E-Paper
Advertisement

బ్రహ్మముడి మార్చి 30: రాజు గురించి ఎంక్వైరీ చేసిన రేఖ

బ్రహ్మముడి మార్చి 30: రాజు గురించి ఎంక్వైరీ చేసిన రేఖ
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ రూంలో కూర్చుని మందు తాగుతూ రాజు గురించి ఆలోచిస్తుంది. ఇంతలో భ్రమరాంబ వెళ్లి అసలు ఏమైంది రేఖ నీకు ఆ అబ్బాయి ఎవరో ఇంటికి వచ్చి ఐశ్వర్యకు నెక్లెస్‌ ఇచ్చి వెళ్లిన దగ్గర నుంచి నువ్వు చాలా కంగారు పడుతున్నావు.. నేను గమనిస్తూనే ఉన్నాను.. ఇన్నేళ్లలో నువ్విలా భయపడటం నేను ఎప్పుడూ చూడలేదు రేఖ అసలు ఏం జరిగింది. ఆ అబ్బాయికి నీకు ఏంటి సంబంధం అని భ్రమరాంబ అడగ్గానే.. రేఖ కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు అనుకున్నవాడు కళ్ల ముందు వచ్చి నిలబడితే భయపడకపోతే ఎలా ఉంటాను వదిన అని రేఖ చెప్పగానే.. భ్రమరాంబ షాక్‌ అవుతుంది.

మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు కదా కానీ అచ్చుగుద్దినట్టు ఉన్నాడా..? అని అడగ్గానే.. అవును కానీ రాజ్‌  మేనల్లుడు స్వరాజ్‌ ఉండేవాడు అని చెప్పగానే.. భ్రమరాంబ వాడు మాత్రం ఎలా తిరిగి వస్తాడు.. ఆ బాంబు బ్లాస్ట్‌లో వాడు చచ్చాడు కదా అనగానే.. ఒకవేళ చనిపోకుండా ఉంటే రాజ్‌కు మేనల్లుడు అంటే ఈ ఇంటికి మరో వారసుడు.. వాళ్లకు నిజం తెలిస్తే ఇందుకు తోడుగా ఈ ఇంట్లోకి అడుగుపెడతాడు. అప్పుడు మనం పోరాడాల్సింది ఒక్కరితో కాదు ఇద్దరితో అని చెప్పగానే.. భ్రమరాంబ భయపడుతుంది.

Advertisement

మరోవైపు నిద్ర పోతున్న రాజ్‌ కు కలలో బాంబు బ్లాస్ట్‌ గుర్తుకు వచ్చి ఉలిక్కి పడి అమ్మా అంటూ  లేస్తాడు.  పక్కనే ఉన్న లక్ష్మీ ఆమె భర్త రాజ్‌ను అసలు పట్టించుకోరు. దీంతో రాజు నేను ఇంతలా భయపడుతుంటే మీరు పట్టించుకోరేంటి అని రాజు అడగ్గానే.. వాళ్ల నాన్న నీకు ఇది ఎప్పుడూ ఉండేదే కదా..? అయినా నీకొచ్చే ప్రతి ఫాంటసీ కలను మేము పట్టించుకోవాలా… అంటూ వెటకారంగా మాట్లాడతాడు. తర్వాత రాజు వెళ్లిపోయాక వాళ్ల నాన్న అమ్మ లక్ష్మీ రాజు గురించి ఆలోచిస్తారు.

తర్వాత రేఖ కారులో రాజు ఉంటున్న ఇంటి ముందుకు వెళ్లి రాజును గమనిస్తుంటుంది. రాజు బయటకు వచ్చి బైకును తుడుస్తూ.. వాళ్ల నాన్నను తిడుతుంటాడు. ఇంతలో బయటకు వాళ్ల నాన్న అమ్మ వచ్చి రాజుతో గొడవ పడుతుంటారు. రేఖ అంతా గమనిస్తూ.. తనను రాజు ఇంటికి తీసుకొచ్చిన మనిషిని నువ్వు నా మనిషివి అని అనుమానం రాకుండా వాళ్లకు ఆ రాజు గాడికి ఉన్న సంబంధం ఏంటి..? రాజు వాళ్లకు పుట్టిన కొడుకేనా..? అసలు వాళ్లు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు.. ఫోన్‌ ఆన్‌ చేసి ఉంచుకో వాళ్లు మాట్లాడే ప్రతి మాట నేను వినాలి అంటూ చెప్పగానే.. సరే మేడం అంటూ వెళ్తాడు.

Advertisement

రాజు వాళ్ల దగ్గరకు వెళ్లిన ఆ వ్యక్తి తను ధర్మయ్య అని జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానని చెప్పి వాళ్ల డీటెయిల్స్‌ అడుగుతాడు. దీంతో రాజు వాళ్ల నాన్న తన పేరు చలపతి అని గుమాస్తాగా చేస్తున్నానని చెప్తాడు. తర్వాత లక్ష్మీ తన గురించి చెప్తుంది. అప్పుడే ధర్మయ్య రాజును మరి ఈ అబ్బాయి ఎవరు సార్‌ అని అడగ్గానే.. చలపతి కోపంగా  ఆ ఎక్కడో దొరికితే అద్దెకు తెచ్చుకున్నాం.. అయినా నీదేం ప్రశ్న అయ్యా ఎదురు ఇంటి వాణ్ని.. పక్కింటి వాణ్ని తెచ్చి నా కొంపలో ఎందుకు పెట్టుకుంటాను వాడు నా కన్నకొడుకు ఇదిగో నా కష్టార్జితం అంటూ చెప్పగానే.. ఇందాకా అప్పులు అన్నావు అంటాడు రాజు. ఇంతలో రేఖ చలపతి నాన్న గురించి అడుగు అని చెప్పగానే.. అలాగే అడుగుతాడు. తర్వాత వాళ్ల తాత గురించి అడగమని చెప్తే అడగ్గానే.. చలపతి కోపంగా బతికున్న మా గురించి కాకుండా ఎవరెవరి గురించో అడుగుతున్నావేంటి..? అంటూ తిట్టి పంపిస్తారు. రేఖ కూడా ఈ రాజు గాడికి ఆ దుగ్గిరాల కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అనుకుని వెళ్లిపోతుంది.

మరోవైపు రాకేష్‌, ఐశ్వర్యకు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తుంటే.. తనకు టైం ఇవ్వమని అడుగుతుంది. ఇంతలో ఐశ్వర్య రూంలోకి వచ్చిన ఇందు అంతా వింటుంది. ఇందును చూసిన ఐశ్వర్య షాక్‌ అవుతుంది. ఇందును తిడుతుంది. నా మీద ఎందుకు దొంగతనం వేశావు అంటూ నిలదీస్తుంది. ఐశ్వర్యతో గొడవపడి వెళ్లిపోతుంది. మరోవైపు వెంకీ తన లవర్‌ను కలవడానికి నందుతో కలసి వెళ్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×