E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఆస్తులు తాకట్టు పెట్టిన కావ్య – నిజం బయటపెట్టిన రుద్రాణి

Brahmamudi Serial Today January 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఆస్తులు తాకట్టు పెట్టిన కావ్య – నిజం బయటపెట్టిన రుద్రాణి
Advertisement

Brahmamudi serial today Episode: ఓపిగా నువ్వు చేస్తున్న పనికి మేడం సార్‌ మేడం అనాల్సిందే అంటూ పొగుడుతాడు. దీంతో కావ్య భయపడుతుంది. మీరు తిట్టినా సరే కానీ పొగిడితేనే నాకు భయం వేస్తుంది. అంటుంది. దీంతో నిన్ను పొగిడినా.. కష్టమే.. తిట్టినా కష్టమే అంటాడు రాజ్‌. ఇంతలో కావ్య చీర కొంగు టేబుల్‌కు పట్టుకుని ఉంటే రాజ్‌ పట్టుకున్నాడనుకుని కావ్య సిగ్గు పడుతుంది. ఇంతలో నంద ఆచూకీ తెలిసిందని ఎస్సై ఫోన్‌ చేసి చెప్తాడు. అడ్రస్‌ పంపిస్తున్నాను.. నువ్వు వచ్చేయ్‌.. నేను వస్తున్నాను అని చెప్తాడు.

సరేనని కావ్యకు చెప్పి ఇద్దరూ త్వరగా రెడీ అయి కిందకు వస్తారు. కింద స్టాంప్‌ పేపర్స్‌ తో రెడీగా ఉన్న ధాన్యలక్ష్మీ కోపంగా ఆగండి అని అరుస్తుంది. ఎందుకు ఆగాలి అని ఇందిరాదేవి అడుగుతుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో ఇందిరాదేవి ఏం జరుగుతుంది రోజుకో పంచాయితి జరుగుతుంది అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా అంతే కోపంగా ఆ పంచాయితీలే ఎందుకు జరుగుతున్నాయి. ఏ రుజువులు లేకుండా మీ మనవరాలు చేసే అరాచకాల వల్లే కదా అంటుంది. ఇంతలో రాజ్‌ పిన్ని మేము అర్జెంట్‌ గా వెళ్లాలి.. అంటాడు. కావ్య కూడా చిన్నత్తయ్యా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఏవండి పదండి అని వెళ్లబోతుంటే… ధాన్యలక్ష్మీ నాకు సమాధానం చెప్పి వెళ్లాలి అంటుంది. దీంతో ఇందిరాదేవి ఇవాళ ఏమైంది నీకు అంటూ ప్రశ్నిస్తుంది. ధాన్యలక్ష్మీ నాకు ఒక దారుణమైన నిజం తెలిసింది అని చెప్తుంది.

Advertisement

ఏంటా దారుణమైన నిజం అంటూ సుభాష్‌ అడగ్గానే.. తన చేతిలోని స్టాంప్‌ పేపర్స్‌ చూపిస్తూ  మీరే చూడండి బావగారు అంటూ ఇస్తుంది. త్వరగా చూడండి లేదంటే అవి కూడా మాయం కావోచ్చు అంటుంది రుద్రాణి. దీంతో రుద్రాణిని స్వప్న తిడుతుంది.  మీ కోడలు సమర్థురాలు అని మామయ్యగారు ఆస్తి మొత్తం ఆవిడ చేతుల్లో పెడితే చివరికి ఏం చేసింది అంటూ నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. రుద్రాణి మాత్రం ఏం చేసిందని వాళ్లను అడిగితే వాళ్లేం చెప్తారు ధాన్యలక్ష్మీ నువ్వే చెప్పు అంటుంది. బావగారు చదివారు కదా..? చెప్పండి.. ఓ మీ కోడలు మంచిదని మీరు మాట్లాడలేకపోతున్నారా..? పది కోట్ల కోసం పరువు ప్రతిష్టలు మర్చిపోయి దుగ్గిరాల గెస్ట్‌ హౌస్‌ ను తాకట్టుపెట్టింది అని ధాన్యలక్ష్మీ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఏంటలా అందరూ తెల్లబోయి చూస్తున్నారు. ఈ రహస్యం మాకెలా తెలిసిందనా..? అంటూ రుద్రాణి అనగానే.. అలాంటి డౌట్లు ఏమీ లేవని.. నీ కొడుకు ఉన్నాడు.. ఇలాంటి రహస్యాలు అన్ని వెలికి తీసి ఇంట్లో చిచ్చు పెట్టడం మీకు అలవాటేగా అంటుంది స్వప్న.

ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని పదికోట్లకు గెస్ట్ హౌస్‌ ను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అని ధాన్యలక్ష్మీ నిలదీయడంతో ఇందిరాదేవి వెళ్లి ఓరేయ్‌ నీకు ఈ విషయం నీకు తెలుసా..? అని అడుగుతుంది. రాజ్‌ తెలుసు అని చెప్తాడు. నాకు తెలియకుండా కావ్య ఏ పని చేయదు అంటాడు. దీంతో ఇందిరాదేవి కూల్‌గా ఏదో అవసరం వచ్చి తాకట్టుపెట్టి ఉంటారు దానికింత రాదాంతం చేయాలా అంటుంది. దీంతో రుద్రాణి అంత ఈజీగా తీసేశావేంటి అంటుంది. దీంతో రుద్రాణి ఈ విషయాలు అడిగే హక్కు నీకు లేదు అంటుంది. అయితే మాకుంది కదా అత్తయ్యా అంటూ మధ్యలో అడుగుతుంది ధాన్యలక్ష్మీ.. అందరూ ఎందుకు కుదువపెట్టారని అడగ్గానే.. రాజ్‌.. ఇప్పుడు మేము అర్జెంట్‌  పని మీద వెళ్తున్నాం సాయంత్రం ఇంటికి వచ్చాక తీరిగ్గా అంతా చెప్తామని అనగానే.. కావ్య కూడా ఆవిడతో మనకు మాటలేంటండి మనం వెళ్తాం పద అంటుంది. ఇద్దరూ వెళ్లిపోతారు.    అసలు వీళ్లకు ఆ డాక్యుమెంట్స్‌ ఎలా వచ్చాయి అని స్వప్న నిలదీస్తుంది. రాజ్‌, కావ్యల వెనక గుంతలు తీస్తుందెవరు అంటుంది. దీంతో రుద్రాణి, రాహుల్‌ షాక్‌ అవుతారు.

Advertisement

రాజ్‌, కావ్యలు కలిసి నంద ఉన్న ప్లేస్‌కు వెళ్తారు. నందను తిడుతూ.. నిన్ను ఈ రోజు పట్టుకెళ్లి పోలీసులకు అప్పజెప్తాను అంటారు. దీంతో నంద తన మనుషులకు రాజ్‌ను చంపేసి నాకు మందులోకి సోడా తీసుకురండి అని చెప్తాడు. దీంతో రౌడీలు రాజ్‌ను కొట్టబోతుంటే.. కావ్య తన మాటలతో కన్పీజ్‌ చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×