E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల గురించి నిజం తెలుసుకున్న ఐశ్వర్య  

Brahmamudi Serial Today Episode June 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల గురించి నిజం తెలుసుకున్న ఐశ్వర్య  
Advertisement

Brahmamudi serial today Episode: వెంకట్‌ సైకిల్ మీద వెళ్లి ఫుడ్‌ డెలివరీ చేస్తుంటారు. ఇంతలో ఒక కస్టమర్‌  రెస్టారెంట్‌ ఓనరు ఫోన్ చేసి ఇంకా తనకు ఫుడ్‌  డెలివరీ ఇవ్వలేదని చెప్తాడు.  దీంతో ఓనరు వెంటనే వెంకట్‌కు ఫోన్‌ చేసి ఇంకా డెలివరీ ఇవ్వలేదంటా.. కస్టమర్‌ వెయిటింగ్‌ అక్కడ అంటూ తిడతాడు. వెంకట్‌ వెళ్తున్నాను సార్‌ ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. వెంకట్ వెళ్లి ఫుడ్‌ డెలివరీ ఇస్తుంటే.. మరోవైపు ఓనరు వీడు బైక్‌ మీదే వెళ్లాడు కదా..? మరెందుకు లేట్‌ అవుతుంది. కస్టమర్లు అందరూ ఎందుకు ఫోన్‌ చేస్తున్నారు అనుకుంటూ కస్టమర్‌ కు ఫోన్‌ చేసి ఇంకో ఐదు నిమిషాల్లో వస్తాడు సార్‌ మా బాయ్‌ అని చెప్పగానే.. వచ్చేశాడు.. డెలివరీ ఇచ్చాడు.. కానీ మరీ సైకిల్‌ మీద డెలివరీ ఇస్తున్నాడు ఇలా అయితే ఎలా రోజూ లేటుగా వస్తుందా..? ఫుడ్‌ అంటూ కస్టమర్‌ చెప్పగానే.. ఓనరు కోపంగా వెంకట్‌కు కాల్‌ చేసి సైకిల్‌ మీద డెలివరీ ఇస్తున్నావా..? నువ్వెక్కడున్నా ఐదు నిమిషాల్లో నా ముందు ఉండాలి అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. వెంకట్ సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు.

దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే.. అప్పుడే అపర్ణ ఫ్రెండ్‌ శకుంతల వస్తుంది. ఆమెను అపర్ణ పలకరించగానే.. రాజు ఆమెను భోజనం చేయమనండి అని చెప్తాడు. దీంతో అపర్ణ, శకుంతలను భోజనం చేయమని చెప్పగానే.. శకుంతల భోజనం చేయడానికి వెళ్లగానే.. రేఖ అవమానిస్తుంది. దీంతో రాజు కోపంగా వార్నింగ్‌ ఇస్తుంది. శకుంతల అలాంటి వాళ్ల మాటలు తాను పట్టించుకోనని చెప్తూ భోజనం చేస్తుంది. రాజు గురించి అడుగుతుంది. అపర్ణ నా మనవడు అంటూ చెప్పగానే.. కూతురు కొడుకా అని అడుగుతుంది శకుంతల కాదని ఇందు మొగుడు అని శేషు చెప్తాడు.  ఇంతలో రాజు, ఇందును కూడా భోజనం చేయమని.. నువ్విప్పుడు కంపెనీ సీఈవో అని చెప్పగానే.. శకుంతల ఏంటి రేఖ ఉండగానే.. ఇందు సీఈవో అయిందా..? అంటూ రేఖను వెటకారంగా తిడుతుంటే.. ఇందు అడ్డుపడి రేఖ ఆంటీని తిడితే నేను ఊరుకోను అంటుంది. శకుంతల కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత ఇందు ప్లాన్‌ ప్రకారం రేఖను బురుడీ కొట్టించి తమ కంపెనీ క్లయింట్స్‌ అందరికీ పార్టీ ఇద్దామని ఒప్పిస్తుంది.

Advertisement

రెస్టారెంట్‌కు వచ్చిన వెంకట్‌ను ఓనరు కోపంగా తిడుతుంటాడు. సైకిల్‌ మీద డెలివరీ చేస్తావా..? బైక్‌ ఉంటేనే జాబ్‌ అని చెప్పాను కదా..? బైక్‌ లేకుండా ఉందని అబద్దం చెప్తావా..? అంటూ కోప్పడుతుంటే.. వెంకట్‌ తనకు బైక్‌ ఉందని కానీ ఉదయమే ట్రబుల్‌ ఇచ్చిందని.. అందుకే సైకిట్‌ మీద వెళ్లాను అనగానే.. ఓనరు కోపంగా నువ్వు ఫస్ట్‌ డేనే అబద్దం చెప్పావు.. నేను నా బిజినెస్‌ను ఎంతో కష్టపడి బిల్డ్‌ చేసుకున్నాను.. నీలాంటి బిల్డప్‌ ఇచ్చే వాణ్ని జాబ్‌ లో పెట్టుకుని నా బిజినెస్‌ పాడు చేసుకోను అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో వెంకట్‌ బాధగా ఈ జాబ్‌ తనకు ఎంతో అవసరం అని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో ఓనరు ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను నందు ఫ్రెండ్ అని ఏమీ అనడం లేదు.. అంటూ వెళ్లమంటాడు. దీంతో థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతాడు వెంకట్‌.

కంపెనీ క్లయింట్స్‌ పార్టీకి ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోవాలని అలాగే వాళ్లలో ఈ కంపెనీకి ఫేవర్‌గా ఎవరున్నారు..? రేఖ ఆంటీ మనుషులు ఎవరో తెలుసుకోవాలని రాజుకు చెప్తుంది ఇందు. దీంతో నా టాలెంట్‌ సంగతి తెలుసు కదా..? ఆవలిస్తే పేగులు లెక్కపెడతాను.. మనకు కావాల్సిన ఇన్మఫర్మేషన్‌ మొత్తం తెలుసుకుంటాను.. అంటూ చెప్పగానే.. నువ్వు ఇలా ఓవరాక్షన్‌ చేస్తే రేఖకు కచ్చితంగా అనుమానం వస్తుందని ఇందు అనగానే.. రాజు కోప్పడుతాడు. దీతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అదంతా ఐశ్వర్య చాటుగా చూస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×