E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్య నెక్లెస్ అమ్మబోయిన రాజు, లక్కీ 

Brahmamudi Serial Today march 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్య నెక్లెస్ అమ్మబోయిన రాజు, లక్కీ 
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ కారులోంచి దిగిపోయిన ఐశ్వర్య తాను ఇంట్లో కొట్టేసిన నెక్లెస్‌ను కారులోనే మర్చిపోతుంది. అది చూసిన లక్కీ హ్యాపీగా ఫీలవుతూ.. రాజుకు చెప్తాడు. రాజు కూడా ఆ నెక్లెస్‌ చూసి నవ్వుతూ రేయ్‌ ఇన్నాళ్లకు ఆ దేవుడికి మన మీద దయ కలిగింది అనుకుంటా..? నన్ను బిలియనీర్‌ను చేసే ముందు ప్యాకెట్‌ మనీ ఇదా..? అందుకే దీన్ని మన కంట్లో పడేలా చేశాడు అనగానే.. లక్కీ రేయ్‌ మరీ ఎక్కువగా ఆశలు పెంచుకోకు.. ఇది నా గొల్డెన్‌ గర్ల్‌ ఐశ్వర్యది అనుకుంటా.? పాపం తను కారులో పడేసుకున్నట్టు ఉంది తిరిగి ఇచ్చేద్దాం.. పైగా ఇంత కాస్లీ నెక్లెస్‌ తిరిగి ఇస్తే నాలో ఉన్న నిజాయనీ పరుడిని చూసి పక్కా ఇంప్రెస్‌ అయిపోతుంది అని లక్కీ చెప్పగానే..

రాజు అవునా నీకు అలా అనిపిస్తుందా..? సరే ఇవ్వొచ్చు కానీ దానికంటే ముందు నాకో క్లారిటీ ఇవ్వు.. ఇప్పుడు నీ దగ్గర రెండు ఆప్షన్స్‌ ఉన్నాయిరా…? ఇప్పుడు ఈ నెక్లెస్‌ తీసుకెళ్లి తనకు ఇచ్చి తన కోసం బ్లడే కాదు బంగారం కూడా ఇచ్చేస్తానని తనను ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేయడం వల్ల ఆ ఐషు ఇంప్రెస్‌ అవ్వచ్చు అవ్వకపోవచ్చు.. అప్పుడు నీతో పాటు నేను కూడా నష్టపోతాను కదా అని రాజు చెప్పగానే.. లక్కీ ఆ రెండో ఆప్షన్‌ ఏంటి..? అని అడగ్గానే.. ఇదే నెక్లెస్‌ తీసుకెళ్లి ఏ నగల షాపు వాడితో అమ్మేస్తే బాగా డబ్బు వస్తుంది. ఇక్కడ ఇద్దరం బాగుపడతాం..

Advertisement

ఆ తర్వాత ఐశ్వర్యకు ఒక మంచి గిఫ్ట్‌ కొనిస్తే.. కుక్కని చూస్తున్నట్టు చూస్తున్న ఆ అమ్మాయి నీకు పడినా పడుతుందిరా..? మంచితనానికి పడని అమ్మాయిలు గిప్టులు ఇస్తే పడిపోతారట. అది సైంటిఫిక్‌ గా ఫ్రూవ్‌ అయిందిరా లక్కీ.. ఇప్పుడు చెప్పరా దొరికిన నగను తిరిగి ఇచ్చేద్దామా..? అనగానే లక్కీ కోపంగా మామ నీక అసలు మనసే లేదురా..? అంటే ఏంట్రా నీ ఉద్దేశం ఫ్రెండును కదా ఏం చెప్పినా తల ఆడిస్తాను అనుకుంటావా..? నేను ఇష్టపడే అమ్మాయి నెక్లెస్‌ పడేసుకుంటే అసలు జాలి దయ లేకుండా అమ్మేసి ఆ డబ్బుతో ఎంజాయ్‌ చేసేద్దాం అంటావా..? అనగానే.. రాజు అవునురా నేను అలాగే అన్నాను.. అనగానే.. కరెక్టుగా చెప్పావు మామ పద అమ్మేసుకుందాం.. అంటాడు లక్కీ.. దీంతో రాజు షాక్‌ అవుతాడు. ఇద్దరూ కలిసి నెక్లెస్ అమ్మడానికి వెళ్తారు.

మరోవైపు తన గదిలో నెక్లెస్‌ పోయిందని చూసిన రేఖ కిందకు అరుస్తూ వస్తుంది. కిందకు వెళ్లి అందరినీ పిలిచి తన రూంలో ఎవరో నెక్లెస్‌ దొంగతనం చేశారు అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. మనం అందరం ఇంట్లోనే ఉండగా ఎవరో వచ్చి ఎందుకు దొంగతనం చేస్తారు. తప్పకుండా ఇది ఇంట్లోనే ఎవరో చేసి ఉంటారు అంటాడు భూషణ్‌. భ్రమరాంబ మాత్రం ఫస్ట్‌ టైం ఒక దొంగగా ఇంకో దొంగ ఫర్మామెన్స్‌ చూడబోతున్నాను చూద్దాం ఎలా యాక్టింగ్‌ చేస్తుందో అని మనసులో అనుకుంటుంది.

Advertisement

ఇంతలో శేషు.. గట్టిగా బావ ఎవరో ఎవరో అనకుండా ఎవరు చేశారో పేరు చెప్పు.. పాపం మీ అక్కను చూడు ఎంత కంగారు పడుతుందో అంటాడు. దీంతో భ్రమరాంబ కోపంగా ఓయ్‌ శేషు నాకెందుక కంగారు అనగానే.. శేషు మెల్లగా అలాంటి చేతివాటం అలవాటు ఒకప్పుడు నీకు ఉండేది కదా..? అనగానే భ్రమరాంబ మన నగల్ని మనమే దొంగతనం చేసుకుంటామా..? అంటుంది. భ్రమరాంబ, ఐశ్వర్య కలిసి ఇందు మీదకు దొంగతనం మోపేస్తారు. దీంతో స్వాతి కోపంగా మీ ముందే బయటకు వెళ్లింది ఇందు అని చెప్పగానే.. దొంగతనం చేయాలనుకున్నవాళ్లు ఎలాగైనా చేస్తారు అంటుంది రేఖ.

మరోవైపు నెక్లెస్‌ అమ్మబోయిన రాజు, లక్కీలను నందుకు పట్టిస్తుంది ఇందు. దీంతో రాజు, లక్కీ అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతారు. ఇంతలో స్వాతి, ఇందుకు ఫోన్‌ చేసి ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దీంతో ఇందు షాక్‌ అవుతుంది. బయట ఉన్న నేను ఇంట్లో దొంగతనం ఎలా చేస్తాను అంటూ ప్రశ్నించగానే.. ఎవ్వరూ నమ్మడం లేదు.. అందరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టు ఉన్నారు జాగ్రత్త అక్కా అంటూ చెప్తుంది. మరోవైపు భ్రమరాంబ దాచిన నెక్లెస్‌ బీరువాలో చూస్తుంటే.. శేషు వెళ్లి చూస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×