E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన లక్కీ 

Brahmamudi Serial Today Episode July 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన లక్కీ 
Advertisement

Brahmamudi serial today Episode: రాజుకు యాక్సిడెంట్‌ చేయించింది రేఖ అనే నిజం నందుకు చెప్తుంది ఇందు. దీంతో నందు కోపంగా వెళ్లి రేఖ ఆంటీని నిలదీద్దాం పద అనగానే.. ఇందు వద్దు ఇప్పుడు తనే యాక్సిడెంట్‌ చేసిందని సాక్ష్యాలు లేవు అని చెప్పగానే.. తాను సాక్ష్యాధారాలతో బయటపెట్టి రేఖ ఆంటీకి బుద్ది చెప్పాలని అంటుంది. అందుకు ఇందు ఒప్పుకోకపోవడంతో నందు మాత్రం ఎలాగైనా రేఖ చేసిన యాక్సిడెంట్‌ గురించి సాక్ష్యాలు సేకరించాలి అని మనసులో అనుకుంటుంది. తర్వాత నందు, వెంకట్‌కు ఫోన్‌ చేసి మీ అన్నయ్యకు యాక్సిడెంట్‌ అయింది కదా..? ఆ యాక్సిడెంట్‌ చేసిన వాడిని పట్టుకుని ఎంక్వైరీ చేయాలి అందుకోసం నువ్వు నాకు హెల్ప్‌గా ఉండాలి నాకు తోడుగా వస్తావు కదా..? అని అడగ్గానే.. వెంకట్‌ సరే అంటాడు.

దుగ్గిరాల ఇంటికి ఆఫీసుకు శృతి వస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఇందును పిలుస్తుంది. హాల్లో కూర్చున్న ఐశ్వర్య ఎందుకొచ్చావని డైరెక్టుగా ఇంట్లోకి వస్తావా..? అంటూ తిడుతుంటే.. నందు వచ్చి ఐశ్వర్యను తిడుతుంది. ఎదుటి వాళ్లు బాధపడతారన్న కనీసం జ్ఞానం లేదా..? అంటూ తిడుతుంటే.. ఐశ్వర్య కోపంగా లేచి వెళ్లి నందును కొట్టబోతుంటే.. ఇందు వచ్చి ఆపేసి శృతికి డబ్బులిచ్చి పంపిచేస్తుంది. శృతి వెళ్లిపోయాక నందు, ఇందు ఇద్దరు కలిసి ఐశ్వర్యకు క్లాస్‌ పీకుతారు. ఐశ్వర్య వెళ్లిపోతుంది.

Advertisement

రూంలో పడుకున్న రాజు సడెన్‌గా ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. ఇందు ఏమైంది అని అడగ్గానే.. రాజు తనకు వచ్చిన కల గురించి చెప్పి బాధపడుతుంటే.. అది మన గతం బావ మన కుటుంబానికి జరిగిన అన్యాయం అని మనసులో అనుకుంటూ రాజును ప్రశాంతంగా పడుకోమని చెప్పి పడుకోబెడుతుంది.

లక్కీ తన కొడుకే అని రాజు ఇంకెవరికి చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది రేఖ. ఒకవేళ ఇందుకు ఏమైనా చెప్పాడా..? ఇందుకు చెబితే ఇందు వచ్చి నాతో చెప్పేది కదా.? తను నాకు చెప్పలేదంటే.. తనకు కూడా చెప్పలేదనుకుంటా.? అపర్ణ ఆంటీకి చెప్పాడా..? సుభాష్‌ అంకుల్‌కు చెప్పాడా..? లేదంటే వాళ్ల అమ్మానాన్నలకు చెప్పాడా..? నందుకు చెప్పాడా..? అసలు ఎవరికి చెప్పి ఉంటాడు.. అరేయ్‌ రాజు ఇంతకీ ఎవరికీ చెప్పావురా…? అంటూ ఆలోచిస్తుంది. అప్పుడే భూషణ్‌ వచ్చి రేఖ అని పిలవగానే.. రేఖ కంగారుగా ఏంటి భూషణ్‌ అని అడుగుతుంది. ఏంటి రేఖ ఏదో టెన్షన్‌ పడుతున్నావు.. ఇంకా పడుకోలేదు ఏంటో చెప్పు రేఖ అని అడిగితే ఏం చెప్పను భూషణ్‌ నీతో పెళ్లికి ముందు నేను ఒకడితో కలిసి తిరిగి ఒక బిడ్డను జన్మనిచ్చానని చెప్పనా..? నేను దూరంగా విసిరేసిన ఆ బిడ్డ ఇప్పుడు పెరిగి పెద్దవాడై నా కళ్లముందుకు వచ్చాడని చెప్పనా..? ఈ నిజం చెబితే నువ్వు యాక్సెప్ట్‌ చేస్తావా..? అసలు చెప్పను అంటూ మనసులో అనుకుంటుంటే.. భూషణ్‌ ఏం ఆలోచిస్తున్నావు రేఖ అంటాడు రేఖ ఏం లేదు.. అంటూ భూషణ్‌ను కన్వీన్స్‌ చేసి పంపిస్తుంది రేఖ.

Advertisement

మరుసటి రోజు ఉదయమే లక్కీ బ్యాగు తీసుకుని దుగ్గిరాల ఇంట్లోకి వస్తాడు. హాల్లో కూర్చున భ్రమరాంబ హలో ఎవరు నువ్వు సరాసరి ఇంట్లోకే వస్తున్నావు అంటూ తిడుతుంది. అప్పుడే వచ్చిన రాజు, లక్కీ తన ఫ్రెండు అని లక్కీ కూడా ఇక నుంచి ఇంట్లోనే ఉంటాడని చెప్పగానే.. భ్రమరాంబ కోపంగా నీతో ఇంట్లో ఉంటాడా..? తాను దూర సందు లేదు మెడకేమో డోలు అన్నట్టు ఈ డోలు గాడు ఈ ఇంట్లో ఎందుకు అంటూ తిడుతుంది.. రాజు, రేఖను పిలిచి లక్కీని చూపిస్తూ.. ఏంటి పిన్నీ వీడిని ఎక్కడో చూసినట్టు ఉందా..? ఎక్కడో కలిసినట్టు ఉందా..? అదే నా ఫ్రెండ్‌ లక్కీ పిన్ని అంటూ చెప్తాడు. భ్రమరాంబ కోపంగా వాడేమైనా సెలబ్రెటీనా..? రేఖ వీడి యవ్వారం చూశావా..? వాడిని ఇంట్లోనే పెడతాడంట అంటూ చెప్పగానే.. లక్కీ ఇక్కడే ఉంటాడని లక్కీ వాళ్ల అమ్మ వాడిని చిన్నప్పుడే కనేసి పడేసి వెళ్లిపోయింది. వాడు వాడి తల్లి కోసం ఇన్నేళ్లుగా వెతకని ప్లేసు లేదు.. అంటూ చెప్తుంటే.. అపర్ణ కోపంగా చీ అది ఒక తల్లేనా..? పశువులు కూడా తన పిల్లల మీద జాలి దయ చూపిస్తాయి.. అది మనిషేనా అంటూ తిడుతుంది. రేఖ మాత్రం భయంగా చూస్తూ.. మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×