E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నరకం చూపించిన రేఖ  

Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నరకం చూపించిన రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode: సుభాష్‌ గిలా గిలా కొట్టుకుంటుంటే హాల్లో ఉన్న రేఖ మీరు హాస్పిటల్‌కు తీసుకెళ్లేలోపు అసుల ఉంటాడో ఊడతాడో గ్యారంటీ లేదు.. అని చెప్పగానే.. అపర్ణ కోపంగా గట్టిగా రేఖ అంటుంది. దీంతో రేఖ అరవకు ఆంటీ అరవకు ఇలా అరిచే ఇక్కడిదాకా  తెచ్చుకున్నావు.. ఈ పొగరు వల్లే ఈరోజు నీ మొగుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. నన్ను ఎదురించాలన్న ఈ ధైర్యమే వాడికి ఈరోజు మృత్యువుగా మారింది అంటూ నవ్వుతూ కూర్చుంటే.. అపర్ణ కోపంగా ఏంటి బెదిరిస్తున్నావా..? అంటుంది. దీంతో ఇందు ఏడుస్తూ.. నాన్నమ్మ నీకు దండం పెడతాను.. అవతల తాతయ్య ప్రాణం ప్రమాదంలో ఉంది.. నువ్వు సైలెంట్‌గా ఉండు.. ఆంటీ మా నాన్నమ్మ మాట్లాడింది తప్పే ఆంటీ కావాలంటే నేను క్షమాపణ చెప్తాను.. ముందు మా తాతయ్యకు ఇవ్వాల్సిన యాంటీ డోస్‌ ఏంటో చెప్పండి ఆంటీ అని అడగ్గానే..

రేఖ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఇందు.. అది నా దగ్గరే ఉంది కానీ నేను ఇవ్వాలనుకోవడం లేదు.. అని చెప్పగానే.. ఇందు ఏడుస్తూ.. ఆంటీ మీరేం చెప్పినా చేస్తాను దయచేసి ఆ ఇంజక్షన్‌ ఇవ్వండి ఆంటీ ఫ్లీజ్‌ ఆంటీ మా తాతయ్య ప్రాణాలను కాపాడండి ఆంటీ.. అంటూ ఏడుస్తుంటే.. రేఖ నువ్వు ఇలా అడుక్కుంటుంటే.. నాకు కొంచెం జాలిగా ఉంది. అప్కోర్స్‌ ఇవ్వాలని కూడా ఉంది.. సరే ఈ ఒక్కసారికి ఇచ్చేస్తాను.. నా బెడ్‌ రూంలో ఉంది తెచ్చుకో అని చెప్పగానే.. ఇందు సరే ఆంటీ తెచ్చుకుంటాను.. అంటూ పరుగెట్టుకుంటూ రేఖ బెడ్‌ రూంలోకి వెళ్లి అంతా వెతుకుతుంది. ఎక్కడా దొరక్కపోయే సరికి మళ్లీ కిందకు వస్తుది ఇందు.. ఆంటీ అక్కడ ఇంజక్షన్‌ లేదు ఆంటీ అని చెప్తుంది. దీంతో రేఖ అయ్యో కన్పీజ్‌ అయిపోయాను ఇందు.. ఆ ఇంజక్షన్‌ మీ తాతయ్య బెడ్‌ రూంలోనే ఉంది వెళ్లి తెచ్చుకో అని చెప్పగానే.. ఇందు సుభాష్ రూంలోకి వెళ్లి ఇంజక్షన్‌ వెతుకుతుంది..

Advertisement

ఎక్కడా దొరకలేదని మళ్లీ హాల్లోకి పరుగెత్తుకుంటూ వెళ్తుంది.. అంటీ అక్కడ లేదు ఆంటీ అని చెప్పగానే.. రేఖ అబ్బ చ ఇందాక కంగారులో చెప్పాను ఇందు.. ఇప్పుడే గుర్తుకు వచ్చింది. ఇంజక్షన్  భ్రమరాంబ గదిలో ఉంది వెళ్లి తెచ్చుకో అని చెప్పగానే.. ఇందు మళ్లీ పైకి పరుగెడుతుంది. భ్రమరాంబ గదిలోకి వెళ్లి తిరిగి వచ్చి ఆంటీ అక్కడ కూడా లేదు ఆంటీ అని చెప్పగానే.. రేఖ ఆలోచిస్తున్నట్టు.. అవునా..? ఆ ఐశ్వర్య గదిలో ఉంది వెళ్లి తెచ్చుకో అని చెప్పగానే.. ఇందు పరుగెడుతూ మెట్ల దగ్గర పడిపోతుంది. దీంతో రేఖ ఏంటి అలిసిపోయావా… అవతల మీ తాతయ్య ప్రాణం ఇందు వెళ్లు వెళ్లి తెచ్చుకో అని చెప్పగానే.. ఇందు లేచి పరుగెడుతుంది ఐశ్వర్య రూంలోకి వెళ్లి మొత్తం వెతుకుతుంది. ఎక్కడా ఇంజక్షన్ కనిపించదు..

దీంతో కిందకు వచ్చి ఆంటీ అక్కడ కూడా లేదు.. ఫ్లీజ్‌ ఆంటీ ఎక్కడ ఉందో చెప్పండి అని అడగ్గానే.. రేఖ అక్కడ కూడా లేదా..? సారీ ఇందు ఇంజక్షన్‌ స్వాతి రూంలో ఉంది వెళ్లి తెచ్చుకో… అని చెప్పగానే.. ఇందు స్వాతి రూంలోకి వెళ్తుంటే.. అపర్ణ కోపంగా ఇందు ఆగు.. ఆ ఇంజక్షన్‌ ఇంట్లో ఎక్కడా లేదు.. ఈ రేఖ దగ్గరే ఉంది. అని చెప్పగానే. రేఖ కూడా కరెక్టుగా గెస్‌ చేశావు ఆంటీ.. కానీ నువ్వు ఎప్పుడు ఎవరిని కలుస్తున్నావో నేను తెలుసుకోలేనా..? నువ్వు లాయరును కలవడం నాకు తెలియదు అనుకుంటున్నావా..? ఎంత ధైర్యం ఉంటే నాకు వ్యతిరేకంగా నా మీద కోర్టులో కేసు వేయాలనుకుంటావా…? నా పేరు మీద ఉన్న పవర్‌ ఆప్‌ పటార్నిని నీ మనవరాలు పేరు మీదకు మార్చేద్దాం అనుకున్నావు కదా..? అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు..

Advertisement

ఆ ముసలోడిని నేను ఎందుకు బతకనివ్వాలి ఆ ఇంజక్షన్‌ నేను ఎందుకు ఇవ్వాలి అంటూ కోప్పడుతుంది రేఖ. దీంతో అపర్ణ ఏడుస్తూ.. రేఖకు సారీ చెప్తుంది. రేఖ కాళ్ల దగ్గర కూర్చుని నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పను అంటూ ఏడుస్తుంది. దీంతో రేఖ వార్నింగ్‌ ఇచ్చి ఇంజక్షన్‌ ఇస్తుంది. ఇందు వెళ్లి ఇంజక్షన్‌ చేస్తుంది. తర్వాత అపర్ణను తిడుతుంది. అది అలా చేస్తుంటే.. చూస్తూ ఎలా ఉండగలను అంటూ అపర్ణ చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×