E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పాపకు డీఎన్ఏ టెస్ట్ చేయిద్దామన్న రాజ్ 

Brahmamudi Serial Today January 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పాపకు డీఎన్ఏ టెస్ట్ చేయిద్దామన్న రాజ్ 
Advertisement

Brahmamudi serial today Episode:

మినిస్టర్‌ దర్మేంద్ర భార్య తులసి పాపను ఆడిస్తూ ఉంటుంది. దర్మేంద్ర ఒకసారి పాపను తాను ఆడిస్తానని తనకు ఇవ్వమని అడుగుతాడు. దీంతో తులసి ఇవ్వనని నా పాప నాతో ఉండాలని కావాలంటే నేను నిద్రపోయినప్పుడు మీరు తీసుకుని ఆడించండని చెప్పి పాపను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడే దర్మేంద్ర ఇంటికి రుద్రాణి వస్తుంది. రుద్రాణిని చూసి షాకింగ్‌ గా మంత్రి బయటకు వెళ్తాడు. ఏంటి రుద్రాణి గారు మళ్లీ వచ్చారు. ఏం కావాలో చెప్పండి అని అడగ్గానే.. మీకు ముప్పు ఇంకా తప్పిపోలేదని కావ్య చాలా కాన్ఫిడెంట్‌గా ఆ పాప తన పాప కాదని పట్టుదలగా ఉందని కావ్య పట్టుదల గురించి నాకు తెలుసు.. తను అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్తుంది అని రుద్రాణి హెచ్చరించగానే..

ధర్మేంద్ర అంతే పట్టుదలగా ఒకవేళ పరిస్థితి అంతదాకా వస్తే నా డబ్బు పరపతి ఉపయోగిస్తాను. పాపను వదులుకోవాల్సి వస్తే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు అంటూ ధర్మేంద్ర చెప్తాడు. ఎందుకైనా మంచిది అక్కడ ఇంట్లో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు మా పిల్లల ద్వారా తెలుసుకుని మీకు చెప్తుంటాను. మీరు అందుకు తగ్గట్టుగా జాగ్రత్త పడితే చాలు అని చెప్పి రుద్రాణి వెళ్లిపోతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో పాప ఏడుస్తూనే ఉంటుంది. పాప ఏడుపు ఆపేందుకు అపర్ణ, ఇంద్రాదేవి, ధాన్యలక్ష్మీ ప్రయత్నిస్తుంటారు. కానీ పాప ఏడుపు ఆపదు. దీంతో ఇంద్రాదేవి కోపంగాకావ్యను తిడుతూ పాప ఏడుపు ఆపాలంటే తల్లిపాలు, తల్లి స్పర్శ ఉండాలని కానీ కావ్య మాత్రం పాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు కదా..? అంటుంది. అపర్ణ కూడా బాధగా అన్ని తెలిసి మనం ఏమీ చేయలేకపోతున్నాము అత్తయ్యా అంటుంది. ఇంతలో పాప ఏడుపు కంటిన్యూ వస్తుండటంతో అది విన్న కావ్య తన రూంలోంచి పరుగెత్తుకుంటూ వచ్చి పాపను తీసుకుని వెళ్లి పాలు పడుతుంది. దీంతో పాప ఏడుపు ఆపేస్తుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

Advertisement

రేఖ మాత్రం ఇరిటేటింగ్‌గా ఫీలవుతూ రాహుల్ దగ్గరకు వెళ్తుంది. కోపంగా ఓరేయ్‌ అన్నయ్య అసలు మీరు చెప్పిందేంటి..? ఇక్కడ జరుగుతున్నదేంటి..? మీరు చెప్పిన దానికి ఇక్కడ రివర్స్‌ లో జరుగుతుంది. ఇలాగే జరిగితే రాజ్‌ బావ ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని నిలదీస్తుంది. దీంతో రాహుల్‌ అయ్యో రేఖ కావ్య పాపకు పాలు పట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అయినట్టు కాదు.. కావ్య ఎప్పటికీ ఆ పాప తన పాప కాదనే చెప్తుంది. తన పాప కోసం కావ్య ఇంట్లో వాళ్లతో గొడవ చేస్తుంది. చివరకు ఆ గొడవ పెద్దదై రాజ్‌, కావ్యను దూరం చేసుకునే దాకా వెళ్తుంది. అప్పుడు రాజ్‌ కచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాడు అంటూ రాహుల్‌ తన మాటలతో రేఖను కన్వీన్స్‌ చేస్తాడు. అయితే సరే అంటూ రేఖ వెళ్లిపోతుంది.   హాల్లో అందరూ కూర్చుని ఉండగా.. కావ్య వస్తుంది. ఇక నుంచి నేనే పాపకు పాలు పడతాను. పాలు పెరగడానికి ఏం చేయాలి అమ్మమ్మ అని అడగ్గానే.. అపర్ణ, ఇంద్రాదేవి సంతోషంగా కావ్యకు అన్ని విషయాలు చెప్తారు.

ఇంతలో రాజ్‌ అక్కడికి వచ్చి కళావతి థాంక్స్‌.. అని చెప్పగానే.. కావ్య దేనికండి థాంక్స్‌ అని అడుగుతుంది. పాపను ఇంత త్వరగా అంగీకరిస్తావని అనుకోలేదు.. నువ్వు రూంలోనే ఉండు నీకేం కావాలో చెప్పు అన్ని నీ దగ్గరకే వస్తాయి. అని చెప్పడంతో అలా ఏం కాదు నేను బయటకు వెళ్లకపోతే నా పాప ఎక్కడుందో ఎలా తెలుస్తుంది. ఈ  పాపను వాళ్ల అమ్మనాన్నలకు ఇచ్చేసి మన పాపను తీసుకురావాలి కదా..? అంటూ కావ్య చెప్తుంటే అందరూ షాక్‌ అవుతారు. తర్వాత రోజు కావ్య పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకుని  అసలు నువ్వు ఎవరు? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఇక్కడికి ఎలా వచ్చావు..? అని మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అపర్ణ, ఇంద్రాదేవి కూడా కావ్య మాటల్లో నిజం ఉండొచ్చని అనుకుంటారు.

Advertisement

అదంతా వింటున్న రాజ్‌ కావ్య దగ్గరకు వెళ్లి పాపకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేయిద్దామని చెప్తాడు. అంతా వింటున్న రేఖ వెంటనే విషయం రుద్రాణికి చెప్తుంది. రుద్రాణి వెంటనే మంత్రి దర్మేంద్ర దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×