E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆస్థి పేపర్స్ మీద సంతకం చేసిన రాజు   

Brahmamudi Serial Today Episode July 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఆస్థి పేపర్స్ మీద సంతకం చేసిన రాజు   
Advertisement

Brahmamudi serial today Episode: రాజు ఆలోచిస్తూ.. కూర్చుని ఉంటే నందు వెళ్తుంది.. ఇందు అక్కను ఒక్కదాన్ని చేసి వదిలేసి వచ్చావా..? నీకు డబ్బు పిచ్చి తప్పా వేరే ద్యాస ఉండదా..? నీకు జాలి దయ ఉండవా..? కొంచెం కూడా మానవత్వం కూడా లేదా..? అని నిలదీస్తుంటే.. రాజు కోపంగా అనవసరంగా నోరు పారేసుకోకు అంటాడు. దీంతో నందు మరింత కోపంగా లేదు నువ్వొక మోసగాడివి నీ అవసరం తీరాక మనుషులను అవతల పారేస్తావు అనగానే.. రాజు కోపంగా అది నేను కాదు మీ అక్క.. నేను అక్కడే తనతోనే ఉంటానని చెప్పినా మీ అక్కే నన్ను వెళ్లిపోమ్మంది.. నీకు తెలుసో లేదో.. మీ అక్కే నన్ను అద్దె మొగుడిగా తెచ్చుకుంది అని చెప్పగానే..

నందు తెలుసు మా అక్క చెప్పింది నువ్వు పెద్ద ఏదో అందగాడివి అనో హీరోవు అనో తెచ్చుకోలేదు.. తోడుగా ఉంటావని తెచ్చుకుంది. నువ్వు ఆ ఇంట్లో రాబంధువుల నుంచి కాపాడతావని.. కానీ ఇప్పుడు ఏం చేశావు.. ఆ రాబంధువుల మధ్యే వదిలేసి వచ్చావు.. అనగానే.. మరి నన్నేం చేయమంటావు డైలీ పేమెంట్‌ గాడిని కదా..? తనే నన్ను వెళ్లిపోమ్మంది అని చెప్పగానే.. కానీ తన మనసులో ఏ భయం ఉండి అలా మాట్లాడిందో నువ్వే సర్ది చెప్పి ఉండాల్సింఇ కదా..? ఇప్పుడు ఏ జరుగుతుందో ఏంటో.. కంపెనీ ఏమౌతుందో ఆలోచిస్తేనే భయంగా అంటూ నందు బాధపడుతుంటే.. రాజు హలో ఆ ఇంటి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు.. ఇందుకు లేని భయం నీకెందుకు అంటూ రాజు అడిగితే

Advertisement

ఎందుకంటే ఇందు మా అక్క కాబట్టి అంటుంది. దీంతో రాజు తననేదో అక్క అని పిలుస్తున్నావు కానీ సొంత అక్క అయినట్టు ఫీల్‌ అవుతున్నావు.. అని రాజు అడగ్గానే.. అవును నేను ఇందు సొంత చెల్లెలిని అంటూ ఇందు ప్లాష్‌బ్యాక్‌ చెప్తుంది. అంతా విన్న రాజు ఓహో అందుకేనా మీ అక్కను ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్‌ అవుతావు.. అయినా ఈ విషయం మీ అక్కకు తెలుసా..? అని అడగ్గానే.. మీ ఇంటికి వచ్చిన రోజే తనకు తెలుసు అని చెప్తూ.. రాజును తిడుతుంది. వెంటనే ఇక నువ్వు ఇంటికి వెళ్లు అని చెబితే రాజు వెళ్లనని చెప్తాడు. దీంతో నందు కోపంగా చూడు రాజు మా అక్కకు అక్కడ ఏమైనా జరిగితే మాత్రం నిన్ను వదిలిపెట్టను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది నందు.

కిచెన్‌లోంచి వచ్చిన ఇందును రేఖ పిలుస్తుంది. దగ్గరకు వచ్చిన ఇందును రాజు మళ్లీ వస్తే ప్రాబ్లమ్స్‌ వస్తాయి.. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్‌ మళ్లీ రావొద్దు అంటే ఒకే ఒక్క సెల్యూషన్‌ ఉంది అని చెప్పగానే.. అపర్ణ వచ్చి మాకు ప్రాబ్లమ్స్‌ వచ్చేది నీ నుంచే.. నువ్వే మా ప్రాబ్లమ్‌ అంటూ తిడుతుంది. దీంతో రేఖ ఎందుకు ఆంటీ అలా మాట్లాడతారు.. నేను మీ ఇంటి మనిషినేగా..? ఈ ప్రాబ్లమ్‌ రాకూడదు అంటే ఆస్థి మొత్తం ఇందు పేరు మీద కాకుండా నా పేరు మీద ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్‌ రావు అని చెప్తుంది. భ్రమరాంబ కూడా ఇందు మళ్లీ ఎలాంటి సమస్యలు రాకూడదు అంటే ఆస్థి మొత్తం రేఖ పేరు మీదకు ట్రాన్స్‌ ఫర్‌ చేయ్‌.. రేఖ బాగా చూసుకుంటుంది అని చెప్పగానే.. అపర్ణ కోపంగా మీరు దాన్ని బెదిరించి సంతకం పెట్టించాలని చూసినా.. నా మనవడు సంతకం పెట్టడు కదా..? అనగానే..

Advertisement

మీ మనవడా..? వాడు ఎప్పుడో సంతకం పెట్టాడు అని రేఖ చెబితే రాజు సంతకం పెట్టడు.. అనగానే.. అవును వాడు సంతకం అడిగితే ఎలా పెడతాడు.. మేమే దగ్గరుండి వాడికి తెలియకుండా సంతకం చేయించుకున్నాము అంటూ రేఖ చెప్పగానే.. అపర్ణ, ఇందు షాక్‌ అవుతారు. రాజు సంతకం చేసిన ఆస్తి పేపర్లు చూపిస్తుంది రేఖ. ఇందు భయంతో రాజు సంతకం తీసుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి. ఆస్థిని ఎలా కాపాడుకోవాలి అని మనసులో భయపడుతుంది. మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుంటే మేము ఒప్పుకోవాలా..? నా మనవడు ఇష్టపూర్వకంగా సంతకం చేయలేదు కదా..? అనగానే.. రేఖ ఎలా పెట్టాడు అన్నది కాదు.. పెట్టాడా..? లేదా అనేది ముఖ్యం అంటూ రేఖ కోపంగా చూస్తూ.. అపర్ణ, ఇందుకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇందు సంతకం పెడతానని పైకి వెళ్లిపోతుంది.

రాజు దగ్గరకు వెళ్లిన లక్కీ ముందు చలపతితో మాట్లాడి ఓదారుస్తాడు. చలపతి కూడా తన భయాన్ని లక్కీతో చెప్పుకుంటాడు. తర్వాత రాజు దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు లక్కీ. రాజును ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే.. కిడ్నాప్‌ చేసినప్పుడు ఇందును రేఖకు గుడిలో అప్పగించినప్పుడు కూడా ఎలాంటి ఫీల్‌ అవ్వలేదు.. కానీ ఇప్పుడెందుకు బాధ అనిపిస్తుందో తెలియడం లేదని రాజు చెప్తాడు. అప్పుడే అపర్ణ, రాజుకు ఫోన్‌ చేసి రేఖ ఆస్తి కోసం చేసిన ప్లాన్‌.. రాజు చేత సంతకం పెట్టించిన విషయం.. ఇందు కూడా సంతకం చేస్తానన్న విషయం చెప్తుంది. దీంతో రాజు షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×