E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode:  నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని ఇందు, రాజును అడిగితే.. రాజు ఎలా ఉన్నా సరే కానీ నీలా ఉండకుంటే చాలు అంటాడు. అందుకు ఇందు కోప్పడుతుంది. సరే కానీ ఇప్పడు నిజం చెప్పు అంటూ రాజును అడిగితే రాజు ఎలా ఉండాలో చెప్తాడు. రాజు చెప్తుంటే.. బావ ఇలా నాలా ఉంటే బాగుంటుందా..? అని అడుగుతుంది. రాజు ఏవేవో ఎగ్జైట్‌ అవుతూ.. చెప్తుంటాడు. చివరిగా ఉదయమే తలస్నానం చేసి బెడ్‌ కాఫీ పట్టుకుని వచ్చి నిద్రపోతున్న నన్ను లేపి ఏవండి ఇదిగోండి కాఫీ అంటూ ఇవ్వాలి అంటూ చెప్పి నిద్రపోతాడు. ఇందు మనసులో అంటే నీకు పక్కా పదహారణాల తెలుగమ్మాయి కావాలన్నమాట.. నేను ఉంటాగా బావ అని మనసలో అనుకుంటుంది.

పార్టీలో ఉన్న ఐశ్వర్యను రేణు రెచ్చగొడుతుంది. శశిని పెళ్లి లవ్‌ చేయమని.. వాడేం బాడ్‌ ఫెలో కాదు.. చాలా మంచివాడు.. పైగా నిన్ను లవ్‌ చేస్తున్నాడు.. అంటూ చెప్పగానే.. ఐశ్వర్య అయినా వద్దులేవే అంటే.. ఏయ్‌ నువ్వు ఉండు నేనే శశితో మాట్లాడతాను అంటూ చెప్పి శశి దగ్గరకు వెళ్లి దాని మూడ్‌ అస్సలు బాగాలేదు.. మనీ ప్రాబ్లమ్‌లో ఉంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలట. దాని వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకో.. ఇప్పుడు నీ మనీ పవర్‌ చూపించి ఈజీగా నీ దారిలోకి తెచ్చుకో అని రేణు చెప్పగానే.. శశి థాంక్స్‌ రేణు.. ఎప్పటి నుంచో ఈ జాంపండు కోసం ఎదురుచూస్తున్నాను.. ఇప్పుడు అది దక్కేలా చేశావు అంటాడు. రేణు మరి నా సంగతేంటి..? అని అడగ్గానే.. నీకో ఫోన్‌ గిఫ్ట్‌ గా అమెరికా నుంచి తెప్పించాను వెళ్లి తీసుకో అని చెప్పగానే.. రేణు వెళ్లిపోతుంది. శశి, ఐశ్వర్య దగ్గరకు వెళ్లి మాటలు కలిపి మనిద్దరం ఇక నుంచి ఫ్రెండ్స్‌ అంటాడు. ఐశ్వర్య మాత్రం అయోమయంలోనే ఉంటుంది.

Advertisement

మరుసటి రోజు ఉదయమే ఇందు తలస్నానం చేసి జడను ఊపుకుంటూ కాఫీ తీసుకుని వెళ్లి రాజును నిద్ర లేపి కాఫీ ఇస్తుంది. అంతా చూస్తున్న రాజు షాక్‌ అవుతాడు. అయోమయంగానే కాఫీ తీసుకుని తాగుతుంటాడు. ఇందు రొమాంటిక్‌గా రాజును చూస్తుంటుంది. రాజు కాఫీ తాగడం అయిపోగానే.. ఇప్పుడు నేను ఫ్రెష్‌ అయి వస్తాను అనగానే.. బావ ఉండు అంటూ వెళ్లి రాజు కోసం టవల్‌, బ్రష్‌, సోప్‌ తీసుకొచ్చి ఇస్తుంది. రాజు అనుమానంగా ఇదేంటి సడెన్‌గా ఇలా మారిపోయింది. ఏమైనా స్కామ్‌ చేస్తుందా..? ఏంటి..? మళ్లీ నన్ను ఎక్కడైనా ఇరికిస్తుందా..? ఏంటి..? ఏదైనా నేను జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంటే.. ఇందు బావ వెళ్లు బాత్రూంకి అని చెప్పగానే.. రాజు వెళ్లి ప్రెషప్‌ అయి రాగానే.. బెడ్‌ మీద రాజు కోసం డ్రెస ‌రెడీగా ఉంటుంది. అది చూసి రాజు షాక్‌ అవుతాడు. ఇందు రూంలోకి వచ్చి బావ నీకోసం నేనే డ్రెస్‌ రెడీ చేశాను.. ఇప్పుడు వెళ్లి నీకోసం టిఫిన్‌ రెడీ చేస్తాను నువ్వు రెడీ అయి వచ్చేయ్‌ అంటుంది. రాజు ఏయ్‌ ఏంటి ఈ కొత్తగా సేవలు అంటూ అడగ్గానే.. నువ్వే కదా..? సేవలు చేసే భార్య కావాలని అడిగావు.. ఎక్కువ సేపు ఆలోచించకుండా త్వరగా వచ్చేయ్‌ బావ అంటూ వెళ్లిపోతుంది.

కింద డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఐశ్వర్య, స్వాతి టిఫిన్‌ చేస్తుంటారు. రాజు లక్కీని తీసుకుని డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు బలవంతంగా తీసుకొస్తుంటాడు. లక్కీ అందరూ టిఫిన్‌ చేశాక చేస్తానని చెప్తుంటే.. రేయ్‌ ఎందుకు భయపడుతున్నావురా..? ఇది మన ఇల్లు నువ్వు ఇప్పుడే టిఫిన్‌ చేయాలి అంటూ తీసుకొస్తాడు. లక్కీ వెళ్లి ఐశ్వర్య పక్కన కూర్చుని పులిహోర కలుపుతుంటాడు. రాజు చూసి నవ్వుతుంటాడు… లక్కీ తన కాలుతో ఐశ్వర్య కాలు తొక్కుతుంటాడు. అంతా కామెడీగా సాగుతుంది. ఇంతలో ఇందు టిఫిన్‌ తీసుకొచ్చి రాజు, లక్కీలకు వడ్డించి వెళ్తుంది.

Advertisement

కిచెన్‌లోకి వెళ్లిన ఇందును చూసి అపర్ణ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నీ జీవితం ఎలా ఉంటుందో ఏమోనని తనకు చాలా ఆందోళనగా ఉండేదని.. ఇంతకు ముందు రాజును పంపించినట్టు మళ్లీ అలా పంపించవద్దమ్మా..? నువ్వు ఎప్పుడూ రాజుతో సంతోషంగా ఉండాలి అని చెప్పి వెళ్లిపోతుంది. ఇందు మనసులో బాధగా సారీ నాన్నమ్మ తను నీ మనవడు అని నిజం నీకు చెప్పలేకపోతున్నాను.. తను నా బావ నాన్నమ్మ తనను నేను ఎప్పటికీ వదులుకోను అనుకుంటుంది.

ఇంట్లో రూంలో ఒంటరిగా కూర్చుని నందు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు వెంకీ.. దుగ్గిరాల ఇంటి అమ్మాయిని మాత్రం ఎప్పటికీ ప్రేమించను అంటూ చలపతికి ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటాడు. అలాగే నందు తాను దుగ్గిరాల ఇంటి వారసురాలిని అని చెప్పిన విషయం గుర్తు చేసుకుని ఏడుస్తుంటాడు. తన ఫోన్‌లో ఉన్న నందు ఫోటో చూస్తూ.. ఎమోషనల్‌ అవుతాడు.ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×