E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు షాక్ ఇచ్చిన రేఖ – దివాలా తీసే పరిస్థితిలో కంపెనీ  

Brahmamudi Serial Today Episode June 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు షాక్ ఇచ్చిన రేఖ – దివాలా తీసే పరిస్థితిలో కంపెనీ  
Advertisement

Brahmamudi serial today Episode: ఇంట్లో వాళ్లకు అబద్దం చెప్పి బయటకు వచ్చిన వెంకట్‌ భయంతో అమ్మో కాస్త అయితే దొరికిపోయేవాణ్ని అని బండి స్టార్ట్‌ చేయబోతుంటే.. బండి స్టార్ట్‌ కాదు.. దీంతో అయ్యో దొరక్క దొరక్క డెలివరీ బాయ్‌ జాబ్‌ దొరికింది. ఇప్పుడు ఇదేంటి దేవుడా..? అసలే మా బాస్‌ కోపిస్టి అంట అనుకుంటుండగానే.. వెంకట్‌కు ఆయన బాస్‌ ఫోన్‌ చేసి ఎక్కడున్నావు అయ్యా త్వరగా రా చాలా ఆర్డర్లు ఉన్నాయి అంటూ కోపంగా చెప్పగానే.. వెంకట్‌ వస్తున్నాను సార్‌ అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. ఈ బండేమో ఇప్పుడే స్టార్ట్‌ కావడం లేదు అయ్యో దేవుడా ఇప్పుడు ఏం చేయాలి..? అని ఆలోచిస్తుంటాడు.

ఇందుకు కొరియర్‌ వస్తుంది. ఓపెన్ చేసి చూస్తుంటే.. రేఖ వచ్చి ఏంటి ఇందు చదువుదామనే ఓపెన్‌ చేస్తున్నావా..? అని అడుగుతుంది. అప్పుడే వచ్చిన భ్రమరాంబ కూడా ఏమున్నాయి అందులో అని అడగ్గానే.. ఏవో పేపర్స్‌ ఉన్నాయి పిన్ని అని చెప్తుంది. అయితే ఏంటో చదువు అని భ్రమరాంబ చెప్పగానే.. శేషు ఏంటి భ్రమర నువ్వు ఇందుకు అక్షరం ముక్క కూడా రాదు ఎలా చదువుతుంది అంటూ చెప్పగానే.. అవును కదా..? అని భ్రమరాంబ అంటుంది. రాజు మాత్రం వెర్రి గొర్రెలు అక్షరం ముక్క రాకపోవడం ఏంటి..? ఇప్పుడు ఎగ్జామ్‌ పెట్టినా అక్షరం తప్పకుండా మొత్తం రాసేస్తుంది అని మనసులో అనుకుంటాడు. ఇందు పేపర్స్‌ ఇవేంటి చూసి చెప్పండి ఆంటీ  అంటూ రేఖకు ఇవ్వబోతుంటే.. రేఖ, భూషణ్‌ అవేంటో చూడు అనగానే.. భూషణ్‌ పేపర్స్‌ తీసుకుని చూసి మన కంపెనీకి రా మెటిరీయల్‌ పంపేవాడు నోటీసు పంపించాడు అని చెప్పగానే.. ఏముంది అందులో అని ఇందు అడగ్గానే.. మూడు నెలల నుంచి అమౌంట్‌ ఇవ్వలేదని రా మెటీరియల్‌ ఆపేస్తానని నోటీసు పంపించారు అంటూ భూషణ్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

Advertisement

ఇందు భయంగా రా మెటీరియల్‌ లేకపోతే మన కంపెనీ మాన్యూఫాశ్చరింగ్‌ ఆగిపోతుంది కదా ఆంటీ అంటూ అడగ్గానే.. ఆగిపోవడమే కాదు కంపెనీయే మూత పడుతుంది అంటూ రేఖ చెప్పగానే.. అపర్ణ కోపంగా రేఖను తిడుతుంది. దీంతో రేఖ కోపంగా అపర్ణను తిడుతూ.. ఇందుకు కూడా కంపెనీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తుంది. ఇందు తాను ఏమీ చేయలేనని మీరే ఐడియా చెప్పండి ఆంటీ అని అడగ్గానే.. ఇంతసేపు మా రేఖను బిజినెస్‌ రాదని తిట్టారు కదా.. మళ్లీ ఇప్పుడు రేఖను ఎందుకు హెల్ప్‌ అడుగుతున్నారు అంటుంది. రాజు ను టార్గెట్‌ చేసి తిడుతుంది. రేఖ కూడా రాజు మాటల్లో ఉండే ఫైర్‌ చేతల్లో ఉండాలి.. ఇప్పుడు కంపెనీ నిజంగానే కష్టాల్లో ఉంది. నీ భార్య సీఈవోగా ఉంది. తన బాధ్యతలన్నీ నీ భుజం మీద వేసుకుని ఎలా ఆ రా మెటిరీయల్‌ వాడికి డబ్బులు ఇస్తావో.. ఎలా నీ భార్యకు సపోర్టు చేస్తావో.. ఎలా కంపెనీ మూతపడకుండా ఆపగలుగుతావో అది నీ ఇష్టం నిజంగానే నేను ఇందులో ఇన్వాల్వ్‌ అవ్వను అంటూ చెప్పి రేఖ వెళ్లిపోతుంది.

నష్టాల్లో ఉన్న కంపెనీ నడపాలంటే అంత తేలిక కాదు అంటూ భూషణ్‌ వెళ్లిపోతాడు. మా రేఖకు ఉన్న తెలివిలో వన్‌ పర్సెంట్‌ కూడా నీకు లేదు. అలాంటిది నష్టాల్లో ఉన్న కంపెనీని నువ్వు బయట పడేస్తావా..? అంటూ భ్రమరాంబ వెళ్లిపోతుంది. శేషు మాత్రం అల్లుడు నీ మీద నాకు నమ్మకం ఉంది. ఆల్‌ది బెస్ట్‌ అల్లుడు అంటూ వెళ్లిపోతాడు. అపర్ణ, సుభాష్‌ బాధపడుతుంటే.. రాజు మాత్రం మీరేం బాధపడకండి.. ఇందులోంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అదేంటో ఆలోచిస్తాను అంటూ రాజు చెప్తాడు.

Advertisement

తర్వాత రాజు, ఇందు కంపెనీ సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తుంటారు. అప్పుడే రాజు, ఇందు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తుంటే.. ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఇందు కోపంగా అడగ్గానే.. నీ కళ్లల్లోకి చూస్తే ఏదైనా కొత్త ఐడియా వస్తుందేమోనని చూస్తున్నానని చెప్తాడు ఇందు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. తర్వాత ఇద్దరు కాంప్రమైజ్‌ అయి ఏదైనా కొత్త ఐడియా ఆలోచించాలి అనుకుంటుంటే.. అప్పుడే అపర్ణ, సుభాష్‌ వస్తారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక మార్గం ఉందని తన ఐడియా చెప్తాడు సుభాష్‌. దీంతో ఇందు ఐడియా చాలా బాగుంది తాతయ్య అంటూ హ్యాపీగా ఫీలవుతుంది.

మరోవైపు డెలివరీ జాబ్‌కు వెళ్లిన వెంకట్‌ ఆర్డర్స్‌ తీసుకుని డెలివరీ చేయడానికి వెళ్తాడు. ఓనరు వెంకట్‌ను బైక్‌లో పెట్రోల్‌ ఉందా అని అడగ్గానే.. వెంకట్‌ ఉంది సార్ పొద్దున్నే ఫుల్ ట్యాంక్ కొట్టించాను అని చెప్పి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన వెంకట్ సైకిల్ మీద డెలివరీ చేయడానికి వెళ్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×