E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్టేషన్ నుంచి తప్పించుకున్న రాజ్  

Brahmamudi Serial Today January 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్టేషన్ నుంచి తప్పించుకున్న రాజ్  
Advertisement

Brahmamudi serial today Episode:

కళ్యాణ్‌ కు ఫోన్‌ చేసిన రాజ్‌ ఇప్పటి దాకా ఎంత కష్టమైనా ఈ కేసులోంచి బయటకురావాలనుకున్నాను కానీ తప్పు చేయక తప్పడం లేదు కళ్యాణ్ అని చెప్పగానే.. కళ్యాన్‌ అనుమానంగా ఏమంటున్నావు అన్నయ్యా అని అడుగుతాడు. దీంతో రాజ్‌ ఓరేయ్‌ ప్రస్తుతం నాకు ఇంత కన్నా మార్గం తెలియడం లేదురా..? ఒక్కసారి నువ్వు స్టేషన్‌కు ఫోన్‌ చేసి చెప్పమన్నట్టు చేయ్‌ అని తన ప్లాన్‌ చెప్తాడు. అలా చేస్తే ప్రాబ్లమ్‌ అవుతుందేమో కదా అనగానే.. ఏం కాదురా కావ్య ప్రాబ్లమ్‌ కన్నా నాకు ఎక్కువ ప్రాబ్లమ్‌ ఏమీ కాదురా అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు రాజ్. తర్వాత రాజ్‌ చెప్పినట్టు కళ్యాణ్‌ చేస్తాడు. తన ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి స్టేషన్‌లో ఒక క్యారేజ్‌ ఇవ్వమని చెప్తాడు. క్యారేజ్‌ స్టేషన్‌లో ఇవ్వగానే.. కళ్యాణ్‌కు ఫోన్‌ చేస్తాడు.

వెంటనే కళ్యాణ్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి మీ స్టేషన్‌లో బాంబు పెట్టారు అని చెప్పగానే.. పోలీసులు షాక్‌ అవుతారు. స్టేషన్‌లో ఉన్న ఖైదీలను తీసుకుని బయటకు పరుగుపెడతారు. అందరూ బయటకు వెళ్లి రోడ్డు మీద నిలబడతారు. ఇంతలో కళ్యాణ్‌ బైక్‌ మీద వచ్చి రాజ్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతలో బాంబు స్వ్కాడ్‌ వచ్చి చెక్‌ చేస్తుంది. బాంబు ఎక్కడా లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడే రాజ్‌ ఎస్కేప్‌ అయిన విషయం తెలుసుకుంటారు. ఎస్సై వెంటనే అప్పుకు కాల్‌ చేస్తాడు. అపూర్వ మీ బావ రాజ్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకున్నాడు అని చెప్పగానే.. అప్పు షాక్‌ అవుతుంది. సార్‌ ఏమంటున్నారు అని అడుగుతుంది. డిపార్ట్‌మెంట్‌ కళ్లు కప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు సరాసరి హాస్పిటల్‌ కే వస్తాడు. మీ బావను నువ్వే అరెస్ట్‌ చేసి అప్పగించాలి అని చెప్పగానే.. అప్పు బాధగా ఏంటి సార్‌ ఇది అని అడుగుతుంది.

Advertisement

పోలీసులు అంటే ఆటలుగా ఉంది మీ బావకు అందుకే వేషాలు వేస్తున్నాడు.. అని చెప్పగానే.. అప్పు సార్‌ నేను ఆఫ్‌ డ్యూటీలో ఉన్నాను సార్‌ అని చెప్తుంది. పోలీసులు అంటేనే డ్యూటీ బాధ్యత.. అన్‌ డ్యూటీ.. ఆఫ్‌ డ్యూటీ అంటూ ఏమీ ఉండదు.. అందుకే నీకు అప్పజెప్తున్నాను అంటాడు ఎస్సై.. దీంతో అప్పు.. సార్‌ మా బావ స్టేషన్‌ నుంచి తప్పించుకోవడం తప్పే సార్‌ కానీ అదేదో మీరే వచ్చి అరెస్ట్‌ చేయోచ్చు కదా..? అని అప్పు చెప్పగానే.. డిపార్ట్‌మెంట్‌ మొత్తం చూస్తుండగానే.. మా కళ్లు కప్పి తప్పించుకున్నాడు. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలని చెప్తున్నాను.. మీ బావను నువ్వే అరెస్ట్‌ చేసి తీసుకురా..? అని ఎస్సె చెప్పగానే.. అది కాదు సార్‌ నేను చెప్పేది ఒకసారి వినండి… అని చెప్పబోతుంటే.. నో ఇట్స్‌ మై ఆర్డర్‌ వన్‌ అవర్‌లో స్టేషన్‌ లో వాడు ఉండాలి.. మన టీంను పంపిస్తున్నాను.. అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు.

మరోవైపు ఐసీయూలో ఉన్న కావ్య ఏడుస్తూ.. రాజ్‌ను కలవరిస్తుంది.. డాక్టర్‌ చెప్పినా వినదు.. రాజ్‌ వచ్చే వరకు ఆపరేషన్‌ చేయోద్దని అడుగుతుంది. ఇంతలో రాజ్‌ వస్తాడు. అందరూ రాజ్‌ ను చూసి హ్యాపీగా కావ్య దగ్గరకు వెళ్లమని చెప్పగానే రాజ్‌ ఐసీయూలోకి వెళ్తుంటే.. అప్పు వచ్చి అడ్డుకుంటుంది. దీంతో అందరూ అప్పును తిడతారు.. అయినా వినకుండా అప్పు రాజ్‌ ను  అరెస్ట్‌ చేయబోతుంటే అందరూ అడ్డు పడతారు.. రాజ్‌ ను ఐసీయూలోకి పంపిస్తారు.. ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్‌ చేయ్యవే అంటూ అడ్డు పతారు..

Advertisement

దీంతో అప్పు వచ్చిన కానిస్టేబుల్స్‌ ను ఐసీయూలోకి వెళ్లబోతుంటే.. అందరూ అడ్డుకుంటారు.. మరోవైపు రాజ్‌ను చూసిన కావ్య హ్యాపీగా ఉంటుంది. నేను ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను.. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆపరేషన్ చేయించుకో కళావతి అని రాజ్‌ చెప్పగానే.. కావ్య సరే అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×