E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు తన వెంటే తీసుకెళ్తానన్న ఇందు  

Brahmamudi Serial Today Episode July 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు తన వెంటే తీసుకెళ్తానన్న ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode: రాజు కోసం హాస్పిటల్‌కు వచ్చిన ఇందును అక్కడి  నుంచి వెళ్లిపోమ్మని అంటాడు చలపతి. నువ్వు పెళ్లి చేసుకున్నావన్న కారణంతోనే రాజును ఇలా చేసింది ఆ రేఖ వాడు ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను చంపుకోమని.. నువ్వు వాడి జీవితంలోంచి తప్పుకోమ్మని బతిమాలుతుంటాడు.. వెళ్లిపో తల్లి వెళ్లిపో కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను వెళ్లిపో అంటూ ఏడుస్తుంటాడ చలపతి.. ఇందు అయోమయంగా అక్కడి నుంచి ఏడుస్తూ. బయటకు నడుస్తుంది.

కిచెన్‌లో వంట చేస్తున్న అపర్ణ దగ్గరకు వెళ్లిన రేఖ ఏంటి మీ మనవడు కానీ మనవడు రాజు గాడు ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయినా టెన్షన్‌ లేకుండా ఉన్నారు. నీ మహారాణి ఇందును వాడు కాపాడతాడన్న నమ్మకం ఉందా..? అలా కాపాడాలంటే ముందు వాడిని వాడు కాపాడుకోవాలి కదా..? అలా కాపాడాలి అంటే ముందు వాడు ఇక్కడికి రావాలి కదా..? రావాలి అంటే అసలు వాడు ఈ భూమ్మీద ఉండాలి కదా…? అంటూ చెప్పగానే.. అపర్ణ ఏంటి రేఖ ఏం మాట్లాడుతున్నావు.. రేఖ నోటికి వచ్చినట్టు మాట్లడకు ఎదుటి వాళ్ల అశుభం కోరుకుంటే ఏం వస్తుంది నీకు అంటూ తిడుతుంటే..

Advertisement

రేఖ ఆనందం వస్తుంది ఆంటీ.. ముఖ్యంగా ఆ రాజు గాడు సపోర్ట్‌గా ఉంటాడనుకున్నావు.. కానీ గతంలో వాడు ఇలా వచ్చి వెళ్లాడు అని మాట్లాడుకోవడం తప్ప  మీకున్న ఒకే ఒక్క ఆప్షన్‌ వాడిని మర్చిపోవడం అంటూ చెప్పి వెళ్లిపోతుంది. వెంటనే అపర్ణ ఈ దెయ్యం ముఖంది ఎందుకిలా మాట్లాడుతుంది. ఒకసారి రాజుకు ఫోన్‌ చేసి మాట్లాడదాం అనుకుంటూ రాజుకు ఫోన్‌ చేస్తుంది. స్విచ్చాప్‌ వస్తుందని ఇందుకు ఫోన్‌ చేస్తుంది. ఇందు హాస్పిటల్ లోనే ఒక మూలన కూర్చుని ఉంటుంది. అపర్ణ కాల్‌ చేయడం చూసి లిఫ్ట్‌ చేయదు. దీంతో అపర్ణ మరింత కంగారుపడుతుంది. ఇందు కూడా ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదేంటి అని భయపడుతుంది.

డాక్టర్‌ ఐసీయూలోంచి బయటకు వచ్చి చాలా బ్లడ్‌ పోయిందని.. ప్రమాదం నుంచి గట్టెకిస్తానని.. అబ్జర్వేషన్‌ లో ఉంచామని చెప్తాడు. ఇందు కూడా డాక్టర్‌ను కలిసి రాజును చూడోచ్చా అని అడుగుతుంది. అబ్జర్వేషన్‌ లో ఉంచామని.. రేపు ఉదయం వరకు ఏమీ చెప్పలేమని.. డాక్టర్‌ వెళ్లిపోతాడు. చలపతి కోపంగా ఇందును చూస్తూ.. మళ్లీ మా మధ్యలో నువ్వెందుకు వెళ్లిపోమ్మని చెప్పాను కదా అంటాడు.. లక్ష్మీ మాత్రం ఇందును ఉండనివ్వమని చలపతికి చెప్తూ.. ఇందును ఏమీ అనుకోవద్దమ్మా అంటుంది. అప్పుడే అక్కడే ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్లిన ఇందు ఏడుస్తూ.. నాకోసం ఒక బంధాన్ని తోడుగా ఉంచావు.. ఆ బంధాన్ని ఎందుకు మళ్లీ హాస్పిటల్‌ బెడ్‌ మీద ప్రాణాలతో పోరాడే పరిస్థితి తీసుకొచ్చావు.. మా నాన్నమ్మ తాతయ్య మొదటి నుంచి అంటూనే ఉన్నారు. కానీ నేనే మనుషులు పోలిన మనుషులు ఉంటారని చెప్పాను.. కానీ నువ్వే నా బావను పంపించావని నాకు ఇప్పుడే అర్థం అయింది స్వామి అంటూ ఇందు ఏడుస్తుంది. తన బావకు ఏమైనా అయితే మాత్రం తను భరించలేనని.. నా బావను నాకు దూరం చేయోద్దు స్వామి అంటూ వేడుకుంటుంది.

Advertisement

మరుసటి రోజు డాక్టర్‌ వచ్చి రాజుకు ప్రమాదం తప్పిందని కాలుకు దెబ్బ తగిలిందని.. వారం రోజులు రెస్ట్‌ తీసుకోవాలని చెప్తాడు. ఇప్పుడు రాజును చూడొచ్చా అని ఇందు అడిగితే వేరే రూంకు సిఫ్ట్‌ చేస్తున్నామని అప్పుడు చూడమని చెప్పి వెళ్లిపోతాడు. చలపతి కూడా ఇందును వెళ్లిపోమ్మని చెప్తాడు. ఇక నువ్వు వాడి జీవితంలోకి రాకు తల్లి అంటూ చెప్పగానే.. అది కుదరదు అంకుల్‌ తను నా బావ. నా బావను వదిలి నేను వెళ్లను.. నా బావను నాతో పాటే మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పగానే.. ఏంటమ్మా నువ్వు అర్థం చేసుకుంటావని నిజం చెబితే ఇలా మాట్లాడతావేంటమ్మా..? అనగానే.. అంకుల్‌ నీకు అర్థం కావడం లేదు.. నా బావ మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ రేఖ అటాక్‌ చేయించింది. అదే మా ఇంట్లో ఉంటే అలా చేసేది కాదు.. అంటూ ఇందు ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×