E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న ఇందు 

Brahmamudi Serial Today march 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode:   

స్వాతి చదువుకుంటూ ఉంటే ఇందు కాఫీ చేసుకుని వెళ్తుంది. టేబుల్‌ దగ్గర కూర్చుని అలాగే నిద్రపోతుంటుంది స్వాతి. ఇందు గుడ్‌మార్నింగ్‌ సిస్టర్‌ నీకు కాఫీ రెడీ అంటుంది. దీంతో స్వాతి నువ్వే తాగు అని చెప్తుంది. దీంతో ఇందు ఎందుకంత కోపం లేట్‌ అయిందా అంటూ అడగ్గానే.. ఒక రౌండ్‌ నిద్ర కూడా అయింది అని స్వాతి చెప్పగానే.. అంటే సిలబస్‌ కంప్లీట్‌ అవ్వలేదా..? అంటూ చెవి మెలేస్తుంది. దీంతో స్వాతి అక్కా ఆగు.. సిలబస్‌ కంప్లీట్‌ చేయాల్సింది నువ్వు ఈరోజు నీకు ఎగ్జామ్ ఉందన్న విషయం గుర్తుందా..? అని అడగ్గానే.. గుర్తుంది.. ఎప్పుడో చదివేశాను.. ఇప్పుడు రివిజన్‌ చేసుకుంటున్నాను అని ఇయర్‌బర్డ్ చూపిస్తుంది. దీంతో ఆశ్చర్యంగా స్వాతి ఇయర్‌బర్డ్‌ తో రివిజనా..? అది ఎలా అని అడుగుతుంది. సింపుల్‌ రాత్రి చదువుతూ రికార్డు చేసుకున్నా ఇప్పుడు అదే వింటున్నాను అని చెప్పగానే.. స్వాతి ఇంట్లో వాళ్లు నిన్ను వాడేసుకుంటుంటే.. నువ్వు టెక్నాలజీని వాడేసుకుంటున్నావు అన్నమాట అంటుంది.

దీంతో ఇందు హలో స్వాతి వాళ్లు నన్ను బిజీగా ఉంచొచ్చు.. కానీ నా బ్రెయిన్‌ను కాదు.. అని చెప్పగానే.. అవును అక్కా నువ్వు ఇంత సీక్రెట్‌గా డిగ్రీ వరకు వచ్చేశావని రేఖ ఆంటీకి తెలిస్తే..? అని అడగ్గానే.. తెలిస్తే నీ వల్లే తెలియాలి అని ఇందు అనగానే.. అయితే నేను విలన్ అన్నమాట.. అంటుంది. దీంతో ఇందు కాదు నువ్వే నా సేప్టీ లాకర్‌ వి అంటుంది. అయితే నీ రహస్యాలన్నీ నా లాకర్‌లో దాచేసుకో అని చెప్తుంది స్వాతి. అయితే జాగ్రత్త మరి ఆ దొంగలకు ముందు కనిపించేది ఈ సేప్టీ లాకరే.. అని ఇందు అనగనే.. అమ్మో అయితే వద్దులే అక్కా కొన్ని రహస్యాలు చాలులే.. అంటుంది స్వాతి.

Advertisement

ఇంతలో బయటి నుంచి భ్రమరాంభ ఓసేయ్‌ ఇందు జ్యూస్‌ అని పిలుస్తుంది. ఇందు భయంగా వస్తున్నాను పిన్ని అంటూ వెళ్లబోతుంటే.. స్వాతి ఆపేస్తుంది. అక్కా అక్కా  ఈ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేసి చెప్పక్కా అని అడుగుతుంది. దీంతో ఇందు మీ అమ్మ పిలిచిన వెంటనే వెళ్లాలి అని భయంగా చెప్పగానే.. వెళ్లకపోతే ఏంటంట అని స్వాతి అడగ్గానే.. మొదట పిలుస్తుంది. ఆలస్యం అయితే అరుస్తుంది. అప్పుటికీ వెళ్లకపోతే ఎందుకు పుట్టానా అనిపించేలా చేస్తుంది అని చెప్తుండగానే.. బయటి నుంచి భ్రమరాంభ ఒసేయ్‌ ఇందు అంటూ కేకలు వేస్తుంది. ఇందు భయంగా అదిగో విన్నావు కదా … అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి.. జ్యూస్‌ చేసి తీసుకెళ్లి ఇస్తుంది.

మరోవైపు అపర్ణ, సుభాష్‌కు మర్ధన చేస్తుంటుంది. అప్పుడే ఇందు కాఫీ, సూప్‌ తీసుకెళ్లి సుబ్బుకు సూప్‌ రెడీ.. ఇదిగే అపర్ణాదేవి నీకు కాఫీ తెచ్చాను తీసుకో అంటూ ఇవ్వగానే.. అపర్ణ కాఫీ తీసుకుంటూ అయిపోయిందా..? అందరికీ చాకిరి చేయడం.. అని అడగ్గానే.. అప్పుడేనా..? ఇంకా ఐశ్వర్యను నిద్ర లేపాలి. రేఖ ఆంటీకి కాఫీ పంపించాలి. అందరికి టిఫిన్‌ చేయాలి అని చెప్పగానే.. అపర్ణ బాధగా ఈ రోజు ఆ పనులు నేను చేస్తానంటే ఒప్పుకోకుండా నువ్వే చేసుకుంటున్నావు.. అసలు నీకు ఈరోజు ఎగ్జామ్‌ ఉందన్న విషయం గుర్తుందా..? అని చెప్పగానే.. ఆ సంగతి నేను చూసుకుంటానులే అపర్ణాదేవి.. సుబ్బు వేడి వేడిగా సూప్‌ తెచ్చాను అవతల నాకు చాలా పనులు ఉన్నాయి.. అంటూ సూప్‌ తాగిస్తుంది. సుభాష్‌ బాధగా చదువుకుంటున్నానని గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని ఇలా దొంగతనంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఈ తాతయ్య నీకు ఏ సహాయం చేయలేకపోతున్నాడు.. నన్ను క్షమించు అమ్మ అంటాడు.

Advertisement

దీంతో ఇందు ఇప్పుడు అంతగా నేను ఏం బాధపడుతున్నాను చెప్పు  అంటుంది. దీంతో అపర్ణ నీ ఇంట్లోనే నువ్వు బాధపడుతున్నావు అది నీకు బాధగా లేదా కలిగించడం లేదా..? అని చెప్పగానే.. ఇందు నవ్వుతూ.. అపర్ణాదేవి మా అమ్మా నాన్నలు నన్ను ప్రాణాలకు తెగించి కాపాడింది ఇలా ఏడుస్తూ కూర్చోవడానికి కాదు.. జీవితంలో గెలవడానికి ఏదో ఒకరోజు మా అమ్మ ఆశలను మా నాన్న ఆశయాలను నిలబెడతాను. అవసరం అయితే దానికోసం ఈ ప్రపంచంతోనే యుద్దం చేస్తాను. ఆ రేఖ ఎలాంటిది అయినా తను ఏం చేసినా ఎదిరించడానికి నేను సిద్దంగా ఉన్నాను.. కాలంలో కరిగిపోయిన ఆ బంధాన్ని నేను తీసుకురాకపోవచ్చు.. కానీ దూరం అయిన సంతోషాన్ని తీసుకొస్తాను. కోల్పోయిన మన స్వేచ్చను.. దూరం అయిన దుగ్గిరాల ఇంటి పేరును తిరిగి సంపాదిస్తాను. అజ్ఞాతవాసంతో పాండవులు అడవిపాలు కావొచ్చు.. విరాట కొలువులో అవమానం జరిగి ఉండొచ్చు.. కానీ వీటన్నింటిని తిరిగి ఇవ్వడానికి ఆ రోజు నా కృష్ణయ్యే కురుక్షేత్రాన్ని నడిపించినట్లుగా త్వరలోనే నా చేత ఈ యుద్దాన్ని కూడా నడిపిస్తాడు.. అని చెప్పగానే.. అపర్ణ ఆశ్చర్యంగా నిన్ను చూస్తుంటే.. మీ అమ్మ లాగే ఉన్నావు.. అది కూడా ఇలాగే కష్టం వస్తే బాధపడటం కాదు ఎదురించి నిలబడాలి పోరాడాలి అంటూ చెప్పేది అంటూ అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది… తర్వాత ఇందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

మరోవైపు రాజు ధనలక్ష్మీ వెంటపడినట్టు కలకంటాడు.. ఇంతలో వాళ్ల నాన్న వచ్చి మంచం మీద నుంచి తన్నేస్తాడు. మంచం మీద నుంచి కింద పడిపోయిన రాజుకు మంచినీళ్లు పట్టుకురమ్మని చెప్తాడు.. వాటర్‌ ట్యాంకర్‌ దగ్గర చాలా మంది ఆడోళ్లు ఉంటే ట్రిక్‌ ఉపయోగించి వాటర్‌ పట్టుకుని వెళ్తాడు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×