E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నిజం చెప్పిన చలపతి 

Brahmamudi Serial Today Episode July 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నిజం చెప్పిన చలపతి 
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ దగ్గరకు వెళ్లిన రాజు సాయంత్రం నాలుగు గంటల వరకు మీ అమ్మే నీకు కాల్‌ చేసి పిలుస్తుంది అంటూ చెప్పగానే.. లక్కీ హ్యాపీగా ఫీలవుతాడు. మా అమ్మా ఎక్కడుంది..? ఏం చేస్తుంది..? ఎలా ఉంటుంది అంటూ ఎగ్జైంటింగ్‌గా అడుగుతాడు. రాజు మాత్రం సాయంత్రం వరకు ఆగమని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రేఖ రాజు మాటలే గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజు ఫోన్‌ చేసి ఏంటి పిన్ని ఏం ఆలోచించావు.. అవతల నీ కొడుకుకి నీ గురించి చెప్పేశాను.. మీ అమ్మ దొరికిందిరా అని చెప్పగానే వాడి కళ్లల్లో ఆనందం చూడాలి కదా అంటూ చెప్తుండగానే..

రేఖ అంటే నా గురించి పూర్తిగా నిజం చెప్పేశావా..? అని అడుగుతుంది. లేదని.. నీ పేరు ఇంకా చెప్పలేదని.. కానీ సాయంత్ర వరకు మీ అమ్మే నీకు కాల్ చేస్తుందిరా అని చెప్పాను.. ఒకవేళ నువ్వు వాడికి నిజం చెప్పకపోయినా.. నువ్వు వాడికి కాల్‌ చేయకపోయినా…? నేనే సరాసరి వాడిని ఇంటికి తీసుకొస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తూ.. కాల్‌ కట్‌ చేస్తాడు రాజు. రేఖ ఆలోచిస్తూ.. ఉంటే అప్పుడే భ్రమరాంబ, ఐశ్వర్య వస్తారు. భ్రమరాంబ కోపంగా రేఖ అసలు నీకు ఏమైంది..? ఎందుకు పరధ్యానంలో ఉంటున్నావు ఆ నందు అలా రెచ్చిపోతుంటే నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావు.. అంత జరుగుతున్నా కూడా ఏమీ పట్టన్నట్టు అలా వచ్చేస్తావేంటి..? అని అడగ్గానే.. రేఖ కోపంగా ఇప్పుడు నేను అదంతా ఆలోచించడం లేదు.. ఆలోచించాల్సిన టైం కూడా నాక లేదు అనగానే.. ఐశ్వర్య నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఆంటీ..?  ఆ రాజు గాడి గురించే కదా..? అనగానే.. భ్రమరాంబ వాడి గురించా వాడి గురించి ఎందుకు ఆలోచిస్తుంది అనగానే..

Advertisement

ఎందుకంటే ఆ నందు ఇంటికి రావడానికి కారణం ఆ రాజు గాడే కదా..? వాడే ప్లాన్‌ చేసి మరీ దాన్ని ఇక్కడికి పంపించాడు.. వాడు అనుకున్నట్టుగానే.. ఆస్థి ఆంటీకి దక్కకుండా చేశాడు. అంటూ చెప్పగానే.. భ్రమరాంబ కోపంగా చూశావా..? రేఖ ఆ రాజుగాడు, నందు కలిశాడంటే.. ఇక మన ఆటలు సాగుతాయా..? అంటూ చెప్తుంటే.. రేఖ కోపంగా అందుకే ఆ రాజు గాడికి ఈరోజు పులిస్టాప్‌ పెట్టబోతున్నాను.. వాడు ఈ రేఖకు ఇంకెప్పుడు ఎదురు రాకుండా చూస్తాను అని చెప్పగానే.. అదే ఎలా చేస్తావు.. రేఖ అంటూ భ్రమరాంబ అడిగితే వాడికి చావు భయం ఎలా ఉంటుందో చూపించబోతున్నాను.. మరికొద్దిసేపట్లో రాజు అనే వాడు లేట్‌ రాజు అయినా ఆశ్చర్యం లేదు. ఈరోజుతో రాజు గాడి చాప్టర్‌ క్లోజ్‌ ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంటే..

డోర్‌ దగ్గర నుంచి స్వాతి మొత్తం విని భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఇందుకు చెప్తుంది. ఇందు షాక్‌ అవుతుంది. వెంటనే ఇందు రాజుకు ఫోన్‌ చేస్తుంది. రాజు మాత్రం లక్కీతో మాట్లాడుతుంటాడు. ఇందు టెన్షన్‌ పడుతుంది. వెంటనే చలపతికి కాల్‌ చేస్తుంది ఇందు. స్వాతి చెప్పింది మొత్తం చలపతికి చెప్పి వెంటనే రాజుకు ఫోన్‌ చేయమని చెప్పి స్వాతికి చెప్పి రాజు కోసం వెళ్లిపోతుంది. చలపతి ఫోన్‌ చేసినా రాజు లిఫ్ట్‌ చేయడు.. దీంతో చలపతి, లక్ష్మీ కంగారుగా రాజును కాపాడుకోవాలని ఇంటి నుంచి బయలుదేరుతారు. మరోవైపు రేఖ ఏర్పాటు చేసిన కిరాయిరౌడీ లారీతో వెళ్లి రాజును గుద్దేస్తాడు. రాజు కింద పడిపోయి గిలాగిలా కొట్టుకుంటుంటే.. లారీని పక్కకు తీసుకెళ్లి ఆపి వెళ్లి రౌడీ మళ్లీ రేఖకు ఫోన్‌ చేసి రాజును చంపేశానని చెప్తాడు. రేఖ హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

కట్‌ చేస్తే.. రాజు ఐసీయూలో ఉంటాడు.. డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేస్తుంటారు. చలపతి, లక్ష్మీ ఐసీయూ బయట నిలబడి ఏడుస్తుంటారు. అప్పుడే ఇందు హాస్పిటల్‌కు వస్తుంది. ఏడుస్తూ.. రాజును చూడాలని ఐసీయూలోకి వెళ్లబోతుంటే.. చలపతి ఆపేసి ఇందును తిడతాడు. మీ వల్లే వాడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడని లక్ష్మీ తిడుతుంది. చలపతి, లక్ష్మీ తనను తిడుతుంటే.. ఇందు ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటే ఆ రేఖ ఇంకా ఏం చేస్తుందో.. నువ్వు ఇక్కడుండొద్దు వెళ్లిపో అంటూ చెప్తారు. ఇందు ఏడుస్తూ.. లేదు అంకుల్‌ నేను ఇక్కడే ఉంటాను.. నేను రాజును చూడాలి అంటూ ఏడుస్తుంటే.. చలపతి వద్దు నువ్వు ఇక్కడుందొద్దు వాడు నీ మొగుడు అనే కోపంతోనే ఆ రేఖ ఇలా చేసింది అదే వాడు దుగ్గిరాల ఇంటి వారసుడు అని తెలిస్తే.. వాణ్ని అసలు ప్రాణాలతో ఉండనివ్వదు అంటూ చలపతి నిజం చెప్పేస్తాడు.

ఆ మాటలకు ఇందు షాక్‌ అవుతుంది. అంకుల్‌ ఏం మాట్లాడుతున్నారు మీరు.. అని అడగ్గానే.. చలపతి అవును వాడు దుగ్గిరాల వారసుడు వాడు మీ నాన్న గారి అక్క కొడుకు నీకు స్వయానా బావ.. వాడు మా కన్న కొడుకు కాదు.. మేము పెంచుకున్న కొడుకు  అంటూ చెప్పగానే.. ఇందు షాకింగ్‌గా చూస్తుంది. బావ అంటూ ఐసీయూలో ఉన్న రాజును చూస్తూ.. మరైతే మా బావ మీ కొడుకుగా ఎలా పెరిగాడు అంటూ అడగ్గానే.. చలపతి ప్లాష్‌బ్యాక్‌ మొత్తం చెప్పి రాజునే దుగ్గిరాల వారసుడు అని తెలిస్తే కచ్చితంగా బతకనివ్వదు.. అంటూ ఏడుస్తుంటాడు చలపతి.. వాడు ప్రాణాలతో ఉండాలంటే.. నీ ప్రేమను చంపుకుని వెళ్లిపో అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×