E-Paper
Advertisement

Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ప్లాన్‌ సక్సెస్‌ – ఎమోషనల్‌ అయిన రేవతి

Brahmamudi Serial Today July 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ప్లాన్‌ సక్సెస్‌ – ఎమోషనల్‌ అయిన రేవతి
Advertisement

Brahmamudi serial today Episode: ఇంటికి వెళ్లాక రేవతి పరధ్యానంలో బాధపడుతుంది. రాజ్‌ వచ్చి అమ్మా ఆకలి అవుతుంది అని చెప్పినా పట్టించుకోదు. ఇంతలో జగదీష్‌ వచ్చి రేవతిని ఓదార్చి బాబుకు ఆకలేస్తుందట ఏదైనా చేసి పెట్టు అని చెప్తాడు సరే అంటూ రేవతి టిఫిన్‌ చేయబోతుంటే.. రాజ్‌ ఫోన్‌ చేస్తాడు. ఇదేంటండి తమ్ముడు ఇంత పొద్దున్నే ఫోన్‌ చేస్తున్నాడేంటి అని కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది. రాజ్‌ సారీ అక్కా మిమ్మల్ని ఇంటికి పిలిచి అవమానించాను అంటాడు. దీంతో రేవతి ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు తమ్ముడు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరగుతుంది అని చెప్తుంది.

దీంతో అందుకే ఒక మంచి ఐడియా వచ్చిందక్కా వెంటనే బస్తీ చివరన ఉన్న శివాలయానికి బాబును తీసుకుని రా అక్క అని చెప్తాడు. రేవతి భయంగా ఇక నేను రాలేను తమ్ముడు అంటుంది. లేదు అక్కా నువ్వు తప్పకుండా రావాలి అని కాల్‌ కట్‌ చేస్తాడు. ఏమైంది రేవతి అని జగదీష్‌ అడగ్గానే.. తమ్ముడు బాబును తీసుకుని వీధి చివర ఉన్న గుడి దగ్గరకు అర్జెంట్‌ గా రమ్మంటున్నాడు.. ఎందకంటే వచ్చాక చెప్తా అంటున్నాడు అనగానే.. ఏం పనే ఏంటో అక్కడికి వెళ్తే విషయం ఏంటో నీకు కూడా తెలుస్తుంది కదా వెళ్లు అని జగదీష్‌ చెప్తాడు.

Advertisement

జూనియర్‌ స్వరాజ్‌ను తీసుకుని గుడికి వెళ్తుంది రేవతి. ఏంటి తమ్ముడు నా కొడుకును మా అమ్మతో మీ ఇంటికి పంపిస్తారా..? అది కూడా వాడు నా కొడుకు చెప్పకుండా పంపిస్తారా..? అని అడుగుతుంది. ఎగ్జాక్లీ..నా ప్లాన్‌ మొత్తం నీకు అర్థం అయింది అక్కా అంటాడు రాజ్‌. అమ్మో వద్దు తమ్ముడు పొరపాటున అమ్మకు వాడు తన మనవడు అని తెలిసింది అనుకో ఇక అంతే సంగతి.. అసలు మొన్న ఇంటికి వచ్చినందుకు భద్రకాళిలా నా మీద విరుచుకుపడింది. ఇప్పుడు ఈ నాటకం ఆడి నా కొడుకును ఇలా దగ్గర చేస్తున్నాను అని తెలిసింది అనుకో ఇక జీవితాంతం నన్ను శత్రువుగా చూస్తుంది అంటూ భయపడుతుంది.

అమ్మకు నిజం ఎలా తెలుస్తుంది అక్కా.. అసలు తెలియదు.. అంటాడు. దీంతో ఈ నాటకం ఎందుకు తమ్ముడు.. అమ్మకు ఏదో ఒక రోజు నా మీద ప్రేమ కలిగిన రోజు ఆమె వాడిని దగ్గరకు తీసుకుంటుంది అనగానే.. రాజ్‌, కావ్య ఇద్దరూ తమ మాటలతో రేవతిని కన్వీన్స్‌ చేస్తారు. అయినా సరే రేవతి ఒకసారి ఆవిడకు చెప్పకుండా నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకున్నాను. ఆ తప్పుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను. మళ్లీ ఇంకొక తప్పు చేయడమంటే..? అని బాధపడుతుంది రేవతి. దీంతో ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు కాదక్కా జరిగిన తప్పును సరిదిద్దుకోవడం అంటారు. ఒకసారి రాజ్‌ను చూడు వాడికొక పెద్ద ఫ్యామిలీ ఉంది. రాజులా బతికే అవకాశం ఉంది. కానీ ఎవ్వరూ లేనట్టు ఇలా బతకడం నీకు ఇష్టమేనా..? అని రాజ్‌ అడుగుతాడు. కావ్య కూడా రేవతి గారు కనీసం వాడి భవిష్యత్తు గురించి ఆలోచించి ఒప్పుకోండి అని అడుగుతుది.

Advertisement

దీంతో రేవతి సరే మీ ఇష్టం.. కానీ ఒక్క విషయం.. రేపు ఎప్పుడైనా అమ్మకు నిజం తెలిసి గొడవ చేస్తే.. అని అనుమాన పడుతుంది రేవతి. దీంతో రాజ్‌ దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదని ఈ కథ స్క్రీన్‌ ప్లే బాధ్యతలు మొత్తం కళావతి గారిదే అని .. రాజ్‌ చెప్తుంటే కావ్య కోపంగా ఏంటి..? అంటుంది. దీంతో రాజ్‌ అబ్బే అదే.. మేమిద్దరం కలిసి చేశామని అమ్మకు చెప్తాను. ఇక మీరు ఈ విషయం గురించి మర్చిపోండి వాడిని వాళ్ల అమ్మకు ఎలా దగ్గర చేయాలో మేము చూసుకుంటాం అని చెప్తుండగానే అపర్ణ గుడికి వస్తుంది. ఇంతలో జూనియర్‌ రాజ్‌ను పిలిచి తమ నాటకం గురించి చెప్పి నువ్వొక నాటకం ఆడాలని చెప్తారు. రాజ్‌, కావ్య చెప్పినట్టే జూనియర్‌ రాజ్‌ వెళ్లి అపర్ణకు డాష్‌ ఇస్తాడు. దీంతో అపర్ణ, జూనియర్‌ రాజ్‌ను పక్కకు తీసుకెళ్లి ప్రసాదం పెడుతుంది. తర్వాత జూనియర్‌ రాజ్‌ను తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వచ్చిన బుడ్డోడిని చూసిన ఇంద్రాదేవి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×