E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందుకు సపోర్ట్ చేసిన రేఖ

Brahmamudi Serial Today Episode June 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందుకు సపోర్ట్ చేసిన రేఖ
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చి రౌడీలను కొట్టి నారాయణ, ఇందును తీసుకెళ్లబోతుంటే.. ఐశ్వర్య అడ్డుపడుతుంది. దీంతో రౌడీలు కూడా ఐశ్వర్యను తప్పుకోమ్మని నారాయణ దెబ్బలకు తామే తట్టుకోలేకపోతున్నామని చెప్పడంతో ఐశ్వర్య టైం చూసుకుని ఇప్పుడు వెళ్లినా సీఈవో ఎంపిక అయిపోయి ఉంటుంది. ఇక ఏం లాభం లేదు అనుకుని కామ్‌గా ఉంటుంది. నారాయణ వెంటనే ఇందు కట్లు విప్పి రౌడీల బైక్‌ మీద చాలా స్పీడుగా ఇందును తీసుకెళ్తుంటాడు.

మరోవైపు బోర్డు మీటింగ్‌లో అందరూ ఇందు కోసం వెయిట్‌ చేస్తుంటారు. ఇక బైక్‌ మీద చాలా స్పీడుగా వెళ్తున్న నారాయణను ఇందు బాబాయ్‌ ఏంటా స్పీడు ఇంతకుముందు విమానం నడిపావా ఏంటి..? ఇంత స్పీడుగా వెళ్తున్నావు అంటూ అడగ్గానే.. విమానం నడపలేదు కాదు లారీ నడిపాను.. కానీ విమానం కంటే స్పీడుగానే నడిపేవాడిని దేశంలోని అన్ని హైవేలు నాకు తెలుసు..? అటూ నారాయణ చెప్తుంటాడు.

Advertisement

మరోవైపు బోర్డు మీటింగ్‌లో రాజు టీ తాగుతూ ఇందు గురించి ఆలోచిస్తుంటాడు. ఈ పరంధామయ్య ఏం ఆలోచిస్తున్నారో ఏంటో అని ఆలోచిస్తాడు. ఇంతలో మీటింగ్‌ హాల్లోకి పరంధామయ్య వస్తాడు. రేఖ ఇంకా లేటు చేయోద్దని.. ఇప్పటికే చాలా టైం అయిందని.. ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్తుంది. దీంతో పరంధామయ్య ఎంత ఆలోచించినా నా బుర్రకు ఒక్కటే అనిపిస్తుంది. బయటి వాళ్లకు సపోర్టు చేయలేను అని చెప్పగానే.. రేఖ ఉత్సాహంగా అంటే నాకే సపోర్టు చేస్తున్నారా..? సీఈవో నేనేగా..? అంటుంది. దీంతో రాజు హలో ఆగండి పరంధామయ్య గారు బయటి వాళ్లకు సపోర్టు చేయనని మాత్రమే అన్నారు. నీకు సపోర్టు చేస్తాను అనలేదు.. అని చెప్పగానే.. బయటి వాళ్లకు ఇవ్వను అన్నాడంటే.. నాకు ఇచ్చినట్టే కదా..? అంటూ రేఖ పరంధామయ్య గారు ఇక లేట్‌ చేయకుండా మీ సపోర్టు ఎవ్వరికో చెప్పేయండి అనగానే..

పరంధామయ్య తన అభిప్రాయం చెప్పబోతుంటే.. ఇందు వస్తుంది. ఇందును చూసి అందరూ షాక్‌ అవుతారు. రాజు ఎక్కడికి వెళ్లావు ఇందు అంటూ తన కోసమే ఎదురుచూస్తున్నామని చెప్తాడు. ఇందు అందరికీ సారీ చెప్తుంది. ఇంతలో రేఖ, ఇందును తాను చాలా బాగా పెంచి పెద్ద చేశానని ఇందును ఇంతదాకా పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్తుంది. ఇంతలో పరంధామయ్య అచ్చం కావ్యలా ఉన్న ఇందుకే తన ఓటు వేస్తానని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. రాజు మాత్రం ఇప్పుడు మొదలైంది అసలైన రాజకీయం అని మనసులో అనుకుంటాడు. ఇంతో రేఖ కూడా ఇప్పుడు ఇందుకు సపోర్టు చేయకపోతే రాజు గాడు ఇందును బెదరించి వాడు సీఈవో అయ్యే చాన్స్‌ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇందుకు సపోర్టు చేయాలి అని మనసులో అనుకుని రేఖ బయటికి ఇందుకు తాను సపోర్టు చేస్తున్నట్టు చెబుతుంది. దీంతో పరంధామయ్య ఇందును కొత్త సీఈవోగా ప్రకటిస్తాడు. అందరూ కంగ్రాట్స్‌ చెప్తారు.

Advertisement

తర్వాత ఇంటికి వెళ్తున్న టైంలో రాజు అసలు ఏం జరిగింది. ఆఫీసుకు రాకుండా ఎక్కడికి వెళ్లావు అంటూ అడగ్గానే.. ఇందు జరిగింది చెప్పకుండా ఏవేవో కథలు చెప్పి రాజును కన్వీన్స్‌ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×