E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు షాక్ ఇచ్చిన రేఖ – అడ్డుగా నిలబడిన రాజు  

Brahmamudi Serial Today Episode June 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు షాక్ ఇచ్చిన రేఖ – అడ్డుగా నిలబడిన రాజు  
Advertisement

Brahmamudi serial today Episode:  జీతాలు వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కావ్యను మెచ్చుకుంటూ.. అభినందిస్తారు. ఉద్యోగులందరూ జీతాలు రాకపోవడంతో తాము ఎంత కష్టపడింది బాధగా చెప్తారు. శృతి కూడా మిమ్మల్ని చూస్తుంటే.. రాజ్‌, కావ్య లను చూసినట్టు ఉందని చెప్తుంది. దీంతో ఇందు.. మీరు కూడా బాగా కష్టపడాలి అంటూ చెప్పి వెళ్లిపోతుంది.

రాకేష్‌ డబ్బుల కోసం ఇంట్లోకి వెళ్లి ఐశ్వర్యను ఎత్తుకెళ్తుంటాడు. డబ్బుల కోసం నన్ను ఎత్తుకెళ్తావా..? అంటూ ఐశ్వర్య కోపంగా అడ్డుపడుతుంటే.. రాకేష్‌ ఐశ్వర్యను బలవంతంగా లాక్కెళుతుంటే.. అప్పుడే ఇంట్లోకి వస్తున్న ఇందు కోపంగా రాకేష్‌ను కొడుతుంది. వదలరా చేయి వదలమంటుంటే.. వినబడటం లేదా..? అంటూ కోపంగా తిట్టగానే.. రాకేష్‌ కోపంగా నాకేం మీ ఐశ్వర్యను తీసుకెళ్లాలని ఇష్టం లేదు.. తీసుకున్న అప్పు ఎన్నిరోజులైనా కట్టకపోతే ఎలా నేనేం చేయాలి అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో రేఖ కోపంగా ఏంటి ఐశ్వర్య నీకు అప్పు ఉందా అంటుంది. రాజు మాత్రం మనసులో ఐశ్వర్య ఆ పది లక్షలు వీడికి ఇవ్వాలా..? అనుకుంటాడు. రాకేష్‌ అవునండి మీ ఐశ్వర్య నా దగ్గర అప్పుగా పది లక్షలు తీసుకుంది అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. భ్రమరాంబ ఆశ్చర్యంగా ఐషు అంత డబ్బు ఎందుకు తీసుకున్నావే అని అడుగుతుంది. నువ్వు అడిగినప్పుడల్లా మీ రేఖ ఆంటీ డబ్బులు ఇస్తుంది కదా..? అంటూ భూషణ్‌ అడిగితే పదిలక్షలా అసలు నువ్వు అప్పు చేస్తావని నేను ఊహించలేదు అంటాడు శేషు.

Advertisement

ఇక రేఖ కూడా కోపంగా ఏంటి ఐషు ఇది నిజంగానే అప్పు చేశావా..? అని అడుగుతుంది. దీంతో ఐశ్వర్య మౌనంగా ఉంటే.. శేషు ఎందుకమ్మా అలా సైలెంట్‌గా ఉన్నావు నువ్వు అప్పు తీసుకోలేదని ఒక్క మాట చెప్పు వాడి సంగతి చూస్తాము అనగానే.. ఐశ్వర్య అప్పు తీసుకున్నానని చెప్తుంది. దీంతో రేఖ కోప్పడుతుంటే.. రాకేష్‌ నా డబ్బులు నాకిస్తే.. నేను వెళ్లిపోతాను అంటాడు. దీంతో ఇందు తన దగ్గర ఉన్న కంపెనీ డబ్బుల్లోంచి తీసి రాకేష్‌ కు ఇస్తుంది. రాకేష్‌ వెళ్లిపోతాడు. ఐశ్వర్య కోపంగా బలే నటిస్తున్నావు ఇందు.. నా దగ్గర అసలు డబ్బులే ఇవ్వనన్నావు.. ఇప్పుడేమో అందరి ముందు డబ్బులు ఇచ్చి నేను చెడ్డదాన్ని, అప్పులు చేసేదాన్ని అంటూ ఫ్రూవ్‌ చేయాలనుకున్నావు కదా అంటూ తిడుతుంది.  దీంతో అపర్ణ కోపంగా ఐశ్వర్యను తిడుతుంది. నువ్వు చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి నా మనవరాలినే తిడుతున్నావా..? ఇంత గొప్ప ఇంట్లో పుట్టి అప్పులు చేయడం ఏంటి..? అంటూ తిడుతుంది.

సుభాష్‌ కూడా ఐశ్వర్యను తిడుతుంటే.. ఐశ్వర్య కోపంగా రేఖను ఏం మాట్లాడట లేదని అడగ్గానే.. ఈ పరిస్థితుల్లో తనేం మాట్లాడుతుంది. అంటూ అపర్ణ కోపంగా మాట్లాడుతుంది. దీంతో రేఖ కోపంగా ఇందును తీసుకుని రూంలోకి వెళ్తుంది. రాజు మాత్రం ఇందును లోపలికి తీసుకెళ్తుంది ఏంటి..? డబ్బులు ఏమైనా తీసుకుంటుందా..? అని మనసులో అనుకుంటూ రాజు కూడా వెనకాలే వెళ్లిపోతాడు. రూంలోకి వెళ్లిన రేఖ ఇందును కోపంగా తిడుతూ.. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.. అంటూ నిలదీయగానే.. ఇందు బాధపడుతున్నట్టు ఎంత మాటన్నారు ఆంటీ.. నేను మీ మాటకు ఎదురు చెప్తానా..? ఇప్పుడు కూడా మీరు ఏం చెబితే అది చేయడానికి రెడీగా ఉన్నాను అనగానే.. రేఖ లేదు ఇప్పుడు కూడా నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అనగానే.. రాజు మార్పు మంచిదేగా పిన్ని అంటాడు. దీంతో ఇందు తన మాటలతో రేఖను కన్వీన్స్‌ చేస్తుంది.

Advertisement

ఆఫీసులో ఎంప్లాయీస్‌కు జీతాలు ఇవ్వలేదన్న విషయం మనకు కాంట్రాక్ట్‌ ఇచ్చిన వాళ్లకు తెలిస్తే అప్పుడు వాళ్లు మన కాంట్రాక్ట్‌ రద్దు చేసుకుని వెళ్లిపోతారు. అప్పుడూ మనమే కదా లాస్‌ అయ్యేది అంటూ చెప్తూనే.. మిగిలిన ఐదు లక్షలు రేఖ చేతిలో పెట్టి ఇంటికి సంబంధించిన ఖర్చులన్నీ మీరే చూసుకోండి అంటూ వెళ్లిపోతుంటే.. రేఖ అనుమానంగా ఆగు నువ్వు కాంట్రాక్ట్‌ మీద సైన్‌ ఎలా పెట్టావు.. నీకు అసలు చదువు రాదు కదా..? అంటూ అడగ్గానే.. ఇందు, రాజు షాక్‌ అవుతారు. ఇందు మనసులో కంగారుపడుతూ.. అవేశంలో నేను సంతకం చేశాను.. ఇప్పుడు రేఖ ఆంటీకి నేనేం చెప్పాలి అనుకుంటుండగా.. రాజు కల్పించుకుని సంతకం విషయం నన్ను అడగండి.. ఎందుకంటే తనకు సంతకం పెట్టడం నేర్పించింది నేనే కదా అంటూ చెప్పగానే.. రేఖ వెళ్లిపోతుంది.

తర్వాత రూంలోకి వెళ్లిన ఇందు రిలీఫ్ అవుతూ.. రాజు కొంచెం ఉంటే నేను దొరికిపోయేదాన్ని భలే సేవ్‌ చేశావు అంటుంది. రాజు కోపంగా చూస్తూ.. నువ్వు బతికి నన్ను చంపేశావు.. వచ్చిన డబ్బంతా మీ రేఖ ఆంటీ చేతిలో పెట్టి నాకు గుండుసున్నా పెడదాం అనుకున్నావా..? అంటూ రాజు తిడుతుంటాడు. ఇందు కోపంగా చూస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×