E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య చేత మందు కలిపిన కషాయం తాగించిన రాజ్

Brahmamudi Serial Today January 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య చేత మందు కలిపిన కషాయం తాగించిన రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:

కావ్య, అప్పు బాగా ఎంటర్టైనర్‌ అయ్యేలా గేమ్‌ ప్లాన్‌ చేస్తారు కళ్యాణ్‌, రాజ్‌. కొన్ని చీటీలు రాసి అందులో ఏం వస్తుందో అది చేయాలని అందరికి చెప్తారు. అందరూ సరే అంటారు. ముందు ఎవరితో మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ.. ఆ తాతయ్య ముందు మీరే తీయండి అంటూ రాజ్ సీతారామయ్య దగ్గరకు వెళ్తాడు. ఆయన చీటీ తీయగానే.. అది చూసి రాజ్‌ ఆ మంచి పద్యం పాడాలి తాతయ్య అంటూ చెప్పగానే.. సీతారామయ్య వెళ్లి పద్యం పాడతాడు. ప్రకాష్‌ నాన్న నువ్వు సూపర్‌ అంటాడు. రాజ్‌ కూడా సూపర్‌ తాతయ్యా.. సూపర్‌ అంటుంటే రేఖ వచ్చి రాజ్‌ భుజాల మీద చేయి వేస్తుంది. కావ్య గుర్రుగా చూస్తుంది. రాజ్‌ తప్పించుకుని కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లి అరేయ్‌ ఇప్పుడు ఎవరితో తీయిద్దాం అని అడుగుతాడు. మా అమ్మా నాన్నలతో తీయిద్దాం అన్నయ్య అంటాడు కళ్యాణ్‌.

బాబాయ్‌, పిన్ని వచ్చేయండి కమాన్‌.. బాబాయ్‌ ముందు నువ్వు తీస్తావా..? పిన్ని తీస్తుందా..? అని అడగ్గానే.. ప్రకాష్‌ మీ పిన్నిని తీయమను అని చెప్తాడు. ధాన్యలక్ష్మీ చీటీ తీస్తుంది. ఇద్దరు కలిసి డాన్స్‌ చేయాలని వస్తుంది. అదే విషయం వాళ్లకు చెబితే ఇద్దరు కలిసి డాన్స్‌ చేస్తుంటారు. కావ్య, రాజ్‌ను ఏవండి మీరు ఇటు రండి నా పక్కకు అంటూ పిలుస్తుంది. రాజ్‌ సరే అంటూ కావ్య పక్కకు వెళ్తాడు. ధాన్యలక్ష్మీ, ప్రకాష్‌ డాన్స్‌ అయిపోయాక కళ్యాన్‌ వెళ్లి నెక్ట్స్‌ ఎవరు అన్నయ్యా అని అడుగుతాడు. నెక్స్ట్‌ రాహుల్‌, స్వప్న అని రాజ్‌ చెప్తాడు.  రాహుల్‌, స్వప్న రండి రండి అని రాజ్‌ పిలవగానే వెళ్తారు. మీ ఇద్దరిలో ఎవరు తీస్తారు అని రాజ్‌ అడగ్గానే.. స్వప్న తీస్తుంది అని రాహుల్‌ చెప్తాడు. స్వప్న తీస్తుంది. అందులో డమ్స్‌ యాక్ట్‌ అని రావడంతో రాహుల్‌, స్వప్న ఆ గేమ్‌ అడతారు. తర్వాత కళ్యాణ్‌ నెక్స్ట్‌ ఎవరిని పిలుద్దాం అని రాజ్‌ అడగ్గానే.. నెక్స్ట్‌ అత్తను పిలుద్దాం అంటాడు కళ్యాణ్‌.

Advertisement

రాజ్‌ రుద్రాణిని పిలిచి చీటీ తీయిస్తాడు. అందులో బాలయ్య బాబు డైలాగ్‌ చెప్పాలని వస్తుంది. రుద్రాణి డైలాగ్‌ చెప్పగానే.. ఇంద్రాదేవి దడుసుకున్నట్టు వీపు చరుచుకుని అదేంటే అలా భయపెట్టి చచ్చావు.. దడుసుకున్నాను.. అనగానే.. ఎలా ఉంది నా డైలాగ్‌.. అంటుంది రుద్రాణి.. దీంతో ధాన్యలక్ష్మీ బాలయ్య బాబు చెబితే ఓల్టేజీలా ఉంటుంది. నువ్వు చెబితే డ్రైనేజీలా ఉంది అంటుంది. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి మెచ్చుకున్నట్టు చప్పట్లు కొట్టండి అంటాడు. ఇంతలో రాజ్‌ వచ్చి నెక్స్ట్‌ ఎవరు..? అరే కళ్యాణ్‌ నువ్వు తీయరా..? అంటాడు. కళ్యాణ్‌ చీటీ తీస్తాడు. వీళ్లకు కూడా డమ్‌ అండ్‌ యాక్టింగ్‌ వస్తుంది. రాజ్‌, కళ్యాణ్‌ చెవిలో సినిమా పేరు చెప్తాడు. కళ్యాణ్‌ యాక్టింగ్‌ చేస్తుంటే.. అప్పు సినిమా పేరు గెస్‌ చేస్తుంది. రాజ్‌ వెళ్లి ఏంటి ఇంత ఈజీగా గెస్‌ చేశారు అని అడగ్గానే.. సూపర్‌ కపుల్స్‌ అన్నయ్య మేము అంటాడు కళ్యాణ్‌.. సరే కానీ నెక్స్‌ ఎవరిని పిలుద్దాం అంటాడు రాజ్‌.. అత్తాకోడళ్లను పిలుద్దామా అంటాడు రాజ్‌. సరే అంటూ అపర్ణ, ఇంద్రాదేవిని పిలుస్తారు.

ఇద్దరూ వెళ్లి చీటీ తీయగానే.. ఇద్దరూ కలిసి ఫర్మామెన్స్‌ చేయాలి అని చెప్తూ.. అవును కళావతి నువ్వు కషాయం కలిపావా..? అని అడగ్గానే.. లేదు తాగలేదు అని చెప్తుంది కావ్య.. అయితే నువ్వు కషాయం తాగే టైం ఇది ఉండు నేను వెళ్లి తీసుకొస్తాను అంటూ రాజ్‌ వెళ్తాడు. అప్పుడే రాహుల్‌ కూడా మమ్మీ రాజ్‌ కారు కీ తీసుకురావడానికి ఇదే కరెక్ట్‌ టైం అని రుద్రాణికి చెవిలో చెప్తాడు. అయితే వెళ్లి తీసుకురాపో అంటుంది రుద్రాణి. రాహుల్‌ వెళ్తాడు. అపర్ణ, ఇంద్రాదేవి యాక్టింగ్‌ చేస్తుంటారు. ఇంతలో రాజ్‌ కషాయం తీసుకొచ్చి కావ్యకు తాగమని ఇస్తాడు. కావ్య కషాయం తాగుతుంది. మరోవైపు రాహుల్‌ వెళ్లి రాజ్‌ కారు కీ తీసుకొస్తాడు. ఇంతలో రేఖ చీటీ తీస్తుంది. అందులో డాన్స్‌ చేయాలని వస్తుంది. అయితే నేను ఒక్కదాన్నే చేయలేనని రాజ్‌ను కూడా తనతో చేయమని అడుగుతుంది. రాజ్‌ సరేనని ఇద్దరూ కలిసి  డాన్స్‌ చేస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×