E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   
Advertisement

Brahmamudi serial today Episode: దుగ్గిరాల ఇంటికి వెళ్తున్న రాజు ఆటో మధ్యలోకి వెళ్లగానే.. ఆటో ఆపేయించి దిగి వెళ్లబోతుంటే.. ఇందు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఆపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు కానీ మీ ఇంటికి అయితే నేను రాను అంటాడు రాజు. ఎందుక రావు అక్కడ నిన్ను ఎవరేం అనరు అంటూ ఇందు చెప్పగానే.. అక్కడ వాళ్ల ప్రాబ్లం కాదు నీ వల్లే నా ప్రాబ్లం.. అందుకే నాకు కొన్ని కండీషన్స్‌ ఉన్నాయి అంటూ రాజు చెప్పగానే.. ఏంటా కండీషన్స్‌ అంటూ ఇందు అడిగితే రాజు తన కండీషన్స్‌ చెప్తాడు.

ఆ కండీషన్స్‌కు తాను ఒప్పుకుంటున్నాను.. కానీ బావ నీ ఇంటికి రావడానికి నువ్వే బేరం ఆడుతున్నావా అంటుంది. అందుకు రాజు ఏయ్‌ మా ఇల్లేంటి క్యారెక్టర్‌ నుంచి బయటకు వచ్చి మాట్లాడు.. మనిద్దరం ఉన్నప్పుడు అనగానే.. అలా అయితే మనకు పెళ్లి కాలేదు అని అందరికీ తెలిసిపోయే చాన్స్‌ ఉంది కదా బావ.. అనగానే.. ఇదికూడా కరెక్టే అయినా ఇది ఎలా పిలిస్తే నాకేంటి..? నాకు కావాల్సింది డబ్బులు అని మనసులో అనుకుని అయితే నాకు టైంకు పేమెంట్ ఇస్తావా..? ప్రామిస్‌ చేయ్‌ అంటూ అడగ్గానే.. ఇందు బావ ఏంటి మాటిస్తేనే నన్ను నమ్ముతావా…? అంటూ రొమాంటిక్‌గా చూస్తుంటే.. రాజు కంగారుపడుతూ వెళ్లి ఆటో ఎక్కేస్తాడు. ఇందు వెళ్లి ఆటో ఎక్కుతుంది. ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగుపెడతారు.

Advertisement

ఇంటికి వచ్చిన రాజు, ఇందులను చూసి అపర్ణ సంతోషంగా రాజు అంటూ ఎదురుగా వెళ్తుంది. రేఖ, భ్రమరాంబ చూసి షాక్‌ అవుతారు. రాజు దెబ్బలు చూసి అపర్ణ కంగారుపడుతుంది. ఈ దెబ్బలేంటి బాబు అని అడిగితే యాక్సిడెంట్‌ అయిందని ఇందు చెప్పగానే.. అపర్ణ భయంగా యాక్సిడెంట్‌ ఏంటి బాబు అని అడగ్గానే.. అవును నాన్నమ్మ కానీ నాకేం కాలేదు.. నీ మనవడు ఉక్కు మనిషి. కాకపోతే కాలుకు చిన్న యాక్సిడెంట్‌ అయినా మొత్తం సెట్‌ అయిపోతుంది అంటాడు. శేషు కూడా ఏంటి అల్లుడు అందరినీ బెండు తీస్తావని నువ్వే ఇలా అయిపోతే ఎలా అనగానే.. ఏంటో మామయ్య అలా జరిగిపోయింది అంటాడు రాజు. అపర్ణ మాత్రం రాజు గురించి ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంది. అపర్ణ మాటలకు రాజు బాధపడుతూ.. అమ్మమ్మ నేను ఇందుకు నిజమైన భర్తను కాదు.. భర్తలా నటిస్తున్నాను.. అనవసరంగా మీరు నా మీద ఆశలు పెంచుకుంటున్నారు. కానీ నాకు కూడా మిమ్మల్ని చూసిన ప్రతిసారి నేను నిజంగా మీ మనవడినేమో అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు కదా అని మనసులో అనుకుంటాడు.

ఇందు, అపర్ణను ఓదారుస్తుంది. ఇప్పుడు రాజును నా భర్తలా కాకుండా నీ మనవడిలా ఇంటికి తీసుకొచ్చాను.. అని చెప్పగానే.. స్వాతి వెళ్లి బావ అసలు నీకు యాక్సిడెంట్‌ ఎలా అయింది అని అడగ్గానే.. నేను బైక్‌ మీద వెళ్తుంటే.. వెనక నుంచి ఒక వెహికిల్‌ వచ్చి గుద్దేసి పోయింది అంటూ చెప్పగానే.. నందు వచ్చి యాక్సిడెంట్‌ ఎవరు చేసి ఉండొచ్చు.. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా..?  అని అడుగుతుంది. అందుకు రాజు అనుమానం అంటే.. రేఖ పిన్ని మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా..? అనగానే.. రేఖ టెన్షన్‌ పడుతుంది. నందు మాత్రం కోపంగా నీకు యాక్సిడెంట్‌ చేసిన వాళ్లను నేను అసలు వదిలిపెట్టను.. వాళ్లు ఎవరైనా సరే వాళ్లను పట్టుకుని వాళ్లకు తగిన శిక్ష పడేలా చేస్తాను అంటుంది. అందుకు రేఖ కోపంగా నందు ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పు రాజుకు యాక్సిడెంట్‌ అయింది. రాజును ఇలా నిలబెట్టడం అవసరమా చెప్పు అంటుంది. రాజును వెళ్లి రెస్ట్‌ తీసుకోమని చెప్తుంది. అందరూ వెళ్లిపోతారు. భ్రమరాంబ, శేషు అనుమానంగా రేఖ నువ్వు మారిపోయావా..? అంటూ నిలదీస్తారు. రేఖ మారలేదని.. కొన్ని సార్లు తగ్గి ఉండటమే ఉత్తమం.. కత్తిపోటు కన్నా వెన్ను పోటు చాలా డేంజర్‌ అంటూ చెప్పి రేఖ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత రూంలోకి వెళ్లిన రాజు తన పేమెంట్‌ విషయంలో తన కండీషన్స్‌ విషయంలో ఎక్కడ తగ్గినా ఇక్కడ ఉండను అంటూ చెప్తాడు. దీంతో ఇందు నీకు ఇష్టమైనట్లుగా ఉండవచ్చని చెప్తుంది. నువ్వు రెస్ట్‌ తీసుకో నీకు కావాల్సిన భోజనం నేనే రూంలోకే తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్తుంది. ఎదరుగా వచ్చిన నందు.. ఇందును పట్టుకుని రాజు ఎవరు అని అడుగుతుంది. మేము ఎంత చెప్పినా వినను నువ్వు ఇప్పుడు ఎందుకు నువ్వే తీసుకొచ్చావంటే ఏదో బలమైన కారణం ఉంటుంది అదేంటో చెప్పు అక్క అని అడగ్గానే.. రాజు మంచొడని తీసుకొచ్చాను కానీ రాజు యాక్సిడెంట్‌ విషయంలో నువ్వు ఇన్వాల్వ్‌ అవ్వకు ఎందుకంటే యాక్సిడెంట్‌ వెనక రేఖ ఆంటీ ఉందని చెప్పగానే.. నందు షాక్‌ అవుతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×