావని నవ్వుతాడు.. అమ్మా నీ చిన్న కొడుకు ఉద్యోగం చేస్తూ తినడానికి కూడా టైం లేనంతగా కష్టపడుతున్నాడు అని చెప్తాడు. నాకు మాత్రం ఆ కర్మ పట్టలేదంటాడు. అయితే ఉద్యోగం చేయడం బాధ్యతని తమ్ముడు చెప్పగానే.. అబ్బో నువ్వు చేస్తున్నావులే పెద్ద బోడి ఉద్యోగం అంటుంటే.. లక్ష్మీ రాజుకు టిఫిన్‌ పెడుతుంది. రాజు దోశలు తింటుంటే.. వాళ్ల ఫ్రెండ్‌ కూడా దోశలు నాకు అంటూ వస్తాడు.

Advertisement

ఇద్దరిని చూసిన వాళ్ల నాన్న తిడతాడు. నువ్వు బిజినెస్‌ చేయడానికి డబ్బులు ఎవరిస్తారు..? నాకైతే నువ్వు బిజినెస్‌ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అయితే   రాజు మాత్రం  నీలాగా మిడిల్ క్లాస్ జీవితం నేను బతకలేనని చెప్పగానే.. అయితే నీ ఇష్టం ఏమైనా చేసుకో కానీ నేను మాత్రం మీకు ఎలాంటి సాయం చేయలేనని చెప్తాడు వాళ్ల నాన్న. రాజు కోపంగా తినడం ఆపేసి బయటకు వెళ్లిపోతాడు. లక్ష్మీ వాళ్ల ఆయన మీద కోప్పడుతుంది. పిల్లలను ప్రశాంతంగా కూడా తిననివ్వరా అంటుంది. తిన్నప్పుడు చెబితేనే బుర్రకు ఎక్కుతుంది అయన చెప్తాడు.

ఇక ఇంట్లో పనులన్నీ చేసి రేఖకు టిఫిన్‌ పెడుతుంది ఇందు. ఎగ్జామ్‌కు టైం అవుతుంది. ఈ రేఖ ఆంటీ త్వరగ వెళ్లిపోతే నేను వెళ్లేదాన్ని కదా అనుకుంటుంది. రేఖ మాత్రం కోపంగా భూషణ్‌ను తిడుతుంది. మనం తీసుకున్న అప్పు వెంటనే కట్టమని ఆ చక్రీ గొడవ చేస్తున్నాడని భూషణ్‌కు చెప్తుంది. అయితే భూషణ్ మాత్రం కూల్‌గా ఈ రోజు నేను ఆఫీసుకు రావడం లేదు.. నాకు వేరే ఇంపార్టెంట్‌ వర్క్‌ ఉంది అని చెప్పగానే.. రేఖ మంరింత కోపంగా నీ ఇంపార్టెంట్ వర్క్ ఏంటో నాకు బాగా తెలుసు.. క్లబ్‌లో గేమ్స్ ఆడటమే కదా నీ ఇంపార్టెంట్‌ పని.. ఆ చక్రీ దగ్గర ఆఫీస్ కోసం చేసిన అప్పులో నువ్వే క్లబ్‌లో ఆడటం కోసం చేసిన అప్పే సగం ఉందని కోప్పడుతుంది.

Advertisement

అప్పుడే ఇందు పెసరట్టు పెడితే ఏయ్‌ ఇదెందుకు పెడుతున్నావు.. నాకు బ్రెడ్‌ ఆమ్లెట్‌ పెట్టాలని తెలియదా అంటూ ఇందూను తిడుతుంది. ఇందు బ్రెడ్‌ ఆమ్లెట్‌ కోసం కిచెన్‌లోకి వెళ్లగానే.. రేఖ భూషణ్‌ ను తిడుతుంది. ఈ ఆస్తిని సొంతం చేసుకునే విషయంలో నాకు హెల్ప్ చేస్తావని నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను.. కానీ నువ్వేమో అప్పులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు ఆ చక్రీ గాడికేమో నువ్వు మాట్లాడితేనే నచ్చుతుందట అని తిడుతుంది. ఇంతలో అక్కడికి ఇందు వచ్చి ఐశ్వర్య ఇంకా పడుకునే ఉంది. తనకు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయమంటారు అని అడుగుతుంది. రేఖ ఏమీ మాట్లాడకుండా ఐశ్వర్య రూంలోకి వెళ్తుంది.

రేఖ వెళ్లిపోవడంతో హమ్మయ్య ఇక భ్రమరాంభ పిన్ని నుంచి ఎలా తప్పించుకుని ఎగ్జామ్‌ వెళ్లాలో అని ఆలోచిస్తుంది ఇందు. రేఖ రావడం గమనించిన  ఐశ్వర్య చదువుకుంటున్నట్టు నటిస్తుంది. అయితే రేఖ వచ్చి బుక్‌ ఇలా చదవరు.. ఐశ్వర్య ఇలా చదువుతారు.. అంటూ బుక్‌ తిప్పి ఇస్తుంది. నైట్ పార్టీ అయ్యే వరకు ఎంత టైం అయ్యిందని రేఖ అడగ్గా.. మార్నింగ్ 3 గంటలు అయ్యిందని చెబుతుంది ఐశ్వర్య. నువ్వు బాగా చదివే దానివి అయితే 10 బ్యాక్‌లాగ్స్ ఎందుకు పెడతావు. ఎప్పుడో ఫినిష్ చేయాల్సిన ఇంజనీరింగ్‌ని మళ్లీ మళ్లీ ఎందుకు చదువుతావు.. నీకు మా రాహుల్ అన్నయ్య బుద్ధులే వచ్చాయని.. తిడుతూ.. త్వరగా రెడీ అవ్వు నిన్ను ఎగ్జామ్ హాల్ లో దించేస్తానని చెప్తుంది. ఐశ్వర్య సరే అంటుంది.

రాజు ఒక డమ్మీ లాప్‌ టాప్‌ను ఎక్కువ రేటుకు అమ్మాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకోసం ఆ లాప్‌టాప్‌ను నీట్‌గా కొత్తదానిలా రెడీ చేయమని తన ఫ్రెండ్‌కు చెప్తాడు. తన ప్రెండ్ లాప్‌టాప్‌ను కొత్తదానిలా రెడీ చేసి తీసుకుని వస్తాడు. అప్పుడే రాజుకు లాప్‌టాప్‌ కొంటానన్న వ్యక్తి ఫోన్‌ చేస్తాడు. ఆయన్ని ఒక హోటల్‌ దగ్గరకు రమ్మని రాజు చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×