E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Brahmamudi Serial Today January 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement

Brahmamudi serial today Episode:

రుద్రాణి తన కడుపులో బిడ్డను చంపాలనుకుందని కావ్య బాధపడుతుంది. రాజ్‌ ఓదారుస్తుంటాడు. కళావతి ఇన్ని రోజులు తను ఎన్ని తప్పులు చేసినా..? నీ మీద ఎంత కక్ష్య గట్టినా  తన గుణం అంతే అని సరిపెట్టుకున్నాం. ఏదో ఒకరోజు మారుతుందిలే అని పట్టించుకోలేద కళావతి కానీ ఈరోజు ఇంతకీ తెగిస్తుందనుకోలేదు.. అంటాడు రాజ్‌. ఆవిడకు మనం ఏం పాపం చేశామండి ఆవిడకు ఏ ద్రోహం చేశామని ఇంతకు పూనుకుంది. సమయానికి మా అమ్మ కానీ చూసి ఉండకపోతే ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డ ఏమైపోయేది. మన బిడ్డను కాపాడునేందుకు నేను నన్ను కాపాడుకోవాలని మీరు పడ్డ కష్టం భరించిన ఆవేదన అంతా గంగపాలు అయిపోయేది కదా..? ఇన్నేళ్ల నా నిరీక్షణ బిడ్డను కళ్లారా చూసుకోవాలన్న కళ అదంతా చెదిరిపోవడమే కాదండి మన బిడ్డ ముఖం మీద మనమే మట్టి వేసుకునే పరిస్థితి వచ్చేది అంటూ ఏడుస్తుంటే.. రాజ్‌ బాధగా కళావతి వద్దు కళావతి అలాంటి అపశకునపు మాటలు మాట్లాడొద్దు నేను భరించలేను అంటాడు రాజ్‌.

ఏ ఆడదైనా.. ఏ తల్లైనా..? తన బిడ్డను మోయడానికి కనడానికి యుద్దం చేస్తుందండి.. కానీ నేను నా బిడ్డను బతికించుకోవడానికి ఈ ప్రపంచానికి చూపించడానికి పోరాటం చేయాల్సి వస్తుంది కదండి.. నేను ఎంత దురదృష్టవంతురాలినండి.. అంటూ ఏడుస్తుంటే.. లేదు కళావతి నువ్వు దురదృష్టవంతురాలివి కాదు అదృష్టవంతురాలివి అందుకే తల్లి దక్కితే బిడ్డ దక్కదు.. బిడ్డ దక్కితే తల్లి దక్కదు అనే భయంలోంచి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అన్న ఆనందంలోకి వచ్చామంటే ఇది మన అదృష్టం కాదా..? రుద్రాణి లాంటి చీడపురుగులు అంత కుట్ర చేసినా ఈ క్షణం కూడా నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉందంటే ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కలావతి నీకు బిడ్డను దూరం చేయడం అని చెప్పగానే… ఏవండి ఏం అంటున్నారండి మీరు అని కావ్య అడగ్గానే..

Advertisement

అవును ఈ పాటికే నీకు బిడ్డ దూరం అయిపోయేది. కానీ చివరి క్షణంలో ఆ విషయం మనకు తెలిసేలా చేశాడంటే..  ఆ దేవుడు మన బిడ్డను కాపాడాలి అనుకున్నట్టే కదా..? ఆ దేవుడు మనకు అండగా ఉండగా మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కళావతి నువ్వు బాధపడొద్దు.. భయపడొద్దు.. ఇక నుంచి మన బిడ్డ విషయంలో ఇంకెంచెం జాగ్రత్తగా ఉండటానికి ఇదో హెచ్చరిక మనకు అని రాజ్‌ చెప్పగానే.. కావ్య ఏడుస్తూనే.. లేదండి మీరు నాకు ధైర్యం చెప్పడానికి మీరు నన్ను ఎంత కన్వీన్స్‌ చేసినా..? నాలో కంగారు తగ్గడం లేదండి.. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మన బిడ్డ క్షేమం కోరుకునేవారే.. నా బిడ్డ ఈ ప్రపంచం చూడాలని కలలు కన్నారు. కానీ ఇందరి మంచి మనుషుల మధ్య నుంచి ఒకరి రాక్షసత్వం బయటపడిందంటే మన బిడ్డ ఎంత ప్రమాదంలో ఉందో ఊహించుకుంటేనే భయం వేస్తుందండి అంటుంది కావ్య.. దీంతో రాజ్‌ ఆ రాక్షసత్వానికి అవకాశం లేకుండా ఇంట్లో నుంచి పంపించేశాం కదా కళావతి.. నీకు ఏ భయం అక్కర్లేదు.. అని చెప్పగానే.. అలా అనకండి కళ్ల ముందు ఉంటేనే ఇంత కర్కషంగా మారారు.. ఇక ఇక ముందు ముందు మన బిడ్డకు ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందోనని నాకు తలుచుకుంటేనే భయం వేస్తుందండి అనగానే..

రాజ్‌ భరోసా ఇస్తూ.. కళావతి ఏంటిది ఎప్పుడూ లేనిది నేనున్నాను కదా..? ఏ చెడు నీడ కూడా నీ మీద పడనివ్వను.. అయినా ఇంకెన్ని రోజులు రెండు నెలలే కదా..? బంగారం లాంటి బిడ్డకు నువ్వు జన్మనిస్తావు.. నువ్వేం టెన్షన్‌ పడకు కూల్‌గా ఉండు.. అని చెప్పగానే.. కావ్య ఏడుస్తూనే ఏవండి మీరు నాకో మాట ఇస్తారా..? అని అడుగుతుంది. ఏంటి కలావతి ఏంటో చెప్పు.. అని అడగ్గానే.. దీంతో కావ్య భయంగా దేవాలయం లాంటి ఈ ఇంట్లోనే భద్రత లేనప్పుడు హాస్పిటల్‌ లో భద్రత ఉంటుందని నాకు అనిపించడం లేదండి.. నాకు ఎవ్వరినీ నమ్మాలి అనిపించడం లేదు.. నా డెలివరీ టైంలో మీరు నా పక్కనే ఉండాలి అని అడుగుతుంది. నీ పక్కనే ఉంటాను కళావతి అంటూ రాజ్‌ కావ్యకు మాటిస్తాడు.

Advertisement

తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉండగా పోలీసులు వచ్చి రాజ్‌ దొంగ వ్యాపారం చేస్తున్నాడని అందుకే అరెస్ట్‌ చేయడానికి వచ్చామని చెప్తారు. శాండీ దగ్గర స్మగుల్‌ గోల్డ్‌ కొన్నారని చెప్తారు. అందరూ షాక్‌ అవుతారు. రాహుల్‌, రేఖ హ్యాపీగా చూస్తుంటారు. పోలీసులు ఇల్లంతా చెక్‌ చేస్తారు తర్వాత రాజ్‌ కారును చెక్‌ చేయగా అందులో రాహుల్‌ పెట్టిన స్మగుల్‌ గోల్డ్‌ బ్రీప్‌కేస్‌ దొరుకుతుంది. దీంతో పోలీసులు రాజ్‌ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×