E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డీఎన్ఏ టెస్టుకు బ్లడ్ శాంపిల్ ఇచ్చిన కావ్య 

Brahmamudi Serial Today January 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డీఎన్ఏ టెస్టుకు బ్లడ్ శాంపిల్ ఇచ్చిన కావ్య 
Advertisement

Brahmamudi serial today Episode:

పాపతో గార్డెన్‌లో ఉన్న కావ్యను చూసి అపర్ణ, ఇంద్రాదేవి బాధపడుతుంటారు. కావ్య ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఆ పాప తన పాప కాదంటుంది. కానీ పాపకు పాలు పడుతుంది. ఆడిస్తుంది. అసలు కావ్య ఎందుకు అలా చెప్తుందో అర్థం కావడం లేదని బాధపడుతుంటారు. ఇంతలో రాజ్‌ వస్తాడు. రాజ్‌ కూడా బాధపడుతుంటాడు. కావ్య ఎందుకు అలా చేస్తుందో ఒకసారి ఆలోచించాలని అపర్ణ చెప్పగానే.. రాజ్‌ ఎమోషనల్ అవుతూ.. నీ బిడ్డను ఈ లోకానికి చూపించడం కళావతి కల.  ఆ ఆనందాన్ని అనుభవించకుండా, అసలు ఆ బిడ్డే నాది కాదు అంటుంది. అంటే నేను ఆలోచించకుండా ఉంటానా? నాకు కూడా కళావతి మాటల్లో నిజం ఉందనే అనిపిస్తుంది అమ్మ.. కానీ బిడ్డను మార్చేశారు అని హాస్పిటల్‌లో గొడవ చేయడానికి మన దగ్గర సాక్ష్యం ఉండాలి కదా..? అదేమీ లేకుండా మనమేం చేయలేము ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని రాజ్‌ చెప్తుంటే..

అప్పుడే అక్కడికి వచ్చిన అప్పును.. చూసి ఇంద్రాదేవి వెళ్లి పడుకో అప్పు.. అని చెప్తుంది. దీంతో అప్పు అక్క పడుతున్న బాధను చూడలేకపోతున్నాను అమ్మమ్మ. అక్క మాటలు డాక్టర్లు నమ్మాలన్నా.. మనకు సాక్ష్యం ఉండాలన్నా పాపకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేయిస్తే సరిపోతుంది కదా అని సలహా ఇస్తుంది. అప్పు మాటలకు రాహుల్‌, రేఖలు షాక్‌ అవుతారు. డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్‌ లేకుండా హాస్పిటల్‌ మీద కేసు కూడా వేయలేం.. అని అప్పు చెప్పగానే.. అందరూ సరే అంటారు.. అయితే ఈ టెస్ట్‌ చేయించడానికి కావ్యను రాజ్‌ ఒప్పించాలని అందరూ చెప్తారు. సరేనని రాజ్‌ వెళ్లి కావ్యకు డీఎన్‌ఏ టెస్ట్ గురించి చెప్తాడు.

Advertisement

దీంతో కావ్య నువ్వు అంటున్న మాటలు నీ మనసులో నుంచి ఊరికే రాలేదు అనిపిస్తోంది.. మీ భార్య మాటల మీద నమ్మకం ఉండి మాట్లాడుతున్నారా? లేక ఇంట్లో వాళ్ల బాధ భరించలేక నన్ను ఒప్పించడానికి వచ్చారా? అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ప్రతిమాటను ఎందుకు వేరే కోణంలో ఆలోచిస్తున్నావని అడగ్గానే.. మనకి తెలియకుండా పెద్ద నష్టం జరిగింది.. నా బాధ మీకు అనుమానంగా కనిపిస్తుంది.. కానీ నాది అనుమానం కాదు.. అక్షర సత్యం. అని కావ్య చెప్పగానే.. రాజ్‌ మాత్రం దీని వెనుక ఉన్న నిజం నిగ్గు తేల్చడానికి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను అని రాజ్‌ చెప్పగానే.. ఈ బిడ్డ మన బిడ్డ కాదని నిరూపించడానికి ఏం కావాలన్నా చేస్తానని కావ్య చెప్తుంది.

మరోవైపు రుద్రాణి మినిస్టర్‌కు కావ్య డీఎన్‌ఏ టెస్ట్‌కు వెళ్తున్నట్టు చెప్తుంది. రుద్రాణి మాటలు విన్న ధర్మేంద్ర షాక్‌ అవుతాడు. బిడ్డల్ని మార్చాం కానీ, ఆ ఫ్యామిలీని మాత్రం నమ్మించలేకపోతున్నాం.. అంటూ టెన్షన్‌ పడుతుంటాడు ధర్మేంద్ర. దీంతో రుద్రాణి  ఇంకా నయం ఆ కావ్య లాగా ఈ బిడ్డ నా పాప కాదని మీ ఆవిడ కనుక గుర్తుపట్టుంటే కథ వేరేలా ఉండేదని రుద్రాణి చెప్పగానే.. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ చాలు… మళ్లీ కొత్త టెన్షన్ వద్దు అంటాడు ధర్మేంద్ర.

Advertisement

రుద్రాణి మాత్రం డీఎన్ఏ టెస్ట్ కారణంగా కావ్యకు తన దగ్గర ఉన్న బిడ్డ.. తన కన్నకూతురు కాదని తెలిసిపోతుంది. మీ హాస్పిటల్‌లోనే ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. నిజం తెలిస్తే మీ భార్య తట్టుకోగలదా? తనకు పుట్టిన పాప త్వరలోనే చనిపోతుందని తెలిస్తే తను తట్టుకోగలదా? అని రుద్రాణి మరింత బెదిరిస్తుంది. దీంతో మినిష్టర్‌ నేను ఇదంతా చేసింది నా భార్య కోసమే.. తన కోసం ఏమైనా చేస్తాను అని చెప్పగానే.. మీ భార్య మీకు దక్కాలన్నా.. ఆ కుటుంబం మీద ఉన్న నా పగ తీరాలన్నా మీరు వాళ్లను ఆపాలి డీఎన్‌ఏ టెస్ట్‌ జరగకుండా చూడాలి అని చెప్తుంది రుద్రాణి. మినిస్టర్‌ సరే అంటాడు.

మరుసటి రోజు డాక్టర్‌ వచ్చి డీఎన్‌ఏ టెస్ట్‌ కోసం కావ్య, పాప బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకుని వెళ్తాడు. కావ్య, రాజ్‌తో ఎమోషనల్ అవుతుంది. ఈ పరీక్ష ద్వారా అయినా నా మాటల్లో నిజం మీకు తెలుస్తుంది అని చెప్తుంది. తర్వాత కావ్య పరిస్థితి గురించి అపర్ణ, సుభాష్‌ తలుచుకుని బాధపడుతుంటారు. డీఎన్ఏ టెస్ట్‌లో ఆ పాప.. కావ్య కూతురేనని వస్తే బాగుండని కోరుకుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×