E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డేంజర్ లో పాప – అయోమయంలో కావ్య

Brahmamudi Serial Today January 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డేంజర్ లో పాప – అయోమయంలో కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:

హాల్లో రిపోర్ట్‌ చూసి తన పాప కోసం తానే వెతుకుతానని ఈ పాపను ఎప్పటికీ నా పాప అని ఒప్పుకోనని చెప్పి రూంలోకి వెళ్తుంది కావ్య. దేవుడి ముందు నిలబడి తన బాధ చెప్పుకున్న కావ్యకు కొద్దిసేపటికి పాప నోట్లోంచి నురగ రావడం చూస్తుంది. కంగారుగా బయట హాల్లోకి కంగారు పరుగెత్తుకుంటూ వెళ్లి పాప కండీషన్‌ గురించి చెప్తుంది. అందరూ కంగారు పడుతుంటారు. వెంటనే హాస్పిటల్‌కు పాపను తీసుకెళ్తారు. హాస్పిటల్‌లో పాపను చూసిన డాక్టర్‌ చక్రవర్తి టెన్షన్‌ పడతాడు. పాప బాడీ రంగు మారిందని ఇలా మారడం చాలా డేంజర్‌ అని చెప్పి టెస్టులు చేయమని నర్సుకు చెప్తాడు. నర్సు సరే అంటుంది. పాపను ల్యాబ్‌లోకి తీసుకెళ్తారు. ఇక కావ్య ఏడుస్తూ.. పాపని నేనేం చేయలేదు.. ఉన్నట్లుండి ఇలా అయిపోయింది అంటూ ఏడుస్తుంది.

దీంతో రాజ్‌, కావ్యను ఓదారుస్తాడు. నీ గురించి మాకు తెలియదా కళావతి నీకు పాప నచ్చకపోయినా అలాంటి పనులు చేసేదానివి కాదని నాకు తెలుసు.. అంటాడు. ఇంతలో డాక్టర్‌ వచ్చి పాపకు ట్రీట్‌మెంట్‌ చేశాము ఇప్పుడు పర్వాలేదు.. రిపోర్ట్స్‌ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తాడు. దీంతో కావ్య మరింత బాధపడుతుంది. ఏ తల్లి కన్నబిడ్డో నా చేతుల్లో నీకు ఈ పరిస్ధితి వచ్చింది.. నిన్ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లికి దూరం అయ్యావు.. ఈ పాప తన కన్నతల్లి ఒడిలో ఉండుంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదు అంటూ చెప్తుంటుంది. మరోవైపు పాప రిపోర్ట్స్‌ వచ్చాయని నర్సు తీసుకెళ్లి డాక్టర్‌ చక్రవర్తికి ఇస్తుంది. డాక్టర్‌ రిపోర్ట్స్‌ చూసి షాక్‌ అవుతాడు. ఈ రిపోర్ట్స్ ఆ పాపవేనా? అంటూ డాక్టర్‌ అడుగుతాడు. నర్సు అవునని చెప్పగానే.. డాక్టర్‌ కు ధర్మేంద్ర తనతో బిడ్డల్ని మార్చమని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. డాక్టర్‌ నా భార్య పరిస్థితి చాలా డేంజర్‌లో ఉంది. పాప ఇలా పుట్టిందని తెలిస్తే నా తులసి నాకు దక్కదు ఫ్లీజ్‌ మీరే ఎలాగైనా నాకు హెల్ప్‌ చేయాలి.. అని అడుగుతాడు.

Advertisement

దీంతో డాక్టర్‌ చక్రవర్తి మేం చేసేదంతా చేస్తాము సార్‌.. అంతకు మించి మేమేమీ చేయలేము కదా అని చెప్పగానే.. మీరు చేయగలరు డాక్టర్‌.. అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నా సంతోషం, నా భార్య సంతోషం, నా కుటుంబ సంతోషం అంతా మీ చేతుల్లోనే ఉంది డాక్టర్‌.. ఫ్లీజ్‌ మీరే హెల్ప్‌ చేయాలి.. ఎలాగైనా ఆ బిడ్డను మార్చండి డాక్టర్‌ అని ధర్మేంద్ర చెప్పగానే.. డాక్టర్‌ చక్రవర్తి అందుకు ఒప్పుకోడు.. అనారోగ్యంతో ఉన్న మీ పాపని తీసుకెళ్లి మరో తల్లికిస్తే.. ఆ తర్వాత ఆ పాప చనిపోతే ఆ తల్లి పరిస్ధితి ఏంటీ?  అందరు పేషెంట్స్‌ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే.. నేను నా వృత్తికి ద్రోహం చేయలేను.. ఇప్పుడే వెళ్లి మీ వైఫ్‌కి చెప్పాల్సిన విధంగా చెబితే ఆమె వింటారు అని చెప్పగానే.. దర్మేంద్ర హాస్పిటల్‌లో ఈ నిజం ఎంత మందికి తెలుసు అని అడగ్గానే.. నాకు మన హెడ్‌ నర్స్‌ నీలవేణికి మాత్రమే తెలుసు అని చెప్పడం డాక్టర్‌ గుర్తు చేసుకుని కంగారుగా లేచి మినిస్టర్‌ దగ్గరకు వెళ్తుంటాడు. డాక్టర్‌కు ఎదురుగా వెళ్లిన రాజ్‌, కావ్య పాప పరిస్థితి ఎలా ఉందని అడుగుతారు. ఇంకా కొన్ని రిపోర్ట్‌ వచ్చేది ఉందని అవి వచ్చాక చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోసారి మినిస్టర్‌ ఇంటికి వెళ్లిన రుద్రాణిని చూసి తులసి అనుమానపడుతుంది. దగ్గరకు వెళ్లి ఎందుకు మీరు ఈ మధ్య తరచుగా మా ఇంటికి వస్తున్నారు.. అసలు మీరెవరు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రుద్రాణి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని మనసులో అనుకుని నేను మినిస్టర్‌ గారి పార్టీలోనే పని చేస్తాను. ఈ మధ్య మినిస్టర్‌ గారు ఒక ఫ్రాడ్‌ కేసులో ఇరుక్కుంటే ఆయనను ఆ కేసు నుంచి సేవ్‌ చేశాను. దాని గురించి మాట్లాడటానికే ఇంటికి వస్తున్నాను అని చెప్తుంది. దీంతో తులసి సరే అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో చక్రవర్తి వచ్చి దర్మేంద్రతో గొడవ పడతాడు. ఇప్పుడే వెళ్లి మీ వైఫ్‌ తులసికి నిజం చెప్తాను అని లోపలికి వెళ్తుంటే దర్మేంద్ర తన మనుషులతో డాక్టర్‌ను కిడ్నాప్‌ చేయించి హాస్పిటల్‌కు ఫోన్‌ చేసి డీన్‌ వారం రోజులు సెలవు పెట్టారని ఆయన బాధ్యతలు అనురాధను చూసుకోమని చెప్తాడు. అయితే ఇక్కడ వీడిని కిడ్నాప్‌ చేశావు కానీ హాస్పిటల్‌ లో కావ్య, రాజ్‌లను ఎలా ఆపుతావు అని రుద్రాణి అడుగుతుంది.

Advertisement

మరోవైపు అనురాధ పాప రిపోర్ట్స్‌ చూసి రాజ్‌, కావ్యలకు నిజం చెప్తుంది. దీంతో రాజ్‌, కావ్య షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×