E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును బావ అంటూ పిలిచిన ఇందు

Brahmamudi Serial Today Episode July 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును బావ అంటూ పిలిచిన ఇందు
Advertisement

Brahmamudi serial today Episode: రాజును తనతో పంపించాలని రాజు తమ ఇంట్లో ఉంటేనే తాను కాపాడుకోగలనని ఇందు చలపతి, లక్ష్మీలను రిక్వెస్ట్‌ చేస్తుంది. వాళ్ల కాళ్ల మీద పడి ప్రాధేయపడుతుంది. దీంతో చలపతి సరే తీసుకెళ్లమ్మా అని చెప్పగానే.. ఇందు సంతోషంగా థాంక్స్‌ చెప్తుంది. మాకు కావాల్సింది థాంక్స్‌ కాదమ్మ.. రాజు దుగ్గిరాల వారసుడు అని నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దని అలాగని నువ్వు నాకు మాటివ్వు అమ్మా అనగానే.. ఇందు సరే అంటూ మాటిస్తుంది. నేను మాటిస్తున్నాను అంకుల్‌ తను దుగ్గిరాల వారసుడు అని ఎవ్వరికీ చెప్పను అనగానే.. చలపతి థాంక్స్‌ చెప్తాడు. ఇంతలో నర్స్‌ బయటకు వచ్చి రాజు గారు స్పృహలోకి వచ్చారు. మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్పగానే.. ఇందు, చలపతి, లక్ష్మీ లోపలికి వెళ్తారు. ఇందు బాధగా ఇన్ని రోజులు నువ్వు నా పక్కన ఉన్నా నువ్వే నా బావ అని గుర్తు పట్టలేకపోయాను సారీ బావ అని మనసులో అనుకుంటుంది.

లక్ష్మీ, చలపతి ఇప్పుడెలా ఉంది రాజు అని అడుగుతారు. చలపతి ఏడుస్తూ.. రాజుకు సారీ చెప్తూ.. తనను చాలా తిట్టానని.. బాధపెట్టానని.. క్షమించమని అడుగుతుంటాడు.. అప్పుడే అపర్ణ ఫోన్‌ చేసి ఏమైంది రాత్రి ఇంటికి రాలేదు అని అడగ్గానే.. ఏమైంది నాన్నమ్మ అని ఇందు అడిగితే ఆ రేఖ.. రాజు గురించి ఏవేవో మాట్లాడుతుంది. రాజు గురించి ఇక మర్చిపోమ్మని చెప్తుంది అంటూ కంగారుపడుతుంటే. ఇందు తాను రాజు దగ్గరే ఉన్నానని రాజుకు ఏమీ కాలేదని అన్ని విషయాలు ఇంటికి వచ్చాక చెప్తానని కాల్‌ కట్‌ చేసి నాన్నమ్మ నీ గురించి చాలా టెన్షన్‌ పడుతుంది బావ అంటుంది. ఆ మాటలకు చలపతి, లక్ష్మీ షాక్‌ అవుతారు. రాజు ఏంటి బావనా..? అని అడగ్గానే.. ఇందు అంటే భర్తను బావ అనొచ్చు కదా..? అంతే కదా అంకుల్‌.. అనగానే.. చలపతి అవును అంటాడు. అయితే తనకు యాక్సిడెంట్‌ అయిన విషయం అమ్మమ్మకు తెలుసా..? అనగానే.. తెలియదు కానీ ఆ రేఖ ఏదేదో వాగిందట అంటూ చెప్తుంది ఇందు.

Advertisement

రేఖ రెడీ అవుతుంటే.. భ్రమరాంబ వెళ్లి రేఖ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. రేఖ సంతోషంగా ఆ రాజు గాడి ఇంటికి అని చెప్పగానే.. ఎందుకు అని భ్రమరాంబ అడిగితే ఆ రాజు గాడికి శ్రద్దాంజలి ఘటించడానికి అని చెప్పగానే.. భ్రమరాంబ అయోమయంగా అదేంటి రేఖ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే.. ఆ రాజు గాడు పోయాడు కదా..? వాడికి శ్రద్దాంజలి ఘటించడానికి వెళ్తున్నాను అంటూ చెప్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా..? వాడిని శాశ్వతంగా తప్పించేస్తానని అందుకే వాడి చాప్టర్‌ క్లోజ్‌ చేశాను అని చెప్పగానే.. భ్రమరాంబ అసలు ఎందుకు చంపేశావు వాడిని అంటూ అడగ్గానే.. వాడు ఆస్థిని మనక దక్కకుండా చేస్తున్నాడు.. అందుకే వాడిని చంపేశాను అని చెప్పగానే.. భ్రమరాంబ కోపంగా అసలు ముందు వెనక ఆలోచించకుండా ఇంత బుద్ది తక్కు వ పని ఎందుకు చేశావు.. వాళ్ల అమ్మానాన్న మనల్ని అనుమానిస్తే ఏం చేస్తావు.. అసలు ఈ పని నువ్వు పూర్తి స్పృహలో ఉండే చేశావా..? నిన్ను చూస్తుంటే.. నాకు ఏదో డౌటు వస్తుంది రేఖ అంటుంది.

దీంతో రేఖ ఏం జరగదు వదిన నా జాగ్రత్తలో నేను ఉన్నాను అంటూ వెళ్లిపోతుంది. వెనకే భ్రమరాంబ వెళ్తుంది. ఇద్దరూ కలిసి కిందకు వెళ్లి ఇందును పిలవమని స్వాతికి చెబితే ఇందు ఇంట్లో లేదని రాజు దగ్గరకు వెళ్లిపోయిందని అపర్ణ చెప్తుంది. దీంతో రేఖ, భ్రమరాంబ షాక్‌ అవుతారు. ఇందు, రాజు దగ్గరకు వెళ్లడం ఏంటని అడిగితే తన భర్తను తాను తీసుకొచ్చేందుకు వెళ్లిందని చెప్తుంది అపర్ణ. రేఖ, భ్రమరాంబ భయంతో బయటకు పరుగెత్తుకెళ్లి ఇందుకు కాల్‌ చేస్తారు. ఇందు కాల్‌ లిఫ్ట్‌ చేయదు. భ్రమరాంబ కోపంగా ఎందుకు ఇందు లిఫ్ట్‌ చేయడం లేదు అని అడగ్గానే.. ఆ రాజు గాడు చనిపోయి ఉంటాడు కదా..? అక్కడ ఏడుపులు అవి ఉంటాయి కదా అందుకే ఎత్తడం లేదు అంటూ తాను వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని వస్తానని రేఖ వెళ్లిపోతుంది.

Advertisement

రాజు ఇంటి ముందు కూర్చుని ఉంటే చలపతి కోపంగా చూస్తూ… ఓరేయ్‌ అటు నుంచి అటే మీ అత్తగారింటికి వెళ్తావు అనుకుంటే మళ్లీ ఇక్కడకు వచ్చావేంటి..? అని అడగ్గానే.. ఇది నా ఇల్లు నా ఇట్లోనే నేను ఉంటాను అంటూ రాజు చెబితే.. ఇది నీదో నాదో కాదు అద్దె ఇల్లు అనగానే.. అయితే నువ్వు మీ అత్తగారింటికి వెళ్లే ఆలోచన లేదంటావా..? అనగానే. ఆలోచన కాదు నా మనసు కూడా ఒప్పుకోవడం లేదు అంటాడు రాజు నీ మనసు ఒప్పుకునేలా నేను చేస్తాను కదా..? అంటూ ఇంట్లోంచి కాఫీ తీసుకుని ఇందు వస్తుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×